అన్వేషించండి

Andhra Pradesh: ఏపీలో గురువారం నుంచి ఎన్నికల నామినేషన్ల స్వీకరణ, ముఖ్యమైన తేదీలివే

Andhra Pradesh Elections 2024: ఏప్రిల్ 18న ఏపీలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని ముకేష్ కుమార్ మీనా తెలిపారు.

Andhra Pradesh CEO Mukesh Kumar Meena: అమరావతి: ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో అతి కీలక ఘ‌ట్టమైన నామినేష‌న్ల స్వీక‌ర‌ణ కార్యక్ర‌మం గురువారం (ఏప్రిల్ 18) నుంచి ప్రారంభం కానుంది. నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్ప‌టికే ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) తెలిపారు. పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్య‌ర్ధులు ఆయా క‌లెక్ట‌రేట్లో, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేష‌న్లను దాఖ‌లు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఒక్కో అభ్య‌ర్ధి గ‌రిష్టంగా నాలుగు సెట్ల‌ను దాఖ‌లు చేయ‌వ‌చ్చని, ఒక అభ్య‌ర్ధి ఏవైనా రెండు స్థానాల్లో మాత్ర‌మే పోటీ చేసేందుకు అవ‌కాశం ఉందని తెలిపారు.

 నామినేష‌న్లు దాఖ‌లు చేసే అభ్య‌ర్ధితో పాటు మ‌రో న‌లుగురిని మాత్ర‌మే ఆర్ఓ కార్యాల‌యం వ‌ర‌కు అనుమ‌తి ఇస్తారని, మిగిలిన వారిని 100 మీట‌ర్ల అవ‌త‌ల నిలిపివేస్తారన్నారు. అభ్య‌ర్ధితో మొత్తం మూడు వాహ‌నాల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుందన్నారు. పోటీ చేసే అభ్య‌ర్ధులు పార్ల‌మెంటుకు రూ.25,000, అసెంబ్లీకి రూ.10,000 ధ‌రావ‌తు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎస్‌సి, ఎస్‌టి అభ్య‌ర్ధులు దీనిలో 50 శాతం చెల్లిస్తే స‌రిపోతుందన్నారు. ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని పాటిస్తూ అభ్య‌ర్ధులు త‌మ నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ నామినేషన్ ల ప్రక్రియను పూర్తిగా  రికార్డు చేసేందుకు నామినేష‌న్లను స్వీక‌రించే గ‌దిలో, అభ్య‌ర్ధులు ప్ర‌వేశించే ద్వారాల వ‌ద్దా సిసి కెమేరాల‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  మోడ‌ల్ కోడ్ అమ‌ల్లో భాగంగా అభ్య‌ర్ధుల ఊరేగింపుల‌ను, నామినేష‌న్ దాఖ‌లు చేసే కార్య‌క్ర‌మాల‌ను సైతం వీడియో రికార్డింగ్ చేస్తారన్నారు.

ఎన్నికల ప్రక్రియ షెడ్యూలు మరియు ముఖ్య‌మైన తేదీలు:
-గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే తేదీ: 18 ఏప్రిల్ 2024 (గురువారం)
-గెజిట్ నోటిఫికేషన్ జారీ తేదీ నుంచి నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్రారంభ‌మ‌వుతుంది.
-నామినేషన్లు వేయడానికి చివరి తేదీ : 25 ఏప్రిల్ 2024 (గురువారం)
-నామినేషన్ల పరిశీలన తేదీ: 26 ఏప్రిల్ 2024 (శుక్రవారం)
-అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ: 29 ఏప్రిల్ 2024 (సోమవారం)
-పోలింగ్ తేదీ:  13 మే 2024 (సోమవారం)
-కౌంటింగ్ తేదీ : 04 జూన్ 2024 (మంగళవారం)
-ఎన్నికల ప్రక్రియ ముగిసే తేదీ : 06 జూన్ 2024 (గురువారం)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Changes In Futures And Options: చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
Weak Passwords: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Embed widget