Nellore: నెల్లూరులో అతిపెద్ద స్కామ్ బట్టబయలు - భారీ డంప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
Liquor in Nellore: గోవాలో 25 రూపాయలకు క్వార్టర్ బాటిల్ ని కొని నెల్లూరు జిల్లాలో 100 రూపాయలకు వాటిని విక్రయించేవారు. గోవా మద్యానికి స్టిక్కర్లు మార్చి ఇక్కడ అమ్ముతున్నారు.
Nellore Liquor Scam: నెల్లూరులో అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఇది. బహుశా ఇటీవల కాలంలో రాష్ట్రంలోనే ఇది పెద్ద లిక్కర్ ఇల్లీగల్ బిజినెస్ అని చెప్పొచ్చు. ఇందులో ప్రభుత్వ మద్యం దుకాణాల సూపర్ వైజర్ల ప్రమేయం కూడా ఉండటం మరో విశేషం. మొత్తం ఎనిమిది మందిని ఇప్పటి వరకూ అరెస్ట్ చేయగా మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుంచి 18 వేల మద్యం బాటిళ్లను సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గోవా నుంచి నెల్లూరు జిల్లై మైపాడుకి తారు ట్యాంకర్ల ద్వారా మద్యాన్ని తరలించేవారు. గోవాలో 25 రూపాయలకు క్వార్టర్ బాటిల్ ని కొని నెల్లూరు జిల్లాలో 100 రూపాయలకు వాటిని విక్రయించేవారు. గోవా మద్యానికి స్టిక్కర్లు మార్చి ఇక్కడ అమ్ముతున్నారు. వీరిపై నిఘా పెట్టిన నెల్లూరు పోలీసులు ఈ స్కామ్ ని ఛేదించారు. మద్యం సిండికేట్ ముఠా వెనుక ఎవ్వరు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు ఎస్పీ విజయరావు. అసాంఘిక కార్యకలాపాలకి ఎవ్వరు పాల్పడ్డా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పలు రకాల దొంగతనాలు చేస్తున్న దొంగను అరెస్ట్ చేసిన కావలి I- టౌన్ పోలీసులు
— Nellore Police (@sp_nlr) March 29, 2022
ముద్దాయి వద్ద నుండి సుమారు Rs.4,20,000/- విలువ చేసే 3- మోటార్ బైక్ లు,TAB-1,LAPTAP-1,CAMERA-1 మరియు 8 మొబైల్ ఫోన్ లను స్వాధీనంచేసుకొన్న కావలి I-టౌన్ పోలీసులు #accused #arrested #nellorepolice @APPOLICE100 pic.twitter.com/BeJoIsfZ0b
నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, వరికుంటపాడు, ఇందుకూరుపేట వంటి ప్రాంతాల్లో ఇలా మద్యం విక్రయాలు చేసినట్టుగా పోలీసు అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఈ నకిలీ బ్రాండ్లను అమ్ముతున్నారు. ఇవాళ ఉదయం ఇందుకూరుపేట దగ్గర నిర్వహించిన సోదాల్లో నకిలీ మద్యం బాటిల్స్ ను SEB అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహరంలో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లాలోనే ఈ వ్యవహరం జరిగిందా లేదా ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి కుంభకోణం జరుగుతోందా? అనే విషయంలో కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలను తగ్గించింది. అయితే మద్యం ద్వారా ఏపీ ప్రభుత్వం ఆదాయం గతంలో కంటే రెట్టింపైందని టీడీపీ విమర్శలు చేస్తుంది.