నేను తెలుగువారి కోసం పని చేస్తున్నాను- ఎక్కడైనా ఉంటాను: చంద్రబాబు
ర్నూలును న్యాయరాజధాని అన్నారని... టీడీపీ వ్యతిరేకమని దాడి చేయించడానికి యత్నించారని తెలిపారు చంద్రబాబు. ఇప్పుడు సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసి... హైకోర్టు మారదని చెప్పారని గుర్తు చేశారు.
తెలంగాణలో పార్టీపై ఫోకస్ పెట్టిన తెలుగుదేశం అధినేత చంద్రబాబును టార్గెట్‌గా చేసుకొని కొన్ని రోజుల నుంచి వైసీపీ చేస్తున్ విమర్శలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. తాను తెలుగు వారి కోసం పని చేస్తున్నానని అన్నారు. ఎక్కడైనా ఉంటానన్నారు. తెలుగు వారి కోసం ఎక్కడికైనా వెళ్తాను అన్నారు. తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశమని అన్నారు.
వైసీపీలో అంతర్యుద్ధం
సీఎం జగన్ పోకడలతో వైఎస్‌ఆర్‌సీపీలో అంతర్యుద్దం మొదలైందన్నారు చంద్రబాబు. ఆ పార్టీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు వ్యతిరేక గాలి వీస్తోందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ బద్దంగా ఏర్పాటు చేసిన స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి వాటి డబ్బులను లాక్కున్నారని ఆరోపించారు. గ్రామాల్లో కనీసం వీధి లైట్లు పెట్టడానికి కూడా సర్పంచ్‌ల వద్ద డబ్బులు లేవని ఇలాంటి పార్టీలో ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు ఎదుకు ఉండాలని ప్రశ్నించారు.
ఇలాంటి వారందరిలో ఆలోచన మొదలైందని.. అదేటైంలో ప్రజల్లో కూడా తిరుగుతు ఇప్పుడు స్టార్ట్ అయిందన్నారు చంద్రబాబు. రాబోయే రోజుల్లో మరింత చూస్తారంటూ హెచ్చరించారు. టీడీపీ సభలకు వస్తున్న జనాలు చూస్తుంటే వైసీపీకి, జగన్‌కు నిద్రపట్టడం లేదని కామెంట్ చేశారు. ఇది మరింత తీవ్రమవుతుందని అభిప్రాయపడ్డారు.
వ్యతిరేకత ఇంకా పెరుగుతుందని భయపడి ఇప్పుడు ముందస్తు అంటూ డ్రామాలకు తెరతీయబోతున్నారని చెప్పారు చంద్రబాబు. ముందస్తుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఢిల్లీ టూర్‌లో కేంద్రానికి చెప్పినట్టు టాక్ నడుస్తోందన్నారు. అసలు ఢిల్లీ వెళ్లినప్పుడు కనీసం రాష్ట్రానికి సంబంధించిన విషయాలు మాట్లడకుండా పూర్తి వ్యక్తిగత పర్యటన చేస్తున్నారని మండిపడ్డారు. అప్పట్లో ఊరూరా తిరిగి చెప్పిన ప్రత్యేక హోదా ఏమైందని ప్రశ్నించారు.
పాతిక ఎంపీ సీట్లు ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాను అన్న వ్యక్తి ఇప్పుడు కేసులు, బాబాయ్ కేసులో సోదరుడిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజాలను సరెండర్ చేశారన్నారు. పక్కరాష్ట్రంతో కూడా లాలూచీ పడి మూడు సీట్లు అమ్ముకొని రావాల్సివాటిపై నోరు విప్పకుండా సైలెంట్ అయిపోయారన్నారు.
కర్నూలును న్యాయరాజధాని అన్నారని... టీడీపీ వ్యతిరేకమని దాడి చేయించడానికి యత్నించారని తెలిపారు చంద్రబాబు. ఇప్పుడు సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసి... హైకోర్టు మారదని చెప్పారని గుర్తు చేశారు. కర్నూలులో ఏర్పాటు చేయాల్సిన జుడిషియల్ అకాడమి మార్చేశారు. ఎప్పుడూ పోరాటాలు చేసే వామపక్షాలు కూడా ఈ ముఖ్యమంత్రి నియంతృత్వ పాలనకు భయపడిపోతున్నాయన్నారు. ఎక్కడ మాట్లాడలన్నా భయపడే పరిస్థితి ఉండేదని... ఇప్పుడు క్రమంగా అందరిలో మార్పు వస్తోందన్నారు. అన్నింటికి తెగించి... పాలనపై విసుగుతో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని తెలిపారు.
ఇప్పుడు రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజలు ఒక పక్కన ఉంటే... జగన్ ఒక పక్క ఉన్నారని అన్నారు. ఈ ఇద్దరి మధ్య యుద్ధం జరగబోతోందని కామెంట్ చేశారు. ఆ పోరాటం అన్‌స్టాపబుల్, టీడీపీ గెలవడం అన్‌స్టాపబుల్ అన్నారు చంద్రబాబు. పార్టీలోకి మంచివాళ్లు వస్తే తప్పకుండా తీసుకుంటామని అన్నారు. ఏ ఫీల్డ్‌లో మంచి వాళ్లు ఉన్నా ప్రోత్సహించడం టీడీపీ బాధ్యతి అన్నారు. రియల్‌గా ఎక్కడైనా మంచి వాళ్లు ఏ ఫీల్డ్‌లో ఉన్న ఎంకరేజ్ చేస్తామన్నారు.