అన్వేషించండి

Rajahmundry Tiger: హమ్మయ్య.. ఆపరేషన్ జాక్ సక్సెస్ - రాజమండ్రిలో చిక్కిన పులి !

Bengal tiger : తూర్పుగోదావరి జిల్లాలో గత కొన్ని రోజులుగా సాగుతున్న పులి వేట ఎట్టకేలకు సుఖాంతమైంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఆపరేషన్ జాక్ విజయవంతంగా ముగిసింది.

Rajahmundry Tiger captured : తూర్పుగోదావరి జిల్లా ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేసిన రాయవరం పులి  ఎపిసోడ్ ఎట్టకేలకు ముగిసింది. రాయవరం మండలం కూర్మాపురంలోని ఒక పాడుబడిన పాత ఇంట్లో   బెంగాల్ టైగర్‌ను అటవీ శాఖ అధికారులు , పోలీసులు అత్యంత చాకచక్యంగా బంధించారు. గత పదిహేను రోజులుగా ప్రత్తిపాడు, అనపర్తి, రామచంద్రాపురం పరిసరాలను వణికించిన ఈ పులి, చివరకు అధికారుల పకడ్బందీ ప్లాన్‌తో చిక్కింది. పాడుబడిన ఇంటి నుంచి గురక శబ్దాలు వస్తున్నట్లు గుర్తించిన అధికారులు, అది గాఢ నిద్రలో ఉండగానే ఆపరేషన్‌ను వేగవంతం చేశారు.

నిజానికి పులిని బోనులోకి రప్పించేందుకు అధికారులు వేసిన ఎర ఫలించకపోవడంతో, ప్లాన్-బి ని అమలులోకి తెచ్చారు. శిథిలావస్థలో ఉన్న ఆ ఇంటి లోపలికి వెళ్లడం ప్రాణసంకటమని భావించిన అధికారులు, ఇంటి పైకప్పు నుంచి రంధ్రం చేసి పులి కదలికలను నిశితంగా గమనించారు.  డ్రోన్ కెమెరాల సాయంతో పులి ఎక్కడ నక్కి ఉందో కచ్చితంగా గుర్తించారు. సమయం కోసం వేచి చూసిన షూటర్లు,  ఆ ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో మత్తు ఇంజక్షన్‌ను   గురి తప్పకుండా షూట్ చేశారు.

మత్తు ఇంజక్షన్ తగలగానే కాసేపు గర్జించిన ఆ బెంగాల్ టైగర్, కొద్దిసేపటికే మత్తులోకి జారుకుంది. పులి పూర్తిగా స్పృహ కోల్పోయిందని నిర్ధారించుకున్న తర్వాత, అటవీ శాఖ సిబ్బంది,  పోలీసులు అత్యంత జాగ్రత్తగా లోపలికి ప్రవేశించి దానిని నెట్‌ సహాయంతో బంధించారు. అనంతరం సురక్షితంగా బయటకు తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలోకి తరలించారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో కూర్మాపురం గ్రామస్తులతో పాటు జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది.

గతంలో కాకినాడ జిల్లాలో పులిని పట్టుకునేందుకు నెలల తరబడి కష్టపడాల్సి వచ్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి అధికారులు అత్యంత వేగంగా స్పందించారు. 144 సెక్షన్ విధించి, నైట్ విజన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించడం వల్లే ఈ విజయం సాధ్యమైందని అధికారులు తెలిపారు. పట్టుబడిన పులిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం జూ పార్కుకు లేదా సురక్షితమైన అటవీ ప్రాంతానికి తరలించనున్నారు. దీంతో గత రెండు వారాలుగా సాగుతున్న పులి భయం నుంచి ప్రజలకు విముక్తి లభించినట్లయింది.


   

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Embed widget