అన్వేషించండి

TDP News: నెల్లూరు జిల్లాలో మహిళా నేతలకు టీడీపీ బంపర్ ఆఫర్, తొలిసారిగా బరిలోకి

TDP తొలిసారిగా టీడీపీ మహిళా నేతలకు పెద్దపీట వేసింది. వారసులే అయినా ఈసారి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇద్దరు మహిళలకు టీడీపీ టికెట్లు ఖరారు చేసింది. 

Nellore District Politics: నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మహిళా నేతల ప్రాతినిథ్యం తక్కువ. 2014లో అయినా, 2019లో అయినా ఇక్కడ ఎమ్మెల్యేలుగా పురుషులే ప్రధాన పార్టీల నుంచి అవకాశం దక్కించుకుని గెలిచారు. ప్రస్తుతం వైసీపీ లిస్ట్ లో కూడా పురుషులకే ప్రాధాన్యం ఉంది. కానీ తొలిసారిగా టీడీపీ మహిళా నేతలకు పెద్దపీట వేసింది. వారసులే అయినా ఈసారి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇద్దరు మహిళలకు టీడీపీ టికెట్లు ఖరారు చేసింది. 

కోవూరు నుంచి ప్రశాంతి రెడ్డి..
నెల్లూరు జిల్లా కోవూరులో ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు. ఈసారి కూడా ఆయనకే వైసీపీ టికెట్ ఖరారయ్యే అవకాశాలున్నాయి, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఓ దశలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డికి ఇక్కడ వైసీపీ టికెట్ ఖాయం అనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరడంతో వైసీపీ టికెట్ తనదేనంటూ ప్రసన్న రిలాక్స్ గా ఉన్నారు. అయితే వేమిరెడ్డి టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వడంతో అప్పటికే అక్కడ ఇన్ చార్జ్ గా ఉన్న పోలంరెడ్డి దినేష్ రెడ్డి లో టెన్షన్ మొదలైంది. ఈరోజు టీడీపీ లిస్ట్ బయటకు రావడంతో ఆయన ఆందోళనే నిజమైంది. కోవూరు అసెంబ్లీ సీటుని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి టీడీపీ ఖరారు చేసింది. TDP News: నెల్లూరు జిల్లాలో మహిళా నేతలకు టీడీపీ బంపర్ ఆఫర్, తొలిసారిగా బరిలోకి

కోవూరు నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు మహిళలకు ఎమ్మెల్యేగా అవకాశం రాలేదు. తొలిసారిగా ప్రధాన పార్టీ టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఇక్కడ ఛాన్స్ దొరికింది. మరి ఆమె ఈ ఎన్నికల్లో గెలిచి కోవూరు చరిత్రలో తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డ్ సృష్టిస్తారేమో చూడాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన సర్వ శక్తులు ఒడ్డి ఇక్కడ ఎలక్షన్ గెలవాలనుకుంటున్నారు. తన ప్రత్యర్థి ఎవరనేది తెలియడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలో కూడా ఆందోళన మొదలైంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. 

ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి వెంకటగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీ ప్రశాంతికి టికెట్ ఖరారు చేశారు చంద్రబాబు. వాస్తవానికి ఇక్కడ సీటు వ్యవహారం చాన్నాళ్లుగా హాట్ టాపిక్ గా ఉంది. మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల తనకే సీటు అని చెబుతూ వచ్చారు, మధ్యలో డాక్టర్ మస్తాన్ యాదవ్ రూపంలో ఆయనకు పోటీ మొదలైంది. ఆ తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీలో చేరిన తర్వాత తాను వెంకటగిరి బరిలోనే ఉంటానంటూ కొన్నిరోజులు హడావిడి చేశారు. చివరకు ఆనంకు ఆత్మకూరు ఫిక్స్ కావడంతో వెంకటగిరిలో ఇద్దరి మధ్య సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి. ఈ దశలో కురుగొండ్ల రామకృష్ణకు కాకుండా ఆయన కుమార్తె లక్ష్మీ ప్రశాంతికి చంద్రబాబు టికెట్ ఖరారు చేయడం విశేషం.


TDP News: నెల్లూరు జిల్లాలో మహిళా నేతలకు టీడీపీ బంపర్ ఆఫర్, తొలిసారిగా బరిలోకి

వెంకటగిరిలో గతంలో నేదురుమల్లి రాజ్యలక్ష్మి రెండు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ఆర్ హయాంలో ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. మళ్లీ ఇప్పుడు అక్కడ మహిళా అభ్యర్థి తెరపైకి రావడం విశేషం. టీడీపీ ఆఫర్ ను వీరిలో ఎవరు సక్సెస్ చేసుకుంటారో చూడాలి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Budget 2024-25: ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
Bandi Sanjay: లారీ కింద ప్రమాదవశాత్తు ఇరుక్కున్న యువతి - మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
లారీ కింద ప్రమాదవశాత్తు ఇరుక్కున్న యువతి - మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
Andhra Pradesh Budget 2024-25: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
Mahindra Scorpio Sales: మహీంద్రా స్కార్పియో కోసం క్రేజీ అయిపోతున్న జనాలు - షాకిస్తున్న సేల్స్ లెక్కలు!
మహీంద్రా స్కార్పియో కోసం క్రేజీ అయిపోతున్న జనాలు - షాకిస్తున్న సేల్స్ లెక్కలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆసీస్ తో టెస్టుకు రోహిత్ దూరం! కెప్టెన్ గా బుమ్రా?ట్రోలర్స్‌కి ఇచ్చి పడేసిన రౌడీ, ఒక్క వీడియోతో గప్‌చుప్బెల్టు తీస్తానన్నారు? రోజా సంచలన ట్వీట్గేమ్ చేంజర్ టీజర్ టాక్ ఎలా ఉందంటే?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Budget 2024-25: ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
Bandi Sanjay: లారీ కింద ప్రమాదవశాత్తు ఇరుక్కున్న యువతి - మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
లారీ కింద ప్రమాదవశాత్తు ఇరుక్కున్న యువతి - మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
Andhra Pradesh Budget 2024-25: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2024-25 హైలైట్స్‌ - వివిధ శాఖలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే
Mahindra Scorpio Sales: మహీంద్రా స్కార్పియో కోసం క్రేజీ అయిపోతున్న జనాలు - షాకిస్తున్న సేల్స్ లెక్కలు!
మహీంద్రా స్కార్పియో కోసం క్రేజీ అయిపోతున్న జనాలు - షాకిస్తున్న సేల్స్ లెక్కలు!
Anna Canteen: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం - పల్లెల్లో కూడా అన్న క్యాంటీన్లు 
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం - పల్లెల్లో కూడా అన్న క్యాంటీన్లు 
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్ నోట్ రాసి మరీ..
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - సూసైడ్ నోట్ రాసి మరీ..
SEO Poisoning: గూగుల్ సెర్చ్‌లో కూడా స్కామ్ - మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సైబర్ కేటుగాళ్లు!
గూగుల్ సెర్చ్‌లో కూడా స్కామ్ - మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సైబర్ కేటుగాళ్లు!
Minister Atchennaidu: 'రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక వంటిది' - రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
'రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక వంటిది' - రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
Embed widget