అన్వేషించండి

అనిల్‌కి లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్- జగన్‌తో కలిసి చర్చకు రావాలంటూ ఘాటు వ్యాఖ్యలు

లోకేష్ కూడా కాస్త ఘాటుగానే అనిల్ కి బదులిచ్చారు. సిల్లీ బచ్చా, హాఫ్ నాలెడ్జ్ అంటూ అనిల్ కి కౌంటర్ ఇచ్చారు. తనతో చర్చకు రావాలని ఆయన సరదా పడుతున్నారని, దమ్ముంటే చర్చిద్దాం రా అని పిలిచారు లోకేష్.

నెల్లూరు సిటీ ఎమ్మెల్యేైపై మరోసారి నారా లోకేష్ మాటల తూటాలు పేల్చారు. అనిల్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో చర్చకు సిద్ధమా అంటూ అనిల్ విసిరిన సవాల్ కి ప్రతి సవాల్ విసిరారు నారా లోకేష్. తాను చర్చకు సిద్ధమేనని తేల్చి చెప్పారు. చర్చకు వచ్చేటప్పుడు సీఎం జగన్ ని కూడా తీసుకు రావాలని చెప్పారు. 

నెల్లూరు యువగళం పర్యటనలో భాగంగా నాయుడుపేట సభలో నారా లోకేష్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కి సవాల్ విసిరారు. వచ్చేసారి నెల్లూరు సిటీ టికెట్ నీదే అని జగన్ తో చెప్పించగలవా అని ఛాలెంజ్ చేశారు. సిల్లీ బచ్చా, హాఫ్ నాలెడ్జ్.. అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆ సిల్లీ బచ్చా నాతో చర్చ అంటూ సరదా పడుతున్నాడంట.. రా రా వచ్చెయ్ అంటూ నాయుడుపేట సభ నుంచి పిలుపునిచ్చారు నారా లోకేష్. అవినీతి సొమ్ముతో ఆయన కొన్న పొలం దగ్గర చర్చ పెట్టుకుందామా అని అడిగారు. చర్చకు వచ్చేటప్పుడు జగన్ ని కూడా తీసుకు రావాలన్నారు. తాను నాయుడుపేటలోనే ఉన్నా వచ్చెయ్ అంటూ పిలిచారు లోకేష్. 

నెల్లూరులో గరం గరం..
నెల్లూరులో నారా లోకేష్ యువగళం పాదయాత్ర వాడివేడిగా సాగుతోంది. ఈ యాత్ర విషయంలో వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ఇటీవల కొంతకాలం మీడియాకి దూరంగా ఉన్న అనిల్, వచ్చీ రాగానా లోకేష్ పై పంచ్ లు విసిరారు. అరేయ్, ఒరేయ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు, వాడు, వీడు అంటూ తూలనాడారు. అనిల్ వ్యాఖ్యలకు ఆల్రెడీ టీడీపీ నేతలు కౌంటర్లిచ్చారు. అనిల్ నోరు అదుపులో పెట్టుకోవాలని, తమకి కూడా అలాంటి భాష వచ్చని అన్నారు. అయితే ఇప్పుడు నేరుగా లోకేష్ స్పందించడం ఈ విషయంలో కొసమెరుపు. 

లోకేష్ కూడా కాస్త ఘాటుగానే అనిల్ కి బదులిచ్చారు. సిల్లీ బచ్చా, హాఫ్ నాలెడ్జ్ అంటూ అనిల్ కి కౌంటర్ ఇచ్చారు. తనతో చర్చకు రావాలని ఆయన సరదా పడుతున్నారని, దమ్ముంటే చర్చిద్దాం రా అని పిలిచారు లోకేష్. అనిల్ హయాంలో అభివృద్ధి జరగలేదని, టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని తాను చేసినట్టు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అనిల్ హయాంలో అవినీతి జరిగిందని, అవినీతి సంపాదనతో భూములు కొనుక్కున్నారని మండిపడ్డారు. ఆ భూముల దగ్గర చర్చకు కూర్చుందామా అని సవాల్ విసిరారు లోకేష్. 

నేరుగా అనిల్ పేరెత్తలేదు కానీ.. ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు లోకేష్. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ సీటు ఆయనకి ఇస్తారా అని ప్రశ్నించారు. అలా ఇస్తారని సీఎం జగన్ తో చెప్పించగల దమ్ము అనిల్ కి ఉందా అని ప్రశ్నించారు. 

ఇటీవల అనిల్, ఆనం మధ్య రాజీనామాల సవాళ్లు వచ్చాయి. దమ్ముంటే తనతో పోటీకి రావాలని ఇరువురు ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ తాను నెల్లూరు సిటీ నుంచే మళ్లీ పోటీ చేస్తానన్నారు. అలా ఆయన సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకోవడంపై టీడీపీ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. వచ్చేసారి అనిల్ కి నెల్లూరు సిటీ సీటు జగన్ ఇవ్వరని చెబుతున్నారు. అనిల్ కి టికెట్ క్యాన్సిల్ అయిందని, అందుకే ఆయన ఫ్రస్టేషన్లో అలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదేనటి కస్తూరి అరెస్ట్‌, 14 రోజుల రిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget