అన్వేషించండి

Pawan Kalyan Meets Devendra Fadnavis : రాష్ట్రానికి రెండు ఆడపులులను సాధించిన కొమరం పులి! మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక భేటీ

Pawan Kalyan Tiger Conservation Eastern Ghats: చికిత్స కోసం ముంబై వెళ్లిన పవన్ కల్యాణ్ అక్కడ మహారాష్ట్ర సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పులుల అంశంపై చర్చించారు

Inbreeding Problem Tigers : ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణి సంరక్షణ చరిత్రలో ఒక అపూర్వమైన మైలురాయి నమోదైంది. ఏపీ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్  తనదైన శైలిలో పట్టుబట్టి రాష్ట్రానికి రెండు ఆడ పులులను సాధించారు. మంగళవారం ముంబైలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలతో పాటు తూర్పు కనుమలలో వన్యప్రాణుల రక్షణపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో అంతరించిపోతున్న పులుల వంశవృద్ధికి సహాయంగా మహారాష్ట్ర అడవుల నుండి రెండు ఆడ పులులను ఏపీకి తరలించేందుకు  దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.   

 తూర్పు కనుమల్లో ‘ఇన్-బ్రీడింగ్’ సమస్యకు చెక్ - జన్యు వైవిధ్యానికి ఊతం! 

ఈ భేటీ అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  తూర్పు కనుమల  పరిధిలో, ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతంలో గత కొంతకాలంగా ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆడ పులుల కొరత కారణంగా పులుల మధ్య అంతరసంతానోత్పత్తి సమస్యలు తలెత్తి, పుట్టే పిల్లల్లో జన్యుపరమైన లోపాలు వస్తున్నాయని శాస్త్రీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్లిష్టమైన సమస్యను అధిగమించడానికి మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చే రెండు ఆడ పులులు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని పవన్ వివరించారు. ఈ కొత్త పులుల ప్రవేశంతో తూర్పు కనుమలలో జన్యు వైవిధ్యం పెరిగి, రాబోయే రోజుల్లో పులుల సంఖ్య దీర్ఘకాలికంగా స్థిరపడటానికి, ఆరోగ్యకరమైన ఆవాస వ్యవస్థ ఏర్పడటానికి దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
 
కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ మార్గదర్శకత్వం! 

వన్యప్రాణుల సంరక్షణ కోసం పవన్ కళ్యాణ్ కేవలం ఒకే ఒక్క భేటీతో ఈ  ఫలితాన్ని సాధించలేదు. దీని వెనుక పక్కా ప్లానింగ్ ఉంది. రెండు వారాల క్రితమే ఆయన ఢిల్లీ పర్యటనలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ను కలిసి నల్లమలలో పులుల పునరుద్ధరణపై చర్చించారు. కేంద్ర నిబంధనల ప్రకారం వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిపుణుల సలహాల మేరకు ఈ ట్రాన్స్‌లొకేషన్ ప్రాజెక్టును రూపొందించారు. ఈ సందర్భంగా నిరంతరం మార్గదర్శకత్వం వహించిన కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్‌కు, పెద్ద మనసుతో రెండు ఆడ పులులను కేటాయించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. 

 కొమరం పులి పర్యావరణ అడుగులు! 

 గతంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల నుండి తప్పించుకుని ఏపీ అడవుల్లోకి ప్రవేశించిన ఒక పులిని ఎలాంటి ప్రాణనష్టం లేకుండా సురక్షితంగా రక్షించిన ఏపీ అటవీ శాఖ పనితీరును మహారాష్ట్ర వైల్డ్‌లైఫ్ విభాగాలు అభినందించాయి. సినిమా రంగంలో  కొమరం పులి  గా అలరించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు నిజజీవితంలో పర్యావరణ పరిరక్షకుడిగా మారి పులుల రక్షణ కోసం అంతరాష్ట్ర భాగస్వామ్యాలను  ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని  పర్యావరణ వేత్తలు అభినందిస్తున్నారు. కుమ్కీ ఏనుగులను తీసుకురావడం నుం డి టైగర్ కన్జర్వేషన్ ప్రాజెక్టుల వరకు పవన్ తీసుకుంటున్న శాస్త్రీయ నిర్ణయాలు బ్యూరోక్రసీని సైతం ఆకట్టుకుంటున్నాయి.   

 సరిహద్దులు దాటిన వన్యప్రాణి సంరక్షణ బంధం 

శాస్త్రీయ విధానాలు, స్థిరమైన వన్యప్రాణి నిర్వహణ ఆధారంగా జీవ వైవిధ్య పరిరక్షణకు ఏపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయనే విషయాన్ని ఈ సంయుక్త కార్యాచరణ ప్రతిబింబిస్తోంది. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, రాబోయే తరాలకు పచ్చని అడవులను, మూగజీవాలను కాపాడి అందించాలనే ఉన్నత ఆశయంతో ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మహారాష్ట్ర నుంచి త్వరలోనే ఈ రెండు ఆడ పులులను ప్రత్యేక రక్షణ వలయంలో ఏపీకి తరలించి, క్వారంటైన్ అనంతరం నల్లమల లేదా శేషాచలం అడవుల్లోకి విడుదల చేయనున్నారు. ఈ చారిత్రాత్మక ఒప్పందంతో ఏపీ అడవులకు మళ్లీ పూర్వవైభవం రావడం ఖాయంగా కనిపిస్తోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో ఫ్రెండ్లీ పోటీలు తప్పవా? - టీడీపీ, జనసేన మధ్య ఏం జరగబోతోంది?
స్థానిక ఎన్నికల్లో ఫ్రెండ్లీ పోటీలు తప్పవా? - టీడీపీ, జనసేన మధ్య ఏం జరగబోతోంది?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Embed widget