అన్వేషించండి

Oasis Fertility Center: ‘ఒయాసిస్ జనని యాత్ర’ ప్రారంభించిన ఒయాసిస్ ఫెర్టిలిటీ

Oasis Fertility Center: సంతానలేమిపై ఉన్న అపోహలు తొలగించి ప్రజలకు సేవలు మరింత చేరువ చేసేందుకు ఒయాసిస్ ఫెర్టిలిటీ సరికొత్త కార్యక్రమం చేపట్టింది.

Oasis Fertility Center: భారతదేశంలో విశ్వసనీయ ఫర్టిలిటి కేర్ చెయిన్‌గా పేరు పొందిన ఒయాసిస్ ఫెర్టిలిటీ మే నెలను మదర్స్ మంత్‌గా సెలబ్రేట్ చేసుకుంటోంది. అందులో భాగంగా మదర్స్ డేని పురస్కరించుకొని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణవ్యాప్తంగా 30 రోజుల పాటు 30 పట్టణాల్లో 'ఒయాసిస్ జనని యాత్ర' ప్రారంభించింది. ఈ యాత్రలో ఉచిత మొబైల్ ఫర్టిలిటి క్యాంప్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఒయాసిస్ ఫెర్టిలిటీ సైంటిఫిక్ హెడ్,  క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య, ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లినికల్ హెడ్,ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ దీపిక ఇతర ప్రముఖులు ప్రారంభించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో సంతానోత్పత్తి రేట్లు 1.7కి తగ్గిందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని సరిచేసుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ సరైన అవగాహన లేకపోవడంతో ఇదో ప్రజారోగ్య సమస్యగా మారిందంటున్నారు. చాలా కుటుంబాలకు, సంతానోత్పత్తి చికిత్సను పొందడం అంటే సుదూర నగరాలకు ప్రయాణించడం ప్రధాన ఇబ్బంది. ఈ ప్రయాణం ఆర్థిక ఒత్తిడికి, ఇతర సమస్యలకు కారణమవుతుంది. అంతే కాకుండా ఓ భావోద్వేగమైన ఇష్యూగా కూడా దీన్ని చూస్తున్నారు. ఇది ఒకట్రెండు రోజుల్లో పూర్తి అయ్యే పని కాదు. అందుకని ఎక్కువ రోజులపాటు ట్రావెల్ చేయాలంటే కష్టంతో కూడుకున్నదే. అందుకే సుదూర ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రులకు వెళ్లాలంటే జనం భయపడుతున్నారు. దీని కారణంగానే  ఇంటికి దగ్గరగా అందుబాటులో ఉన్న, అధిక-నాణ్యత సంతానోత్పత్తి సంరక్షణ ఆవశ్యకత గుర్తిస్తున్నారు. 


Oasis Fertility Center: ‘ఒయాసిస్ జనని యాత్ర’ ప్రారంభించిన ఒయాసిస్ ఫెర్టిలిటీ

ఈ సమస్యను టాకిల్ చేయడానికే ‘ఒయాసిస్ జనని యాత్ర’ స్టార్ట్ చేసింది. జనం తరచూ నిర్లక్ష్యం చేసే చిన్న చిన్న  సంతానలేమి కారణాలపై అవగాహన పెంచబోతోంది. జీవనశైలి మార్పులు చేసుకోవాల్సిన తక్షణావసరంపై ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంచనుంది. ఈ అవుట్రీచ్ ప్రోగ్రామ్ కింద అత్యాధునిక సదుపాయాలతో కూడిన మొబైల్ ఫెర్టిలిటీ క్లినిక్ హైదరాబాద్ నుంచి ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు పర్యటించనుంది.  ఫర్టిలిటి ఆరోగ్యంపై  ప్రజల్లో అవగాహన కలిగేలా చేస్తుంది. ఈ యాత్ర ఎక్స్‌పీరియెన్స్‌డ్‌ వైద్యులతో ఉచిత సంప్రదింపులతోపాటు మహిళలకు ఉచిత ఏఎంహెచ్, హీమోగ్లోబిన్ టెస్టులు, పురుషులకు ఉచిత వీర్య పరీక్షలు చేస్తారు. సురక్షిత, పరిశుభ్రమైన శాంపుల్ కలెక్షన్ జోన్లను సంస్థ ఏర్పాటు చేసింది. 

ముఖ్యంగా సంతానలేమిపై ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించనుంది. వయస్సు, ఒత్తిడి, ఆహారం, నిద్ర, పర్యావరణ విషతుల్యాలు, పిల్లలు పుట్టడంలో జాప్యం వంటి అంశాలపై అవగాహన పెంచనుంది. పురుషులలో వంధ్యత్వ సమస్యలు గణనీయంగా పెరగడం ఆందోళన కలిగించే అంశాలలో ఒకటి. ఆధునిక కాలపు ఒత్తిళ్లు, జీవనశైలి, పోషకాలు సరిగా తీసుకోకపోవడం, కాలుష్యాలకు గురి కావడం, డిజిటల్ ఉపకరణాలను పరిమితికి మించి ఉపయోగించడం లాంటివన్నీ దీనికి కారణాలుగా నిలుస్తున్నాయి. సంతానలేమి కేసుల్లో మగవారి అంశాలే 40-50% దాకా ఉంటున్నప్పటికీ, దాన్ని మాత్రం ప్రజలు చాలా తక్కువగానే అర్థం చేసుకున్నారు. సమాజంలో ఉన్న అపోహలు, అవగాహన లోపం కారణంగా ఈ అంశాన్ని విస్మరిస్తున్నారు.  

సైన్స్ ఆధారిత సమాచారాన్ని నేరుగా ప్రజలకు అందించడం ద్వారా ఒయాసిస్ జనని యాత్ర ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించనుంది. జీవనశైలి సంబంధిత సంతానరాహిత్యం పెరుగుతున్న నేపథ్యంలో స్త్రీ, పురుషులకు ఈ అంశంపై సాధికారత కల్పించనుంది. వారు తమ పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ముందుకు వచ్చేలా చేస్తుంది. బహుముఖ కార్యాచరణ, పటిష్ఠ రీతిలో ప్రభుత్వ సంస్థలతో కలసి పని చేయడం ద్వారా ఈ కార్యక్రమం సహానుభూతి, ఎవిడెన్స్ బేస్డ్ సంతాన సాఫల్య పరిష్కారాల కోసం  మార్కాపురం లాంటి ప్రాంతాలకు చేరుకునేలా చేస్తుంది. ఈ ప్రాంతాల్లో సంతాన సాఫల్య చికిత్సకు యాక్సెస్ పొందడం, అవగాహన లాంటి వాటిలో ఎంతో అంతరం ఉంది. 

ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ సైంటిఫిక్ హెడ్, క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ, "జీవనశైలి కారకాలు, ఆలస్యమైన కుటుంబ నియంత్రణ కారణంగా సంతానోత్పత్తి సవాళ్లు యువతను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. అనేక టైర్ 2, 3 పట్టణాలలో, పరిమిత అవగాహన, ప్రత్యేక సంరక్షణకు ప్రాధాన్యత లేకపోవడం, ఆలస్యంగా రోగ నిర్ధారణ, చికిత్సకు దారితీస్తుంది. ఒయాసిస్ జనని యాత్ర ద్వారా, పునరుత్పత్తి శాస్త్రంలో లేటెస్ట్ అప్‌డేట్‌ల ద్వారా శక్తిని పొంది, నిపుణుల సంతానోత్పత్తి సంరక్షణ, విద్యను నేరుగా పేద వర్గాలకు తీసుకురావడం ద్వారా మేము దీనిని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇది చికిత్స గురించి మాత్రమే కాదు - ఇది తల్లిదండ్రులుగా మారేలా జంటలకు విశ్వాసాన్ని పెంపొందించడం, బలమైన సపోర్టింగ్ సిస్టమ్‌ అందించడం గురించి మాట్లాడుతుంది."


Oasis Fertility Center: ‘ఒయాసిస్ జనని యాత్ర’ ప్రారంభించిన ఒయాసిస్ ఫెర్టిలిటీ

ఒయాసిస్ ఫెర్టిలిటీ  clinical హెడ్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ దీపిక మాట్లా డుతూ, ‘‘సంతానలేమి అనేది ఇకపై ఒక వైద్యపరమైన అంశం మాత్రమే కాదు. పెరిగిపోతున్న జీవనశైలి సంబంధిత సమస్య కూడా. పీసీఓడీ, తల్లిదండ్రులు కావడంలో జాప్యం, ఒత్తిళ్లు వంటి వాటితో ముడిపడి ఉన్న కేసులు పెరిగిపోతున్న సందర్భంలో సత్వర డయాగ్నసిస్ ఎంతో ముఖ్యం. ఒయాసిస్ జనని యాత్ర ద్వారా మేం నిపుణుల సంరక్షణను, అధునాతన సంతాన సాఫల్య పరిష్కారాలను ప్రతీ గుమ్మం వద్దకు తీసుకెళ్లగలుగుతున్నాం.మరీ ముఖ్యంగా ఈ తరహా సదుపాయాలు అంతగా అందుబాటులో లేని ప్రాంతాల్లో. తద్వారా సకాలంలో వారికి అండగా నిలుస్తూ, తల్లిదండ్రులం కావాలనే కోరిక ఫలించేలా చేస్తున్నాం. ’’.

ఈ కార్యక్రమం అందరికీ అందుబాటులో ఉండడం, సైన్స్ ఆధారిత సంరక్షణపై ఒయాసిస్ ఫెర్టిలిటీ అంకిత భావాన్ని చాటిచెబుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సంతానలేమి సవాళ్లు సక్రమంగా నిర్వహించి, లక్షకు పైగా ఆరోగ్యవంతమైన శిశువుల జననానికి కారణమయ్యామని సంస్థ ప్రకటించుకుంది. లేటెస్టు టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా, సంక్లిష్ట కేసుల్లో సైతం అధిక సక్సెస్ రేటు సాధించామని చెబుతోంది. మీరు ఇప్పుడు గానీ లేదా కొంతకాలం తరువాతైనా గానీ శిశువును పొందాలని భావిస్తుంటే, ఆలస్యం చేయవద్దు – సత్వర అవగాహన, ఆచరణ ముఖ్యం అంటున్నారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ కి వచ్చిన వాళ్లు సురక్షితమైన ప్రాంతంలో ఉన్నట్టు లెక్కని పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు కావాలనే కలను నిజం చేసుకునేందుకు ఓ మార్గం పొందగలుగుతారని భరోసా ఇస్తున్నారు. జనని యాత్రలో చేరండి, ఇక్కడ ప్రతి ప్రయాణం కూడా ఒక ఆశతో మొదలవుతుందని పిలుపునిచ్చారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget