అన్వేషించండి

Pawan Kalyan: కులాలు, ప్రాంతాలుగా విడిపోయినా.. హిందూధర్మం ఒక్కటే --భక్తులు మౌనం వీడాలని పవన్ కల్యాణ్ పిలుపు!

Hindu Dharma : హిందూ ధర్మ పరిరక్షణ కోసం భక్తులు మౌనం వీడాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. దేవుడిపై కేవలం భక్తి ఉంటే సరిపోదని, ఆ భక్తికి రక్షణ కవచంగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు.

Pawan Kalyan called devotees For Hindu Dharma:    తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రం కావడం మొదలుకొని హిందూ దేవాలయాల పవిత్రతపై జరుగుతున్న దాడులను ఉదహరిస్తూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భక్తులకు కీలకమైన పిలుపునిచ్చారు. ప్రతి భక్తుడికీ ఒక ధార్మిక బాధ్యత ఉంటుందని, దేవుడిపై కేవలం భక్తి ఉంటే సరిపోదని, ఆ భక్తికి రక్షణ కవచంగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు. మన ఆరాధ్య దైవాలను లేదా ధర్మాన్ని ఎవరైనా అవహేళన చేసినప్పుడు బాధపడుతూ మౌనంగా ఉండిపోవడం ఇకపై సరికాదని..తమ ఆగ్రహాన్ని గళమెత్తి చాటాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ మేరకు సోషల్ మీడియాలో  ఇంగ్లిష్‌లో, హిందీలో పోస్టులు పెట్టారు. 

మన విడిపోయిన మన ఆరాధ్య దైవాలు ఒక్కటే ! 

మనం కులాలు, భాషలు, ప్రాంతాలు లేదా వివిధ పద్ధతులతో విడిపోయి ఉండవచ్చు, కానీ మన ధర్మం,  మన ఆరాధ్య దైవాలు ఒక్కటేనని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా హిందూ ధర్మాన్ని , భక్తుల విశ్వాసాలను అవమానించినప్పుడు... భక్తులు తమ ఆగ్రహాన్ని బహిరంగంగా నిరసించడం అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మౌనంగా ఉండటం వల్ల హిందూ ధర్మం   గొంతు బలహీనపడుతుందని, అందుకే ప్రతి భక్తుడు కేవలం ఆరాధకుడిగానే కాకుండా తన విశ్వాసానికి రక్షకుడు కావాలని ఆయన ఆకాంక్షించారు.

ధర్మ పరిరక్షణ ఇతర మతాలకు వ్యతిరేకం కాదు! 

ధర్మ రక్షణ అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదని పవన్ కల్యాణ్ చాలా స్పష్టంగా వివరించారు. ఎవరినీ అవమానించడం లేదా ఎవరిపైనో ద్వేషం పెంచుకోవడం హిందూ ధర్మం  ఉద్దేశం కాదని, కేవలం మన ధర్మం   గౌరవాన్ని, మర్యాదను కాపాడుకోవడం మాత్రమేనని ఆయన నొక్కి చెబుతున్నారు.  సనాతన ధర్మం  వసుధైవ కుటుంబకం  అని బోధిస్తుందని, అయితే ఆ ధర్మాన్ని అగౌరవపరిచే వారి పట్ల మౌనంగా ఉండటం చేతకానితనం అవుతుందని ఆయన హెచ్చరించారు.   

ఏపీ పరిణామాలతో పవన్ మరింత దూకుడుగా ధర్మరక్షణ ఉద్యమం

ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కల్యాణ్ రాజకీయాలకు అతీతంగా  ధర్మ రక్షణ అనే అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గతాన్ని వదిలేసి ముందుకు వెళ్లే ధోరణిని పక్కనపెట్టి, వర్తమానంలో ధర్మం పట్ల జరుగుతున్న అన్యాయాలను ఎదిరించాలని ఆయన కోరుతున్నారు. ఇందుకోసం  వారాహి సనాతన ధర్మ రక్షణ వింగ్ వంటి వేదికలను కూడా ఆయన సిద్ధం చేస్తున్నారు. భక్తిని సామాజిక బాధ్యతతో ముడిపెడుతూ ఆయన చేసిన ఈ  ట్వీట్ వైరల్ అవుతోంది.  

టాప్ హెడ్ లైన్స్

ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
YS Jagan Local Body Elections Strategy 2026: గెలుపోటములు కాదు.. పోటీ ముఖ్యం - లోకల్ పోల్స్‌లో క్యాడర్‌కు జగన్ సందేశం - అసలు ప్లానేంటి?
గెలుపోటములు కాదు.. పోటీ ముఖ్యం - లోకల్ పోల్స్‌లో క్యాడర్‌కు జగన్ సందేశం - అసలు ప్లానేంటి?
AP Municipal Elections: మేయర్లు, ఛైర్మన్ల నేరుగా ఎన్నిక - ఏపీ మున్సిపల్ పోరులో బిగ్ ట్విస్ట్! కూటమి పాలనకు ఇది తొలి లిట్మస్ టెస్ట్ !
మేయర్లు, ఛైర్మన్ల నేరుగా ఎన్నిక - ఏపీ మున్సిపల్ పోరులో బిగ్ ట్విస్ట్! కూటమి పాలనకు ఇది తొలి లిట్మస్ టెస్ట్ !
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Embed widget