Lights in Sky: ఆకాశంలో అద్భుత వెలుగులు ఫ్లయింగ్ సాసర్ కాదు పీఎస్ఎల్వీ
శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ-52 సోమవారం ఉదయం నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగ సమయంలో ఆకాశంలో అద్బుత దృశ్యాలు కనిపించాయి. ఈ ఫొటోలు , వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ-52 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 13వ తేదీ తెల్లవారుజామున 4.29 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కాగా.. నిరంతరాయంగా 25 గంటల 30 నిమిషాలపాటు కౌంట్ డౌన్ కొనసాగి పీఎస్‌ఎల్‌వీ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే, ఈ రాకెట్ ప్రయోగ సమయంలో ఆకాశంలో అద్బుత దృశ్యాలు కనిపించాయి. ఈ దృశ్యాలను వీక్షకులు తమ ఫోన్లలలో బంధించారు. వివిధ ఆకృతుల్లో ప్రకాశవంతంగా గీతలమాదిరిగా కనిపించిన ఈ దృశ్యాలను వీడియోలు తీశారు. చూసి జనం ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎప్పుడూ చూడని విధంగా ఆ వెలుగును చూసి జనం కాస్త తికమకపడ్డారు.
కానీ, ఆ తర్వాత అది రాకెట్ గమనం వల్ల ఏర్పడిన వెలుగు అని తెలుసుకున్నారు. ప్రధానంగా ఈ ఆకాశంలో ఈ వెలుగులు నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కనిపించాయి. కొన్ని చోట్ల ఆకాశంలో ఒక భారీ టార్చిలైటు మాదిరిగా వెలుగు విరజిమ్ముతూ దృశ్యం కనిపించగా.. మరికొన్ని చోట్ల అత్యంత ప్రకాశవంతంగా గజిబిజి వెలుగు దర్శనమిచ్చింది. ఈ వెలుగు కాసేపు అలాగే ఉంది. తెల్లవారు జామున నల్లటి ఆకాశంలో ఇలాంటి వెలుగు కనిపించేసరికి జనం అమితమైన ఆశ్చర్యానికి గురయ్యారు.
అయితే, గతంలో రాకెట్ ప్రయోగాలు జరిగినప్పుడు ఏనాడూ ఎలాంటి వెలుగులు కనిపించలేదు. కానీ, తాజా పీఎస్‌ఎల్వీ సి-52 ప్రయోగం అనంతరం కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
బెంగళూరు నగరం నుంచి తూర్పు వైపుగా ఆకాశం నుంచి ఇలాంటి వెలుగు కనిపించినట్లుగా కూడా అక్కడి స్థానికులు ట్వీట్లు చేశారు.
Early morning luminous streak towards the eastern side of Bangalore sky!
— Poornima Shetty (@Poori5678) February 14, 2022
This was apparently the launch of Polar Satellite Launch Vehicle, PSLV-052, scheduled at 05:59 hours on February 14, 2022 from the First Launch Pad of Satish Dhawan Space Centre, Sriharikota. pic.twitter.com/7FCwU4sPYX
Captured the PSLV in flight over Pondicherry during the morning walk. https://t.co/6IA8I8RknG pic.twitter.com/yXGdEWmY03
— Manish Kalghatgi (@manishkalghatgi) February 14, 2022