Omicron in AP: ఏపీలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్, నిర్ధారణ పరీక్షలు పెంచాలని ప్రభుత్వం ఆదేశాలు!
Omicron Sub Variant XBB: ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కు చెందిన ఎక్స్ బీబీ 1.16 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 144 మందికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు.
Omicron Sub Variant XBB: ఆంధ్ర ప్రదేశ్ లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కు చెందిన ఎక్స్ బీబీ 1.16 కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) జారీ చేసిన జాబితాలో ఈ వేరియంట్ గురించి ప్రస్తావించింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 44, శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 14 చొప్పున కొత్తగా కరోనా కేసులు నమోదు కాగా... రాష్ట్రంలో ప్రస్తుతం 144 మందికి ఓ వేరియంట్ సోకింది. ప్రస్తుతం వీరంతా చికిత్స పొందుతున్నారు. పది మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విజయవాడ జీజీహెచ్ లో ఇన్ పేషెంట్లుగా చేరిన వారిలో జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. జ్వరం రెండు రోజుల్లో తగ్గిపోయాక దగ్గు, జలుబు వస్తుంది. చిన్న వయస్కుల్లో అయితే కళ్లల్లో ఎరుపుదనం కనిపిస్తోంది.. దీనికి కారణాలపై నిర్ధరణకు వచ్చేందుకు సమయం పడుుందని వైద్యులు చెబుతున్నారు. గతంలో మాదిరిగా గొంతు నొప్పి, ఒంటి నొప్పులు పెద్దగా లేవని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున ఏపీలోనూ పరీక్షల సంఖ్య పెంచాలని ప్రభుత్వ వర్గాలు నిర్ణయించాయి.
శనివారం రోజు సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం రోజుకు ఏపీలోనూ పరీక్షల సంఖ్య పెంచాలని ప్రభుత్వ వర్గాలు నిర్ణయించాయి. ఏపీలో ప్రస్తుతం రోజుకు వెయ్యి కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా జరగడం లేదు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని గత అనుభవాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కొవిడ్ ప్రభావంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈనెల 10వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం 5 వేల పవరకు పరీక్షలు చేసేలా సన్నద్ధమయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని అప్రమత్త చేసేందుకు ఈనెల 10, 11వ తేదీల్లో జిల్లా కేంద్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి.