News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Kakani Comments: క్రాప్ హాలిడేపై కస్సుమన్న మంత్రి కాకాణి, రెచ్చగొట్టడం వల్లేనని వ్యాఖ్యలు

కొంతమంది రైతుల్ని రెచ్చగొట్టి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, అసలు క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితులు ఏపీలో లేవని వివరించారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. 

FOLLOW US: 
Share:

తమది రైతు ప్రభుత్వం అని వైసీపీ ప్రచారం చేసుకుంటుంది. రైతు భరోసా పథకం, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం వంటి ప్రయోజనాలు కల్పిస్తున్నామని చెబుతారు నేతలు. మరోవైపు ఏపీలో క్రాప్ హాలిడే అంటూ కొంతమంది రైతులు పంటల్ని వేయలేమని నిర్ణయించడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అయితే కొంతమంది రైతుల్ని రెచ్చగొట్టి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, అసలు క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితులు ఏపీలో లేవని వివరించారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. 

ఒక్క మండలంలో కూడా కరువు లేనందుకు క్రాప్ హాలిడే ప్రకటిస్తారా..? అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక, మూడేళ్లలో లక్ష కోట్లకు పైగా రైతులకు సాయం చేశామని చెప్పారు. రైతుల విషయంలో చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని, రైతులను దోచుకోవడంలో టీడీపీ కొత్త పంథాలు అనుసరించిందని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో "రైతు రథం"  పథకాన్ని కమీషన్ల పథకంగా మార్చారని విమర్శించారు. బాబు హయాంలోనే రైతులు నిజమైన క్రాప్ హాలిడే ప్రకటించారని, ఇప్పుడు ఆ బురదను తమ ప్రభుత్వానికి అంటించాలన్నదే వారి ఆరాటం అని విరుచుకుపడ్డారు కాకాణి. 

క్రాప్ హాలిడే అనేది కేవలం ప్రతిపక్షాల గోబెల్స్ ప్రచారమేనని స్పష్టం చేశారు కాకాణి గోవర్థన రెడ్డి. ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు రైతుల్ని రెచ్చగొట్టి, రోడ్ల మీదకు తీసుకొచ్చి, రాజకీయ లబ్ధి పొందాలని ఈ పథకం పన్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక, జగన్ సీఎం అయిన తర్వాత.. రాష్ట్రంలో సమయానికి వర్షాలు పడుతున్నాయని, రిజర్వాయర్లు నిండు కుండల్లా ఉన్నాయని, గత మూడేళ్ళలో రాష్ట్రంలో ఒక్క కరువు మండలం కూడా లేకుండా పంటలు బాగా పండాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే.. ఎవరైనా ఎందుకు క్రాప్ హాలిడేలు ప్రకటిస్తారని ఆయన నిలదీశారు. క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన ఆవశ్యకతగానీ, ఆ పరిస్థితులుగానీ రాష్ట్రంలో లేవన్నారు కాకాణి. 

వైఎస్ఆర్ యంత్ర సేవా పథకంపై టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని, గతంలో టీడీపీ హయాంలో.. రైతు రథం పథకం పేరుతో ట్రాక్టర్ల కొనుగోలు దగ్గర నుంచి పంపిణీ వరకు అన్నిట్లో కమీషన్లు తీసుకున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో రూ.6 లక్షలు అని చెప్పిన ట్రాక్టర్‌ విలువ, బహిరం మార్కెట్‌లో రూ.5లక్షలకు కూడా దొరికే సందర్భాలు ఉన్నాయని చెప్పారు కాకాణి. అలా ట్రాక్టర్ కి లక్ష రూపాయలు జేబులో వేసుకున్నారని అన్నారు. అలాంటి విమర్శలకు తావు ఇవ్వకుండా 175 మోడల్స్‌ లో రైతులు కోరుకున్న ట్రాక్టర్‌, హార్వెస్టర్‌, రోటావేటర్‌ ను కొనుగోలు చేస్తే.. 40  శాతం సబ్సిడీని రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నామని అన్నారు. 175 మోడల్స్‌కు సంబంధించి రూ.175 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేశామని, పారదర్శకత అంటే ఇదని చెప్పారు. 

వ్యవసాయం గురించి మాట్లాడే అర్హతే టీడీపీకి లేదని, వారి హయాంలో రైతులకు చేసింది శూన్యం అని దుయ్యబట్టారు. రైతులకు అండగా నిలబడేందుకు రైతు భరోసా కేంద్రాల ద్వారా వినూత్న కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు.  రైతులను అడ్డుపెట్టుకుని దోచుకున్న ఏకైక ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. రైతుల విషయంలో ఎక్కడా వెనకడుగు వేసే ప్రసక్తేలేదని, రైతులకు అన్నివిధాలా అండగా ఉంటామని చెప్పారు. కొంతమంది రైతులను రెచ్చగొట్టేలా కుట్రలు పన్నుతున్నారని, దీనిపై రైతాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

Published at : 10 Jun 2022 07:57 AM (IST) Tags: Nellore news Crop Holiday Minister Kakani Goverdhan Reddy ap aggriculture

ఇవి కూడా చూడండి

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ

Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ

AP Ex Minister Narayana: నన్ను అరెస్ట్ చేయండి చూద్దాం, పోలీసులకు మాజీ మంత్రి నారాయణ సవాల్

AP Ex Minister Narayana: నన్ను అరెస్ట్ చేయండి చూద్దాం, పోలీసులకు మాజీ మంత్రి నారాయణ సవాల్

Weather Update: ఏపీలో తుపాను అలర్ట్, ఈ ప్రాంతంలోనే తీరందాటే అవకాశం - ఈ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు

Weather Update: ఏపీలో తుపాను అలర్ట్, ఈ ప్రాంతంలోనే తీరందాటే అవకాశం - ఈ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు

AP Govt Holidays: వచ్చేఏడాది 20 సాధారణ సెలవులు, జాబితా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

AP Govt Holidays: వచ్చేఏడాది 20 సాధారణ సెలవులు, జాబితా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

టాప్ స్టోరీస్

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి,  తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్
×