By: ABP Desam | Updated at : 25 May 2022 09:40 PM (IST)
ఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల
Atmakur By Election to be held On 23 June 2022: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న 7 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఏపీలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఒకటి. ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఎలక్షన్ కమిషన్ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఇప్పటికే అధికార వైఎస్సార్‌సీపీ ఇక్కడ గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రచార బరిలోకి దింపింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా విక్రమ్ రెడ్డి జనంలోకి వెళ్తున్నారు.
ఉప ఎన్నికల షెడ్యూల్ ఇదీ..
నామినేషన్ల ప్రారంభం మే 30, 2022
నామినేషన్ల చివరి తేదీ జూన్ 6, 2022
ఎన్నికల తేదీ 23 జూన్,2022
కౌంటింగ్, ఫలితాల ప్రకటన 26 జూన్, 2022
ప్రచారంలో ముందున్న విక్రమ్ రెడ్డి
ఆత్మకూరు ఉప ఎన్నిక విషయంలో అధికార వైసీపీ స్పీడ్ గా ఉంది. అభ్యర్థి పేరుని అధికారికంగా ప్రకటించడం లాంఛనమే అయినా ముందుగానే మేకపాటి విక్రమ్ రెడ్డి పరిచయ కార్యక్రమాల పేరుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి దగ్గరుండి మరీ విక్రమ్ రెడ్డిని జనంలోకి తీసుకెళ్తున్నారు. ఒకరకంగా విక్రమ్ రెడ్డి ప్రచారంలో ముందున్నారనే చెప్పాలి.
ఇక బీజేపీ తరఫున మేకపాటి కుటుంబానికి బంధువైన బిజివేముల రవీంద్రనాథ్ రెడ్డి బరిలో దిగుతారనే ప్రచారం జరుగుతోంది. రవీంద్రనాథ్ రెడ్డి తనని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించుకున్నా... పార్టీనుంచి అలాంటి ప్రకటన ఏదీ అధికారికంగా విడుదల కాలేదు. మరణించినవారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తున్నారు కాబట్టి టీడీపీ సంప్రదాయాన్ని పాటీస్తూ అభ్యర్థిని నిలబెట్టే అవకాశం లేదు. ఇక జనసేన కూడా ఇటీవల బద్వేల్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని బరిలో దింపలేదు, ప్రచారానికి రాలేదు. సో.. ఇక్కడ ప్రస్తుతానికి ద్విముఖ పోరు తప్పనిసరి అనిపిస్తోంది. ఇక చిన్నా చితకా పార్టీలు కూడా ఆత్మకూరు బరిలో నిలబడాలనే ఉత్సాహంతో ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరిగే స్థానాలివి..
పంజాబ్ లోని సంగూర్ లోక్ సభ స్థానం, ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్, అజాంఘడ్ లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే త్రిపురలో నాలుగు చోట్ల, ఢిల్లీలోని రాజేందర్ నగర్, జార్ఖండ్ లోని మందర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల జరుగుతుంది. ఏపీ విషయానికొస్తే.. ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరుగుతుంది. ఏపీలో ప్రస్తుతం రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఉప ఎన్నికల విషయంలో కూడా రాజకీయాలు వాడివేడిగా సాగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వైసీపీ వర్సెస్ బీజేపీగా ఉన్న రాజకీయాలు.. ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.
Also Read: MLC Suspend YSRCP : ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్ - కీలక నిర్ణయం తీసుకున్న వైఎస్ఆర్‌సీపీ !
Nara lokesh on cyclone rehabilitation: జగన్ ప్రభుత్వం ఫెయిలైంది, తుపాను సహాయంపై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు
Cyclone Michaung: నెల్లూరులో పునరావాస కేంద్రాలు, మంత్రికి కష్టాలు చెప్పుకున్న బాధితులు
Cyclonic Michaung live updates: బాపట్ల తీరాన్ని దాటిన మిగ్ జాం తుపాను - గంటకు 90 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు
Heavy Rains in Andhra Due to Michaung Cyclone: తీరాన్ని తాకిన మిగ్ జాం తుపాను - జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులతో బీభత్సం
AP Inter Fees: ‘ఇంటర్’ పరీక్ష ఫీజు చెల్లించడానికి నేడే ఆఖరు, ఆలస్య రుసుముతో ఎప్పటివరకు అవకాశమంటే?
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు
Telangana Congress : తెలంగాణ నుంచి కాంగ్రెస్కు ఎంపీలు జీరో - ముగ్గురూ రాజీనామా చేయక తప్పదా ?
Suriya - Karthi: 'మిగ్జాం' తుఫాన్ బాధితులకు సూర్య, కార్తీ ఆర్థిక సాయం - మరి మన స్టార్స్?
/body>