అన్వేషించండి

Nellore: ఈ రోజుల్లో 20 రూపాయలకే కమ్మటి భోజనం, ఎక్కడో చూడండి

Nellore Updates: ఎంత చిన్న ఊరిలో అయినా భోజనం కనీసం 50 రూపాయలుంటుంది. ఓమోస్తరు పట్టణాల్లో ప్లేటు భోజనం 70నుంచి 80 రూపాయల వరకు ఉంటుంది. అలాంటి రోజుల్లో కేవలం 20 రూపాయలకే భోజనం అందిస్తున్నాడు ఓ పెద్దాయన.

ఎంత చిన్న ఊరిలో అయినా భోజనం కనీసం 50 రూపాయలుంటుంది. ఓ మోస్తరు పట్టణాల్లో ప్లేటు భోజనం 70 నుంచి 80 రూపాయల వరకు ఉంటుంది. ఫుల్ బోజనం కావాలంటే వంద రూపాయలు దాటాల్సిందే. అలాంటి రోజుల్లో కేవలం 20 రూపాయలకే భోజనం అందిస్తున్నాడు ఓ పెద్దాయన. పేరు బాలు. ఊరు నెల్లూరు.. నెల్లూరులో ఆటో నడుపుతుండేవాడు. ఇటీవల మొబైల్ హోటల్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. అయితే అందరిలా కాకుండా కాస్త వెరైటీగా ఆలోచించాడు. పేరుకి రోడ్ సైడ్ మొబైల్ హోటల్ అయినా క్వాలిటీలో మాత్రం తీసిపోకూడదు అని నిర్ణయించుకున్నాడు. ధర కూడా రీజనబుల్ గా ఉండాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఇలా హోటల్ తెరిచాడు. ఆటోలోనే దీన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

Nellore: ఈ రోజుల్లో 20 రూపాయలకే కమ్మటి భోజనం, ఎక్కడో చూడండి

పులిహోర, పెరుగన్నం, క్యారెట్ రైస్, వెజిటబుల్ రైస్, జీరా రైస్, మిక్స్ డ్ వెజిటబుల్, మీల్ మేకర్, కరివేపాకు రైస్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ 20 రకాల భోజనం దొరుకుతుంది. ఓ కప్పులో రైస్ పెట్టి ఇచ్చేస్తారు. దీని రేటు 20 రూపాయలు. ఆ రైస్ లోకి కారం, పప్పులపొడి వేస్తారు. ఇక పార్సిల్ అయితే కడుపునిండా తినొచ్చు. పార్సిల్ రేటు 40 రూపాయలు. Nellore: ఈ రోజుల్లో 20 రూపాయలకే కమ్మటి భోజనం, ఎక్కడో చూడండి

హోటళ్లలో ఇలాంటి రైస్ దొరకొచ్చు కానీ రేటు బాగా ఎక్కువ. అందులోనూ ఈ క్వాలిటీ దొరకడం బాగా కష్టం అంటున్నారు కస్టమర్లు. చూడ్డానికి మొబైల్ క్యాంటీనే అయినా ఇక్కడ అదిరిపోయే క్వాలిటీ దొరుకుతుందని అంటున్నారు. అందుకే ప్రతిరోజూ ఇక్కడికి వచ్చి భోజనం చేస్తామని చెబుతున్నారు విద్యార్థులు. చుట్టుపక్కల ఆస్పత్రులు ఇతర ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు కూడాల ఈ హోటల్ పెట్టాక ఇంటి దగ్గరనుంచి లంచ్ బాక్స్ లు తెచ్చుకోవడం మరచిపోయారు. అందరూ మధ్యాహ్నం అవగానే ఇక్కడికి వచ్చేస్తారు. ఎంచక్కా రోజుకో రకం ఫుడ్ లాగించేస్తారు. 

Nellore: ఈ రోజుల్లో 20 రూపాయలకే కమ్మటి భోజనం, ఎక్కడో చూడండి

లాభం కాదు, క్వాలిటీయే ముఖ్యం.. 
తనకు లాభం కంటే క్వాలిటీయే ముఖ్యం అంటున్నాడు హోటల్ నిర్వాహకుడు బాలు. బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో ఇలాంటి హోటల్స్ చూసి ఇన్స్ పైర్ అయి నెల్లూరులో దీన్ని పెట్టానంటున్నాడు. కుటుంబ సభ్యులతో కలసి ఈ హోటల్ నడుపుతున్నానని చెప్పాడు. ఒకసారి వచ్చి తినివెళ్లినవారంతా తమకు పర్మినెంట్ కస్టమర్లు అవుతారని నమ్మకంగా చెబుతున్నాడు. 

వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ కి నెల్లూరు పెట్టింది పేరు. నెల్లూరులో టిఫిన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇదిగో ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ఈ బాలు ఫుడ్స్ కూడా చేరింది. ఇప్పుడు నెల్లూరులో పేరున్న హోటల్స్ గురించి చెప్పమంటే బాలు ఫుడ్స్ గురించి కూడా చెప్పేస్తున్నారు. నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్క్ రోడ్ లో బైపాస్ రోడ్ కి దగ్గర్లో ఈ బాలు ఫుడ్స్ మొబైల్ క్యాంటీన్ ఉంటుంది. పండగలు, సెలవలు ఏవీ ఉండవు.. అన్ని రోజుల్లో హోటల్ అందుబాటులో ఉంటుంది. ఓసారి మీరూ ట్రైచేసి చూడండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Ambedkar Row in Parliament: మరింత తీవ్రమవుతున్న అమిత్‌షా కామెంట్స్ వివాదం- నేడు కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనలు
మరింత తీవ్రమవుతున్న అమిత్‌షా కామెంట్స్ వివాదం- నేడు కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనలు
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Ambedkar Row in Parliament: మరింత తీవ్రమవుతున్న అమిత్‌షా కామెంట్స్ వివాదం- నేడు కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనలు
మరింత తీవ్రమవుతున్న అమిత్‌షా కామెంట్స్ వివాదం- నేడు కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనలు
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
Pushpa 2 Worldwide Collection Day 15 : 'పుష్ప 2' 15 రోజుల కలెక్షన్స్... 'బాహుబలి' రికార్డును బీట్ చేయడానికి ఇంకెంత దూరంలో ఉందో తెలుసా?
'పుష్ప 2' 15 రోజుల కలెక్షన్స్... 'బాహుబలి' రికార్డును బీట్ చేయడానికి ఇంకెంత దూరంలో ఉందో తెలుసా?
West Godavari Viral News: పార్శిల్‌లో డెడ్‌బాడీ-షాక్ తిన్న మహిళ- పశ్చిమగోదావరిలో ఘటన 
పార్శిల్‌లో డెడ్‌బాడీ-షాక్ తిన్న మహిళ- పశ్చిమగోదావరిలో ఘటన 
Dinga Dinga: జ్వరం వచ్చినా జలుబు చేసినా డ్యాన్స్ చేస్తారట, ఉగాండాను షేక్ చేస్తున్న డింగ డింగ వైరస్‌
జ్వరం వచ్చినా జలుబు చేసినా డ్యాన్స్ చేస్తారట, ఉగాండాను షేక్ చేస్తున్న డింగ డింగ వైరస్‌
Embed widget