By: ABP Desam | Updated at : 25 Mar 2023 09:02 PM (IST)
Edited By: Srinivas
మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 (Photo Credit: Twitter/ISRO)
LVM3 -M3 రాకెట్ ప్రయోగం ఆదివారం ఉదయం 9 గంటలకు మొదలవుతుంది. శనివారం ఉదయం 8.30 గంటలకు మొదలైన కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం నిర్వహిస్తారు. LVM3 -M3 రాకెట్ ద్వారా వన్ వెబ్ ఇండియా-2 పేరుతో 36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యల్లోకి పంపిస్తారు.
ఇస్రోకి సంబంధించిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇస్రో ఈ వాణిజ్య ప్రయోగం చేపట్టింది. ఈ ప్రయోగం ద్వారా యూకేకి చెందిన నెట్ వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్ కంపెనీ, ఇండియాకు చెందిన భారతీ ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా వన్‌వెబ్ ఇండియా–2 పేరుతో ఉపగ్రహాలను నింగిలోకి పంపిస్తున్నాయి. 5,805 కిలోల బరువు కలిగిన 36 సమాచార ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి ప్రవేశపెడతారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రయోగం మొదలవుతుంది. 19.7 నిమిషాల్లోనే ఇది పూర్తయ్యేలా డిజైన్ చేశారు. 36 ఉపగ్రహాలను ఒక్కొక్కటిగా నిర్దేశించిన సమయంలో నిర్ణీత కక్ష్యల్లోకి ప్రవేశపెడతారు.
LVM3-M3🚀/OneWeb 🛰 India-2 mission:
— ISRO (@isro) March 25, 2023
The countdown has commenced.
The launch can be watched LIVE
from 8:30 am IST on March 26, 2023https://t.co/osrHMk7MZLhttps://t.co/zugXQAYy1y https://t.co/WpMdDz03Qy @DDNational @NSIL_India @INSPACeIND@OneWeb
మూడు దశలు కలిగిన LVM3 -M3 రాకెట్ పొడవు 43.5 మీటర్లు, వెడల్పు 4.4 మీటర్లు, బరువు 643 టన్నులు. మొదటి దశలో 200 టన్నుల బరువు గల ఘన ఇంధన ఎస్-200 స్ట్రాఫాన్ బూస్టర్లను ఈ రాకెట్ కలిగి ఉంటుంది. రెండో దశను ఎల్-110 కోర్ గా పిలుస్తారు. ఈ దశలో 110 టన్నుల ద్రవ ఇంధనం ఉంటుంది. మూడో దశలో సీ-25 అతిశీతల క్రయోజనిక్ ఇంధనం 25 టన్నుల బరువు కలిగి ఉంటుంది. ఘన, క్రయో ఇంధనాన్ని ముందుగానే నింపుతారు. ద్రవ ఇంధనాన్ని కౌంట్ డౌన్ జరిగే సమయంలో నింపుతారు.
LVM3 -M3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ సూళ్లూరుపేట చెంగాళమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇది పూర్తిగా వాణిజ్యపరమైన ప్రయోగం అని చెప్పారు ఇస్రో చైర్మన్ సోమనాథ్. ఏప్రిల్ చివరి వారం లో PSLV రాకెట్ ప్రయోగం ఉంటుందని, అది కూడా పూర్తిగా వాణిజ్య ప్రయోగమేనని చెప్పారు. చంద్రయాన్ 3 ప్రయోగానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు. జూన్ లో ఆదిత్య L1 ప్రయోగం ఉంటుందని చెప్పారు. LVM3 -M3 ద్వారా వన్‌వెబ్ ఇండియా-2 పేరుతో 36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఏకకాలంలో కక్ష్యలోకి పంపించబోతున్నారు.
వాణిజ్య ప్రయోగాల బాటలో ఇస్రో..
ఇస్రో భారత పరిశోధనలకోసమే కాకుండా వాణిజ్య అవసరాలకు కూడా ప్రయోగాలను నిర్వహిస్తోంది. ఇతర దేశాలతో పోల్చి చూస్తే ఇస్రో వాణిజ్య ప్రయోగాలు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో విదేశీ కంపెనీలు సైతం ఉపగ్రహాల ప్రయోగానికి ఇస్రోపై ఆధారపడుతున్నాయి. ప్రస్తుతం ఇస్రో ప్రయోగిస్తున్న LVM3 -M3 రాకెట్ కూడా పూర్తిగా వాణిజ్య ప్రయోగమే. దీని ద్వారా 36 ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశ పెడుతున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే వాణిజ్య పరంగా ఇస్రోకి మరింత మంచి పేరు వస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రయోగానికి మరికొన్ని గంటలే సమయం ఉండటంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఉత్కంఠగా ఈ ప్రయోగం కోసం ఎదురు చూస్తున్నారు.
AP EAPCET Result: ఏపీ ఈఏపీసెట్-2023 ఫలితాల వెల్లడి తేదీ ఖరారు, రిజల్ట్స్ ఎప్పుడంటే?
Nellore Gold Seized: నెల్లూరులో భారీగా బంగారం పట్టివేత, స్మగ్లింగ్ తో హైదరాబాద్ కు లింకులు!
Top 10 Headlines Today: సైకిల్ ఎక్కబోతున్న ఆ ముగ్గురు, సరూర్‌నగర్ హత్య కేసులో సాయికృష్ణ హాంగామా
టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించిన ఆనం- రాష్ట్రంలో మార్పు మొదలైందని కామెంట్
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు- వైసీపీ ఎమ్మెల్యేలతో టీడీపీ లీడర్ల భేటీ
KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట
TSPSC: నేడే 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!
Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!
IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!