అన్వేషించండి

Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!

ఆస్తి వారసత్వం కోసం తనను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు, గత కొంతకాలంగా శారీరకంగా, మానసికంగా వేధిస్తూ రోడ్డున పడేశారని ఆరోపిస్తూ ఓ బాలుడు గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దత్తత బాలుడిపై వేధింపులు, రోడ్డున పడేశారని గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు.
  • 2013లో దత్తత తీసుకుని, తర్వాత శారీరక, మానసిక వేధింపులు ప్రారంభమయ్యాయి.
  • వేధింపులు తట్టుకోలేక చదువు మానేసి, ప్రస్తుతం క్యాటరింగ్ పనులు చేస్తున్నాడు.
  • కన్నవారు తిరస్కరించగా, దత్తత తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు కోరాడు.

Adopted Boy Approaches Guntur SP | గుంటూరు: తనను దత్తత తీసుకుని కొన్నేళ్ల పాటు పెంచిన తర్వాత శారీరకంగా, మానసికంగా వేధించి, చివరకు రోడ్డున పడేశారని ఆరోపిస్తూ ఒక బాలుడు న్యాయం కోసం గుంటూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. ఈ విషయం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. వేధింపులు తట్టుకోలేక చదువు సైతం మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 

దత్తత తల్లిదండ్రుల వేధింపులు..

బాధిత బాలుడు గిరి నాగ సాయి సాకేత్ తెలిపిన వివరాల ప్రకారం.. 2013లో అద్దేపల్లి సురేష్ బాబు, వెంకట మీనా దంపతులు గుడివాడ శ్రీదేవి, రమేష్ దంపతుల వద్ద నుంచి తనను చట్టబద్ధంగా దత్తత తీసుకున్నారు. అప్పటికే వారికి ఇద్దరు కుమార్తెలు ఉండటంతో, వారసుడిగా మగబిడ్డ కావాలనే ఉద్దేశంతోనే తనను దత్తత తీసుకున్నట్లు బాలుడు తన ఫిర్యాదులో తెలిపాడు. దత్తత తీసుకున్న కొంతకాలం పాటు బాగానే చూసుకున్నప్పటికీ, గత కొన్ని సంవత్సరాలుగా తనపై తీవ్ర శారీరక, మానసిక వేధింపులు ప్రారంభించారని బాలుడు ఆరోపించాడు. 

దుష్ప్రచారం చేస్తున్నారని చదువు ఆపేశాను..

తన గురించి సమాజంలో తప్పుడు ప్రచారం చేస్తూ తీవ్ర అవమానాలకు గురిచేశారని, ఈ వేధింపుల తట్టుకోలేక చదువును కూడా మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చిందని బాలుడు వాపోయాడు. ప్రస్తుతం గుంటూరులోని గాంధీ పార్కు వద్ద క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపాడు. ఈ విషయంపై గతంలో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

Also Read: Alluri Crime News: 8 ఏళ్ల చిన్నారిపై పాస్టర్ అమానుషం.. వేడి అట్లకాడతో వాతలు పెడుతూ ఫోన్ లో రికార్డ్

ఇలాంటి కష్ట పరిస్థితుల్లో కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లగా.. తమకు ఆర్థిక స్తోమత లేదని, పోషించలేమని చెప్పి వారు కూడా తిరిగి పంపించేశారని బాలుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆర్థిక స్థోమత లేక కన్నవారూ కూడా కాదనడంతో.. దత్తత తీసుకున్న తల్లిదండ్రులే పూర్తి బాధ్యత వహించి, చట్ట ప్రకారం తనను పోషించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేశాడు. పాపం బాలుడికి చిన్నతనంలోనే ఎన్ని కష్టాలో అని స్థానికులు అంటున్నారు.

 

Frequently Asked Questions

గుంటూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించిన బాలుడి సమస్య ఏమిటి?

దత్తత తీసుకున్న తల్లిదండ్రులు తనను శారీరకంగా, మానసికంగా వేధించి, చివరకు రోడ్డున పడేశారని బాలుడు ఆరోపించాడు. దీనిపై న్యాయం కోసం ఎస్పీని ఆశ్రయించాడు.

ఎస్పీని ఆశ్రయించిన బాలుడి పేరు ఏమిటి? అతన్ని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు ఎవరు?

బాధిత బాలుడు గిరి నాగ సాయి సాకేత్. అద్దేపల్లి సురేష్ బాబు, వెంకట మీనా దంపతులు 2013లో అతన్ని దత్తత తీసుకున్నారు.

వేధింపుల కారణంగా బాలుడికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి?

వేధింపులు తట్టుకోలేక చదువు మధ్యలోనే ఆపేశాడు. ప్రస్తుతం గుంటూరులోని గాంధీ పార్కు వద్ద క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget