Mla Vasantha Krishna Prasad : వైసీపీ ఎమ్మెల్యే ఆన్ ఫైర్, దేవినేని ఉమాపై రెచ్చిపోయిన వసంత కృష్ణ ప్రసాద్
Mla Vasantha Krishna Prasad : మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాజీ మంత్రి దేవినేని ఉమాపై రెచ్చిపోయారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేనిని ఓడించిన మగాడిని అంటూ వసంత కృష్ణ ప్రసాద్ ఆగ్రహంతో ఊగిపోయారు.
Mla Vasantha Krishna Prasad : మాజీ మంత్రి దేవినేని ఉమా(Devineni Uma)పై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్(Mla Vasatha krishna Prasad) విరుచుకుపడ్డారు. దేవినేని ఉమాపై చేసిన వ్యాఖ్యలు జిల్లాలలో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా(NTR District) ఇబ్రహీంపట్నం మండలంలో వాలంటీర్ లకు ఉగాది పురస్కారాలు సభలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆగ్రహంతో ఊగిపోయారు. నాలుగు సార్లు గెలిచి మంత్రిగా ఉన్న దేవినేని ఉమాను ఓడించి ఎమ్మెల్యే అయినా తాను దద్దమ్మ ఎందుకు అవుతా! అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై విమర్శలు చేసే స్థాయి దేవినేని ఉమాకు లేదన్నారు. తెలుగుదేశం(Tdp) పార్టీలోకి వెళుతున్నానని నియోజకవర్గంలో ఉమా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ మునిగిపోతున్న పడవ అని ఆ పార్టీ లోకి తానేందుకు వెళ్తానని వ్యంగ్యంగా మాట్లాడారు. మాజీ మంత్రి దేవినేని ఉమా తాను చేస్తున్న అభివృద్ధి చూడలేక తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.
నేను దమ్మున్న మగాడిని
"నాలుగు సార్లు గెలిచి, మంత్రిగా చేసిన దేవినేని ఉమాను ఓడించిన నేను దద్దమ్మా, సన్యాసి ఎలా అవుతా. నీకు మొగుడిని అవుతా. హైదరాబాద్ లో భూములు విలువ పెంచుకునేందుకు రాజధానిని ఇక్కడ నుంచి తొలగించాడు కృష్ణ ప్రసాద్ అని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. నాకు ఆ శక్తి ఉంటే రాజధాని తెచ్చి ఇబ్రహీంపట్నం, కొండపల్లిలో పెట్టేవాడిని. నేను దమ్మున్న మగాడిని. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం(Three Capitals) తీసుకున్న సమావేశంలో రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పిన ఏకైక ఎమ్మెల్యేను నేను. కృష్ణా జిల్లా వాసిగా, మైలవరం ఎమ్మెల్యేగా రాజధాని ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను. కానీ మా ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటే అది శిరోధార్యం అని చెప్పాను. అంతేకాని నీలా పనికిమాలిన మాటలు మాట్లాడలేదు దేవినేని ఉమామహేశ్వరరావు." అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మండిపడ్డారు.
సీఎం గేట్ తెరిస్తే
"నీ బొంగురు గొంతుతో ఒక మాట మాట్లాడితే నేను అనర్గళంగా పది మాటలు మాట్లాడతాను. ఈ గ్రామంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాను. కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వెళ్తానని చెబుతున్నారు. దిక్కూ మొక్కు లేని, 23 మందిలో ముగ్గురు ఎగిరిపోయి, ముఖ్యమంత్రి(Chief Minister) గారు గేట్ తెరిస్తే మొత్తం వచ్చి పక్కన కూర్చోడానికి రెడీగా ఉన్నారు. అలాంటి మునిగిపోయే పార్టీలోకి నేను వెళ్తానంటా. ఉన్న 20 మంది అసెంబ్లీకి ఒక్కరూ సరిగ్గా రారు. అలాంటి పార్టీలోకి నేను వెళ్తానని దుష్ప్రచారం చేస్తున్నారు" అని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ అన్నారు.