అన్వేషించండి

ఎన్నికల అధికారుల బదిలీలపై నిషేధం, ఏపీ సీఈవో అధికారి ఎంకే మీనా

వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమీపిస్తున్న వేళ, రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు, ఉద్యోగుల బదిలీలపై  నిషేధం విధించింది.

వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమీపిస్తున్న వేళ, రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు, ఉద్యోగుల బదిలీలపై ఎన్నికల సంఘం  నిషేధం విధించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. 2024 ఓటర్ల తుది జాబితా పూర్తయ్యే వరకూ నియామకాలు, బదిలీ చేయాలంటే, ఎన్నికల ప్రధాన అధికారి నుంచి అనుమతి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఓటర్ల తుది జాబితా రూపకల్పనలో భాగస్వాములైన సిబ్బంది ఖాళీలపైనా, మంగళవారం లోపు వివరాలు సమర్పించాలని ఎంకే మీనా సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల ప్రక్రియలో ఉన్న వారి బదిలీ చేయడం కుదరదని స్పష్టం చేశారు. 2023 అక్టోబర్ 27 నాటికి ముసాయిదా జాబితా, 2024 జనవరి 5 తేదీ నాటికి ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామన్నారు.  

2024 జనవరి 5 నాటికి ఓటర్ల తుది జాబితా 
2024 ఓటర్ల తుది జాబితా రూపొందే వరకూ నియామకాలు, బదిలీలపై ఎన్నికల ప్రధానాధికారి అనుమతి తీసుకోవాలని ఎంకే మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ల తుది జాబితా రూపకల్పనలో భాగస్వాములైన సిబ్బంది ఖాళీల పైనా వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ వివరాలు ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు, ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల ప్రక్రియలోని అధికారులు, ఉద్యోగుల బదిలీకి వీల్లేదని స్పష్టం చేశారు. ఫోటో ఓటర్ల తుది జాబితా రూపకల్పన కోసం అన్ని ఖాళీలను పదవ లోగా భర్తీ చేయాలని సూచించారు. 2023 అక్టోబర్ 27 నాటికి ముసాయిదా జాబితా, అలాగే 2024 జనవరి 5 తేదీ నాటికి ఓటర్ల తుది జాబితా వెల్లడిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

వాలంటీర్లను భాగస్వామ్యం చేయవద్దు
మరోవైపు ఎన్నికల విధుల్లో వాలంటీర్లను భాగస్వాముల్ని చేయొద్దని ఆదేశించినా, వారి ప్రమేయం ఎందుకు ఉంటోందని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సీరియస్ అయింది. ఇకపై ఇలాంటి ఫిర్యాదులు వస్తే సహించేది లేదని, వాలంటీర్లు ఎవరి ఆధీనంలో పనిచేస్తున్నారని ప్రశ్నించింది. వాలంటీర్లు ఎవరి అనుమతితో వారు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని, ఇంటింటి సర్వేకు వాలంటీర్లను బీఎల్‌వోలు ఎందుకు తీసుకెళ్తున్నారని మండిపడింది. ఓట్ల తొలగింపు, మార్పులు, చేర్పులకు సంబంధించి దరఖాస్తుల తిరస్కరణపై ఆరా తీసింది. భారీగా ఓట్లు ఎందుకు తొలగించారని, తొలగించే ముందు వారికి నోటీసులిచ్చారా నిలదీసింది. 

లోపాలకు పూర్తి బాధ్యత వారిదే
కొంతకాలంగా ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లు భారీగా తొలగించారని, అధికార పార్టీకి అనుకూలంగా భారీగా బోగస్‌ ఓట్లు చేర్పించారనే ఆరోపణలు వచ్చాయి. అలాంటి వాటికి అస్కారమివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఉద్దేశపూర్వకంగా ఓట్లు తొలగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనని, బీఎల్‌వోలకు ఈ అంశాల పట్ల అవగాహన కల్పించాలని సూచించింది. 175 నియోజకవర్గాల పరిధిలో వచ్చే ఫిర్యాదులన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించింది. ఇంటిలో ఒకే డోర్‌ నంబర్‌తో భారీగా ఓట్లు, జీరో డోర్‌ నంబర్‌తో లక్షల ఓట్లపైన ఎన్నికల సంఘం సీరియస్ అయింది. బూత్‌, నియోజకవర్గ స్థాయిలో ఏ అధికారి ఓట్ల నమోదు ప్రక్రియ పరిశీలించి ఖరారు చేస్తారో వారే తప్పులు, లోపాలకు పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించింది ఎన్నికల సంఘం. 

టాప్ హెడ్ లైన్స్

MLC Nagababu Cabinet Rank: కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?
కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?
Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
Breaking News: ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Embed widget