By: ABP Desam | Updated at : 29 Mar 2022 08:41 PM (IST)
మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని ( YS Jagan Cabinet ) ఏప్రిల్ 11వ తేదీన పునర్ వ్యవస్థరించనున్నారు. ఏప్రిల్ 8వ తేదీన గవర్నర్ బిశ్వభూషణ్ తో ( AP Governer ) సీఎం జగన్ భేటీ అవ్వనున్నారు. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపై గవర్నర్ కు వివరించనున్నారు. ఏప్రిల్ 11వ తేదీన ఏపీ కొత్త కేబినేట్ కొలువుదీరనుంది. ఒక రోజు ముందుగానే కొత్త మంత్రులకు సమాచారం అందస్తారని సమాచారం. మంత్రి వర్గ ప్రక్షాళన విషయాన్ని కేబినెట్ భేటీలో మంత్రులకు స్వయగా సీఎం జగనే చెప్పారు. సామజిక కారణాలతో కొంత మందిని తప్ప మిగతా అందర్నీ తొలగించబోతున్నట్లుగా స్పష్టం చేశారు. దీంతో మంత్రివర్గంలో బెర్త్ కోసం ఎమ్మెల్యేలు ( YSRCP MLAs ) చేయని ప్రయత్నాలు లేవు.
వెంటపడి మరీ గడువులోపు పూర్తి చేయండి- అధికారులకు సీఎం జగన్ ఆదేశం
మంత్రివర్గంలో చేయబోయే మార్పుల గురించి సీఎం జగన్ ఓ క్లారిటీకి వచ్చినట్టుగా చెబుతున్నారు. 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన సీఎం జగన్.. అప్పుడు ఏర్పాటు చేసిన మంత్రివర్గం రెండున్నర ఏళ్లు మాత్రమే ఉంటుందని చెప్పారు. రెండున్నరేళ్ల తర్వాత కొత్తవారికి కేబినెట్‌లో చోటు కల్పిస్తానని అన్నారు. దాదాపు 90 శాతం మంది మంత్రులను మార్చి.. తొలి విడతలో అవకాశం దక్కనివారికి అవకాశం కల్పిస్తానని సీఎం జగన్ చెప్పారు. ప్రస్తుతం ముగ్గురు మంత్రులను మాత్రమే ఉంచి.. మిగతా అందర్నీ తొలగించి కొత్త వారికి చాన్సిస్తారని తెలుస్తోంది.
ఆ కేసు కొట్టేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఎం జగన్
అయితే రెంజున్నరేళ్లు ముగిసిన తర్వాత కరోనా ( Corona ) .. ఇతర కారణాల వల్ల మంత్రివర్గ విస్తరణ చేయలేకపోయారు. ఇప్పుడు ఆ పని కూడా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. కొత్తగా మంత్రులయ్యేవారు ( New Ministers ) కుదురుకుని ఎన్నికల సమయానికి పట్టు సాధిస్తే.. విజయం సులువు అవుతుందని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ప్రస్తుతం మంత్రులుగా తొలగించబోయే వారికి జిల్లాల అధ్యక్షులుగా చాన్సివ్వబోతున్నారు. ఇరవై ఆరు కొత్త జిల్లాలను ( New Districts ) ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరవై ఆరు జిల్లాలకు అధ్యక్షుల్ని నియమించబోతున్నారు. వారిలో ఎక్కువగా మాజీ మంత్రులకు చాన్స్ ఉటుంది. ఈ క్రమంలో పాత, కొత్త మంత్రులు కలిసి పార్టీని మళ్లీ గెలిపిస్తారని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది.
Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ
Michaung cyclone Effect: కోనసీమకు పొంచి ఉన్న మిచాంగ్ తుపాను ముప్పు, రెడ్ అలెర్ట్ జారీ
Cyclone Michaung Updates: మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్, తిరుమలలో 100 మిల్లీ మీటర్ల వర్షపాతం - టూవీలర్స్ పై ఆంక్షలు
Key Announcement on AP Capital: ఏపీ రాజధాని - కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!
Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం
Sleeping on Floor Benefits : అసలు నేలమీద పడుకుంటే ఎంత మంచిదో తెలుసా?
Janagama ZP Chairman Died: జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మృతి, బీఆర్ఎస్ పార్టీలో విషాదం
/body>