అన్వేషించండి

MLA Kotamreddy: మీ బండారం బయటపెడతా - ఆ ఇద్దరు పోలీసులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి వార్నింగ్!

Nellore Police: ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగానే ఏపీలో వైసీపీకి పరాభవం తప్పదన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. 57 శాతం ఓటింగ్ తో టీడీపీ-జనసేన కూటమి 160 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లలో గెలవబోతోందన్నారు.

Nellore Rural MLA kotamreddy: నెల్లూరు జిల్లాలో ఇద్దరు పోలీసు అధికారులు అధికార పార్టీకి ఏజంట్లుగా మారిపోయారని ఆరోపించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అతి త్వరలో వారి బండారం బయటపెడతానని హెచ్చరించారు. పూర్తి ఆధారాలతోసహా ఆ ఇద్దరి గుట్టు విప్పుతానన్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులుపై కూడా కోటంరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కొల్లి రఘు రామిరెడ్డితో కలసి సీతారామాంజనేయులు వైసీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.

పోలీస్ వ్యవస్థపై తమకు గౌరవం ఉందంటూనే కొంతమంది పోలీసులపై ఆరోపణలు ఎక్కుపెట్టారు కోటంరెడ్డి. ఏపీ పోలీసుల్లో 90 శాతం మంది నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, మిగతా 10 శాతం మందితోనే సమస్య అని అన్నారు కోటంరెడ్డి. టీడీపీ నేతల్ని వేధింపులకు గురి చేస్తున్నారని, కనీసం తమ సభలకు కూడా పర్మిషన్లు ఇవ్వడం లేదని, ఒకవేళ అనుమతి ఇచ్చినా ప్రజలు రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు కోటంరెడ్డి. ఎన్ని వేధింపులు, నిర్బంధాలకు గురి చేసినా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన అధికారంలోకి రావడం ఖాయమన్నారు కోటంరెడ్డి. 

నారాయణను వేధిస్తారా..?
నెల్లూరు సిటీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నారాయణను ప్రభుత్వం రకరకాలుగా వేధిస్తోందని మండిపడ్డారు కోటంరెడ్డి. నెల్లూరు జిల్లాలో వైసీపీని వీడి అనేక మంది టీడీపీలోకి వస్తున్నారని, అది జీర్ణించుకోలేకే ఇలా కక్షసాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా టీడీపీ, జనసేన సభలకు భారీగా జనం వస్తున్నారని చెప్పారు. ఇవన్నీ భరించలేక వైసీపీ ప్రభుత్వం బరితెగించి ప్రవర్తిస్తోందన్నారు. మాజీమంత్రి నారాయణపై వేధింపులు కూడా ఇందులో భాగమేనని చెప్పారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో నారాయణపై రాష్ట్రంలో అనేక పోలీస్ స్టేషన్లలో ఎన్ని కేసులు పెట్టారో లెక్కేలేదన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఐటీవల డ్రగ్స్ పేరుతో నారాయణ కాలేజీకి వెళ్లి విధ్వంసం సృష్టించారన్నారు. తాజాగా నారాయణ అనుచరులు, వ్యాపారస్తులపై దాడులు చేశారని.. చివరికి బెడ్ రూమ్, కిచెన్ రూమ్ లోకి  కూడా వెళ్లి సోదాలు చేశారని అన్నారు. ఆడిటర్ల వద్దకు వెళ్లి నారాయణ రహస్యాలు చెప్పాలని  వేధించారని మండిపడ్డారు. 

టీడీపీ, జనసేన సభలని అడ్డుకుంటూ నేతల్ని పోలీసులు బెదిరిస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. తమ మీటింగ్ లకి వస్తే పోలీస్ స్టేషన్ కి పిలిపించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారనిల అన్నారు. ప్రజాస్వామ్యం బతకాలన్నా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగలన్నా ఏపీపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ గా దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న విషయాలన్నిటిపై కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణ చేపట్టాలన్నారు కోటంరెడ్డి. 

వాలంటీర్లకు మా సపోర్ట్..
ఏపీలో విలేజ్, వార్డ్ వాలంటీర్లు రూ.5వేల జీతానికి గొడ్డు చాకిరీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కోటంరెడ్డి. టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని భరోసా ఇచ్చారు. వాలంటీర్ల ఉద్యోగాలు తీసేయబోమని.. వారికి విద్యార్హతలను బట్టి ఉన్నత ఉద్యోగాలు వచ్చేలా చేస్తామన్నారు. 

పీకే చెప్పారుగా..
ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగానే ఏపీలో వైసీపీకి ఘోర పరాభవం తప్పదన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. 57 శాతం ఓటింగ్ తో టీడీపీ-జనసేన కూటమి 160 అసెంబ్లీ, 25 ఎంపీ  సీట్లలో గెలవబోతోందని జోస్యం చెప్పారు. జగన్ దారుణంగా ఓడిపోవడం ఖాయమన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
YSRCP DSC Protests: ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!
ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Embed widget