By: ABP Desam | Updated at : 26 Mar 2022 01:33 PM (IST)
నెల్లూరు జడ్పీ మీటింగ్‌లో అధికారులపై ఆనం ఆగ్రహం
నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సొంత పార్టీలోనే ప్రతిపక్షంగా గుర్తింపు పొందారు. ఆ ఇమేజ్‌ను ఆయన అలా కొనసాగిస్తున్నారు. తాజాగా జిల్లా పరిషత్ మీటింగ్‌లో ఆయన మరోసారి ఉగ్రావతారం ఎత్తారు. అధికారులపై విరుచుకుపడ్డారు. అభివృద్ధి సమావేశాలంటే.. ప్రజాప్రతినిధులంటే జిల్లా అధికారులకు లెక్క లేదని మండి పడ్డారు.
స్వపక్షంలో విపక్షంగా ఆనం !
జిల్లా పరిషత్ సమావేశాలు సహజంగా మొక్కుబడిగానే జరుగుతుంటాయి. అందులోనూ నెల్లూరు జిల్లాలో అసలు విపక్షమే లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలంతా వైఎస్ఆర్‌సీపీ వారే. బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఉన్నా.. ఆయన అదిరించి బెదిరించి మాట్లాడే టైప్ కాదు. కానీ స్వపక్షంలో విపక్షంలా.. నెల్లూరు జడ్పీ సమావేశంలో ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు అసలు సమావేశానికి ఎందుకు రాలేదంటూ నిలదీశారు. సమావేశానికి రాని అధికారులపై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించారు.
అధికారులపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక
మత్స్యశాఖ జేడీపై ఆనం అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. " జేడీగారు మీరు జిల్లాలో ఎప్పుడు జాయిన్ అయ్యారండీ" అంటూ మర్యాదగా మొదలు పెట్టి.. మీ దర్శనమే మాకు గగనం అయిపోయిందంటూ సెటైర్లు వేశారు. మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారమటూ నిలదీశారు. ప్రైవేటు వ్యక్తులు మత్స్య సంపదను దోచుకుంటుంటే మత్యశాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. జిల్లా పరిషత్ మీటింగ్ అంటే అధికారులకు అంత చులకనైపోయిందా అంటూ నిలదీశారు. ఎమ్మెల్యే ఆనం ఉగ్రరూపం దాల్చడంతో పక్కనే ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా సైలెంట్ గా ఉన్నారు.నెల్లూరు వైఎస్ఆర్‌సీపీలో తనకు ప్రాధాన్యం దక్కడం లేదని ఆనం చాలా రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ మాటలే అధికారులు వింటూ ఉంటారు. ఈ కారణంగా తాను ఇస్తున్న ఆదేశాలను కూడా అధికారులు పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి ఆనంలో ఉంది. గతంలో మాఫియా అంటూ కూడా విమర్శుల చేశారు. ఇప్పుడు నేరుగానే అవకాశం దొరకగానే మండిపడ్డారు.
హైకమాండ్ దృష్టిలో పడేందుకేనా ?
నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం మంత్రి పదవుల వ్యవహారంపై హాట్ డిస్కషన్ జరుగుతోంది. కొత్తగా ఎవరిని మంత్రి వర్గంలోకి తీసుకుంటారా, ఆ అదృష్టవంతులెవరా అనే చర్చ నడుస్తోంది. సీనియార్టీ ప్రకారం ఆనం రామనారాయణ రెడ్డికి గతంలోనే మంత్రి పదవి రావాల్సి ఉన్నా.. ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు. దీంతో ఆయన పేరు లిస్ట్ లో లేకుండా పోయింది. రెండో దఫా అయినా ఆయన పేరు వినపడుతుందేమోనని అనుకుంటున్నారు ఆయన అభిమానులు. మంత్రి పదవి ఇవ్వకపోయినా కనీసం అసెంబ్లీ స్పీకర్ పదవి అయినా ఆయనకు దక్కుతుందనే వాదన కూడా ఉంది. అయితే ఈ సమయంలో మరోసారి ఆనం, జిల్లాలో హాట్ టాపిక్ గా మారారు. అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nellore Wonder Kid: అక్షరాలతో ఆటలు, మ్యాథ్స్ తో గేమ్స్ - ఈ నెల్లూరు బాలిక సూపర్ అంతే
Nellore Pistol: నెల్లూరులో రెండు ప్రాణాలు తీసిన పిస్టల్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టిన పోలీసులు, కీలక విషయాలు
Nellore Candle Rally Protest: తలలు నిమిరారు, బుగ్గలు తమిడారు, ఇప్పుడెక్కడికి పోయారు: సీఎం జగన్కు మహిళల సూటిప్రశ్న
Nellore to Kanyakumari Cycle Ride: నెల్లూరు నుంచి కన్యాకుమారికి 1500 కి.మీ సైకిల్ రైడ్, మహేష్ బాబుకు యువకుడి ట్రిబ్యూట్ - కారణం ఏంటంటే !
Sri Talpa Giri: దక్షిణ శ్రీరంగం తల్పగిరి రంగనాథ మందిరం- ఈ గుడిలో అదే జరిగితే కలియగం అంతమైనట్టేనటా!
Nikhat Zareen Profile: ఓవర్నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్ది 12 ఏళ్ల శ్రమ!
CM Jagan Davos Tour : సీఎం జగన్ దావోస్ పర్యటన, పెట్టుబడులే టార్గెట్!
Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!
NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు