Wine Shops in AP: మందు బాబులకు సర్కార్ గుడ్ న్యూస్, అర్ధరాత్రి దాకా వైన్ షాపులు ఓపెన్
AP Govt News: కొత్త సంవత్సరం సందర్బంగా మందుబాబులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయని వెల్లడించింది.
Wine Shops Open: కొత్త సంవత్సరం (New Year) సందర్బంగా మందుబాబులకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం (Government) గుడ్ న్యూస్ చెప్పింది. అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయని వెల్లడించింది. ఇవాళ, రేపు అర్ధరాత్రి 12 దాకా రాష్ట్రంలోని అన్ని మద్యం షాపులు పని చేస్తాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. బార్లు, క్లబ్బుల్లో ప్రభుత్వ అనుమతితో రాత్రి 1గంట వరకు మద్యం సరఫరా చేసుకోవచ్చని సూచించింది. భారీ ఆదాయాన్ని ఆర్జించాలన్న లక్ష్యంతోనే అర్ధరాత్రి 12గంటల వరకు మద్యం షాపులకు అనుమతి ఇచ్చింది. కొత్త సంవత్సరం సందర్భంగా మద్యానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం షాపులు...అర్ధరాత్రి దాకా నడిపించుకోవచ్చని సూచించింది.
తెలంగాణ ప్రభుత్వం కూడా..
మరోవైపు తెలంగాణ సర్కార్ కూడా మందు బాబులకు శుభవార్తం చెప్పింది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల పని వేళల టైమ్ నుంచి పెంచింది. అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు ఓపెన్ చూసి ఉంటాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. చెప్పారు. బార్లు, క్లబ్బులు, పర్మిషన్‌తో జరిగే ఈవెంట్లలో అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. సాధారణంగా డిసెంబర్ 31న రాష్ట్రంలో మద్యం ఏరులై పారడం కామన్. పెద్ద ఎత్తున లిక్కర్ సేల్స్ జరుగుతాయి. డిసెంబరు 31, జనవరి 1ని క్యాష్ చేసుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ వేడుకలంటే మాములుగా ఉండవు. ప్రతి ఏడాది డిసెంబరు 31న రాత్రి...న్యూ ఇయర్ స్వాగం చెబుతూ యవత చేసే హంగామా మామూలుగా ఉండదు. చుక్క, ముక్కతో ఎంజాయ్ చేయడం కామన్. అందుకే మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది.
తాగి వాహనం నడిపితే..
తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకునేందుకు హైదరాబాద్ పోలీసులు రెడీ అయ్యారు. రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నారు. తాగి వాహనాలు నడిపితే బండిని సీజ్ చేయటంతో పాటు రూ. 10 వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కొనసాగిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.