Andhra Pradesh: అనంత జిల్లాలో ఎన్ఐఏ సోదాలు - ఉగ్రవాదులతో లింక్స్‌పై ఆరా
Breaking News: అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపాయి. ఓ రిటైర్జ్ హెచ్ఎం ఇంట్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి అధికారులు సోదాలు చేశారు.
NIA Raids In Rayadurgam: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూర్ వీధికి చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు మంగళవారం ఉదయం సోదాలు చేశారు. కొందరు యువకులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ సమాచారంతో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ ఇంట్లో సోదాలు చేసిన అధికారులు.. ఆయన కుమారుల గురించి ప్రశ్నించినట్లు సమాచారం. అబ్దుల్ కుమారులు కొంతకాలంగా బెంగుళూరులో నివసిస్తున్నారు. అయితే, వారు అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు. వారికి ఉగ్రవాదులతో లింక్స్ ఉన్నాయని ఆరోపణలు రావడంతో కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. అబ్దుల్ కుమారుడి ఎస్బీఐ అకౌంట్ కు ఇటీవల అధిక మొత్తంలో నగదు జమ అయ్యినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై కూడా ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గతంలోనూ సోదాలు
కాగా, గతంలోనూ ఎన్ఐఏ అధికారులు అనంతపురం పట్టణంలో అనుమానితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. తాజాగా, రాయదుర్గంలో సోదాలు చేయడంతో ఒక్కసారిగా స్థానికంగా ఆందోళన నెలకొంది.
Also Read: Palnadu News: పల్నాడు: మగవాళ్లు ఊరొదిలి ఎందుకు వెళ్లారు? ఆడవారు గుడిలో ఎందుకు దాక్కున్నారు?