అన్వేషించండి

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం - 2025 నాటికి పూర్తి చేయాలనేదే లక్ష్యం

Bhogapuram Airport: ఏపీలో భోగాపురం ఎయిర్ పోర్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపు రూ.5 వేల కోట్లతో దీన్ని అభివృద్ధి చేయనున్నారు.

Bhogapuram Airport: ఉత్తరాంధ్ర అభివృద్ధికి చుక్కాని అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ  ఏడాది మే 3న ఏపీ సీఎం జగన్ ఎయిర్ పోర్టుకు భూమి పూజ చేసి లాంచనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.5 వేల కోట్లతో దీన్ని అభివృద్ధి చేయమన్నారు. 2025 నాటికి 60 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యంతో తొలి దశ పనులు పూర్తి చేయాలన్నదే లక్ష్యంతో జీఎంఆర్ సంస్థ అడుగులు వేస్తోంది.

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఈ విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం 2,203 ఎకరాలు కేటాయించింది.  నిర్వాసితుల పునరావాసం, పరిహారం సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించింది. దీంతో నిర్మాణ సంస్థ పూర్తి స్థాయిలో పనులు మొదలుపెట్టింది. తొలుత విమానాశ్రయ భూమి చుట్టూ భారీ ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టింది. పటిష్టమైన స్తంభాలను నిర్మించి దానిపై పలకలతో దాదాపు 10 అడుగుల ఎత్తు వరకు ఈ ప్రహరీ ఉంది. దానిపై ఇనుప కంచెను ఏర్పాటు చేయనున్నారు.

పొడవైన రన్ వే

కీలకమైన రన్ వే నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించడానికి నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తుంది. భారీ విమానాలు దిగడానికి వీలుగా 3.8 కిలోమీటర్ల పొడవున పటిష్టంగా దీన్ని నిర్మించాల్సి ఉంది. భూమి అంతా ఓ క్రమంలో లేకపోవడంతో తొలుత సగటును పది అడుగుల ఎత్తున మట్టితో చదును చేయడానికి సిద్ధం అవుతున్నారు. 

నేరుగా రోడ్డు అనుసంధానం

చెన్నై -  కోల్ కతా జాతీయ రహదారిపై ఇటు విశాఖపట్నం, అటు శ్రీకాకుళం, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా విమానాశ్రయంలోకి వెళ్లేలా అనుసంధాన రహదారిని నిర్మించనున్నారు. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు ఇబ్బంది లేకుండా అనుసంధాన రహదారిని కలిపేందుకు 8 సంఖ్య ఆకారంలో ట్రంపెట్ నిర్మాణం చేపడుతున్నారు. దీని కోసం 25 ఎకరాల భూసేకరణ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. సంబంధిత రైతులకు సుమారు రూ.18 కోట్లు పరిహారం చెల్లించింది. ఇక విమానాశ్రయానికి ప్రత్యేకంగా విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు ముక్కం పంచాయతీలో 5.47 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.

సమీపంలోని స్టాఫ్ క్వార్టర్లు

విమానాశ్రయంలో వివిధ హోదాల్లో పని చేసే అధికారులు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా స్టాఫ్ క్వార్టర్లను జీఎంఆర్ సంస్థ నిర్మించనుంది. ఆ సంస్థ వినతి మేరకు ప్రభుత్వం 25 ఎకరాల భూమి కేటాయించింది. ఇందులో 20 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి జాతీయ రహదారి నుంచి 8.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

అన్ని అడ్డంకులను అధిగమించి

విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన భూమి అంతా నిర్మాణ సంస్థకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులన్నింటిలో ప్రభుత్వం విజయం సాధించింది. 4 గ్రామాల నిర్వాసితులకు దాదాపు రూ.80 కోట్ల వ్యయంతో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పునరావాస కాలనీలను నిర్మించి, మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. త్వరలోనే ఎయిర్ పోర్టు పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

KK Surveys Kiran: కేకే సర్వేస్ కిరణ్ రాజకీయ ఎంట్రీ.. 'ఏకం' పేరుతో కొత్త పొలిటికల్ ప్లాట్‌ఫామ్.. నేరుగా ఎన్నికల బరిలోకి!
కేకే సర్వేస్ కిరణ్ రాజకీయ ఎంట్రీ.. 'ఏకం' పేరుతో కొత్త పొలిటికల్ ప్లాట్‌ఫామ్.. నేరుగా ఎన్నికల బరిలోకి!
Govt Doctors Dismissed: ఏపీ ప్రభుత్వం కన్నెర్ర.. 70 మంది డాక్టర్లపై వేటు వేసిన మంత్రి సత్యకుమార్ !
ఏపీ ప్రభుత్వం కన్నెర్ర.. 70 మంది డాక్టర్లపై వేటు వేసిన మంత్రి సత్యకుమార్ !
Rayalaseema Fruit Bowl: ఫ్రూట్ బౌల్‌గా రాయలసీమ, నీళ్లుంటే రైతులు బంగారం పండిస్తారు: ఏపీ సీఎం చంద్రబాబు
ఫ్రూట్ బౌల్‌గా రాయలసీమ, నీళ్లుంటే రైతులు బంగారం పండిస్తారు: ఏపీ సీఎం చంద్రబాబు
Anant Ambani: నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి... ఏపీకి ఏం చేయగలనో గైడ్ చేయండి: సీఎం చంద్రబాబును కోరిన అనంత్ అంబానీ
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి... ఏపీకి ఏం చేయగలనో గైడ్ చేయండి: సీఎం చంద్రబాబును కోరిన అనంత్ అంబానీ

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medals: ఒకేరోజు 4 స్వర్ణాలు.. ఆసియా గేమ్స్ 2026లో అదరగొట్టిన భారత బాక్సర్లు, రెజర్లు
ఒకేరోజు 4 స్వర్ణాలు.. ఆసియా గేమ్స్ 2026లో అదరగొట్టిన భారత బాక్సర్లు, రెజర్లు
Govt Doctors Dismissed: ఏపీ ప్రభుత్వం కన్నెర్ర.. 70 మంది డాక్టర్లపై వేటు వేసిన మంత్రి సత్యకుమార్ !
ఏపీ ప్రభుత్వం కన్నెర్ర.. 70 మంది డాక్టర్లపై వేటు వేసిన మంత్రి సత్యకుమార్ !
Auto Fares Hike: తెలంగాణలో ఆటో ఛార్జీలు పెంపు.. రవాణా శాఖ కీలక ఉత్తర్వులు
తెలంగాణలో ఆటో ఛార్జీలు పెంపు.. రవాణా శాఖ కీలక ఉత్తర్వులు
CM Vijay Vetri Payanam: కండక్టర్‌లా సీఎం విజయ్.. మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ ప్రారంభం!
కండక్టర్‌లా సీఎం విజయ్.. మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ ప్రారంభం!
Dilsukhnagar Santoshimatha Temple: దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయంలో అలజడి.. విగ్రహం ధ్వంసానికి యత్నించిన నిందితుడి అరెస్ట్
దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయంలో అలజడి.. విగ్రహం ధ్వంసానికి యత్నించిన నిందితుడి అరెస్ట్
ED Notices To YS Avinash Reddy: వివేకా హత్య కేసు.. విచారణకు రావాలని ఎంపీ అవినాష్‌ రెడ్డికి ఈడీ నోటీసులు
వివేకా హత్య కేసు.. విచారణకు రావాలని ఎంపీ అవినాష్‌ రెడ్డికి ఈడీ నోటీసులు
PM Modi Video Call Pilot Smith: స్మిత్ మచ్చర్‌తో ప్రధాని మోదీ వీడియో కాల్‌.. ఎవరి ప్రాణాలు పోవొద్దనే ప్రార్థించానన్న స్మిత్!
స్మిత్ మచ్చర్‌తో ప్రధాని మోదీ వీడియో కాల్‌.. ఎవరి ప్రాణాలు పోవొద్దనే ప్రార్థించానన్న స్మిత్!
IAS Training Salary : LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
Embed widget