అన్వేషించండి

Pawan Kalyan: పల్లెటూర్లలో రోడ్లకు ఇక మహర్దశ! పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

AP Roads News: ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకు అధికారులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. గ్రామాల్లో రోడ్ల బాగుపై చర్చలు చేశారు.

Pawan Kalyan News: ఏపీలో గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. రూ.4,976 కోట్లు నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలకు చురుగ్గా కార్యరూపం ఇవ్వాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలనతోపాటు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయనే విషయాన్ని అందరం గుర్తుంచుకోవాలన్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు మరింత కోరదామని చెప్పారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారులు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఎ.ఐ.ఐ.బి.) అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. 

సమీక్షలో ఎ.ఐ.ఐ.బి అధికారులు ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్డు ప్రాజెక్టు గురించి పవన్ కళ్యాణ్ కి వివరించారు. 250కి మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారుల అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో మొదలైన ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యతతో కూడిన రహదారుల నిర్మాణం సాధ్యపడుతుందని చెప్పారు. నెలకు రూ.200 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడితే ఈ ప్రాజెక్టులో అద్భుతమైన పురోగతి ఉంటుందని తెలిపారు. అందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.75 కోట్ల మ్యాచింగ్ గ్రాంటు సమకూరిస్తే బ్యాంకు రూ.125 కోట్ల రుణం మంజూరు చేస్తుందన్నారు.

గత ప్రభుత్వ హయాంలో బిల్లుల చెల్లింపులో జాప్యం
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “గత ప్రభుత్వం హయాంలో బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ ప్రక్రియ కుంటుబడింది. ఆ సమస్యను పరిష్కరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యతతో కూడిన రహదారులు అందుబాటులోకి వచ్చేవి. తద్వారా గ్రామీణ అభివృద్ధి సాధ్యపడేది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారి ప్రాజెక్టు ద్వారా రహదారుల నిర్మాణం, నిర్వహణ సక్రమంగా సాగేలా చూడాల్సిన బాధ్యత మేం తీసుకుంటాం. పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం పనుల్లో పారదర్శకతను ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో సమీక్షించేందుకు ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేయాలి.

ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన 30 శాతం మ్యాచింగ్ గ్రాంటును 10 శాతానికి తగ్గించే విధంగా అవసరమైన మార్పులు చేయాలని కేంద్రం ప్రభుత్వాన్ని కోరతామ”న్నారు. ఈ సమావేశంలో ఎ.ఐ.ఐ.బి. అధికారులు శ్రీ ఫర్హాద్ అహ్మద్, డా.అశోక్ కుమార్, శ్రీ శివరామకృష్ణ శాస్త్రి, పంచాయతీరాజ్ శాఖ చీఫ్ ఇంజినీర్ శ్రీ బాలూ నాయక్, ఏపీఆర్ఆర్పీ అధికారులు శ్రీ సి.వి.సుబ్బారెడ్డి, శ్రీ పి.వి.రమణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vote For Note Case: ఆళ్ల రామక్రిష్ణారెడ్డికి సుప్రీంలో గట్టి షాక్! తీవ్రంగా మందలించిన ధర్మాసనం
ఆళ్ల రామక్రిష్ణారెడ్డికి సుప్రీంలో గట్టి షాక్! తీవ్రంగా మందలించిన ధర్మాసనం
KTR News: నాకు ఏ ఫాం హౌస్ లేదు- సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ఫాం హౌస్‌లు చెక్ చేద్దామా? కేటీఆర్ ఛాలెంజ్
నాకు ఏ ఫాం హౌస్ లేదు- సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ఫాం హౌస్‌లు చెక్ చేద్దామా? కేటీఆర్ ఛాలెంజ్
Andhra Pradesh: వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు
Andhra Pradesh: వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు
Kolkata: కోల్‌కతా కేసులో మరో సంచలనం, అనాథ శవాలు అమ్ముకున్న మాజీ ప్రిన్సిపల్ - బంగ్లాదేశ్‌తోనూ లింక్‌లు
కోల్‌కతా కేసులో మరో సంచలనం, అనాథ శవాలు అమ్ముకున్న మాజీ ప్రిన్సిపల్ - బంగ్లాదేశ్‌తోనూ లింక్‌లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jay Shah ICC Chairman Race | ఐసీసీ ఛైర్మనైన అత్యంత పిన్నవయస్కుడిగా జై షా రికార్డు సృష్టిస్తారా.?Rishabh Pant Rajinikanth Photo Hints CSK | రజినీ స్టైల్లో రిషభ్ ఫోటో..ఫ్యాన్స్ లో మొదలైన చర్చ | ABPYuvraj Singh Biopic Announced | రెండు ప్రపంచ కప్పుల విజేత జీవిత చరిత్ర సినిమా రూపంలో | ABP DesamHyderabad Lightning  Strikes | భారీ ఉరుములతో దద్దరిల్లిన హైదరాబాద్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vote For Note Case: ఆళ్ల రామక్రిష్ణారెడ్డికి సుప్రీంలో గట్టి షాక్! తీవ్రంగా మందలించిన ధర్మాసనం
ఆళ్ల రామక్రిష్ణారెడ్డికి సుప్రీంలో గట్టి షాక్! తీవ్రంగా మందలించిన ధర్మాసనం
KTR News: నాకు ఏ ఫాం హౌస్ లేదు- సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ఫాం హౌస్‌లు చెక్ చేద్దామా? కేటీఆర్ ఛాలెంజ్
నాకు ఏ ఫాం హౌస్ లేదు- సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ఫాం హౌస్‌లు చెక్ చేద్దామా? కేటీఆర్ ఛాలెంజ్
Andhra Pradesh: వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు
Andhra Pradesh: వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు
Kolkata: కోల్‌కతా కేసులో మరో సంచలనం, అనాథ శవాలు అమ్ముకున్న మాజీ ప్రిన్సిపల్ - బంగ్లాదేశ్‌తోనూ లింక్‌లు
కోల్‌కతా కేసులో మరో సంచలనం, అనాథ శవాలు అమ్ముకున్న మాజీ ప్రిన్సిపల్ - బంగ్లాదేశ్‌తోనూ లింక్‌లు
Rahul Gandhi: రాహుల్ గాంధీకి ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్‌, హిందువులపై దాడులు ఆయన ప్లానే - బంగ్లాదేశ్ జర్నలిస్ట్ సంచలన ఆర్టికల్‌
రాహుల్ గాంధీకి ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్‌, హిందువులపై దాడులు ఆయన ప్లానే - బంగ్లాదేశ్ జర్నలిస్ట్ సంచలన ఆర్టికల్‌
Bigg Boss Telugu 8: ‘బిగ్ బాస్’ సీజన్ 8.. అఫీషియల్ డేట్ వచ్చేసింది - ఎప్పుడు, ఎన్ని గంటల నుంచి మొదలంటే..
‘బిగ్ బాస్’ సీజన్ 8.. అఫీషియల్ డేట్ వచ్చేసింది - ఎప్పుడు, ఎన్ని గంటల నుంచి మొదలంటే..
Tadipatri : తాడిపత్రిలోనే ఉంటా - పోరాటం చేస్తుంటా- పెద్దారెడ్డి సంచలన కామెంట్స్
తాడిపత్రిలోనే ఉంటా - పోరాటం చేస్తుంటా- పెద్దారెడ్డి సంచలన కామెంట్స్
Telangana : వరంగల్ బీఆర్‌ఎస్‌లో డిష్యూం డిష్యూం- ఒకరు కేసీఆర్‌కు సన్నిహితులు మరొకరు కేటీఆర్‌ ఫ్రెండ్‌
వరంగల్ బీఆర్‌ఎస్‌లో డిష్యూం డిష్యూం- ఒకరు కేసీఆర్‌కు సన్నిహితులు మరొకరు కేటీఆర్‌ ఫ్రెండ్‌
Embed widget