News
News
X

నాలుగు రోజుల్లో నెల్లూరులో మరో హత్య- క్యారమ్స్ ఆడుతుంటే గొంతుకోసి పారిపోయారు దుండగులు

మహేష్ వద్దకు వెళ్లి అతడి గొంతు కోశారు. విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేశారు. ఆస్పత్రికి తరలించేలోపే మహేష్ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

FOLLOW US: 
Share:

ఇటీవల నెల్లూరులో వరుస హత్యలు సంచలనంగా మారుతున్నాయి. మూడు రోజుల క్రితం నెల్లూరు తల్పగిరి కాలనీలో ఓ యువకుడిన గొంతుకోసి హత్య చేశారు కొందరు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. శుక్రవారం రాత్రి నెల్లూరు ఉడ్ హౌస్ సంఘం వద్ద మహేష్ అనే యువకుడిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపారు.

నెల్లూరులోని ఉడ్ హౌస్ సంఘం వద్ద రాత్రి మహేష్ అనే యువకుడు తన స్నేహితులతో కలసి క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాడు. ఆ సమయంలో కొంతమంది వ్యక్తులు ముసుగులు ధరించి అటువైపు వచ్చారు. నేరుగా మహేష్ వద్దకు వెళ్లి అతడి గొంతు కోసారు. విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేశారు. గొంతు తెగడంతోపాటు, శరీర భాగాలపై అయిన కత్తి గాట్లతో తీవ్ర రక్తస్రావం అయింది. ఆస్పత్రికి తరలించే లోపే మహేష్ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నాలుగు రోజుల వ్యవధిలో నెల్లూరులో జరిగిన మరో దారుణం ఇది. ఆమధ్య హోటల్ యజమానుల జంట హత్యల తర్వాత నెల్లూరులో తీవ్ర కలకలం రేగింది. పోలీసులు గస్తీ పెంచారు, బందోబస్తు కాస్త స్ట్రిక్ట్ చేశారు. కానీ ఇటీవల మల్లీ పరిస్థితి మామూలుగా మారింది. నెల్లూరు జిల్లాలో మెల్ల మెల్లగా క్రైమ్ రేట్ పెరుగుతోంది. మూడు రోజుల క్రితం తల్పగిరి కాలనీలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా దాదాపు అలాగే కత్తిగాట్లకు బలైన యువకుడు ఇప్పుడు ప్రాణాలు వదిలాడు. ఇది తెలిసినవారి పనేనని అనుమానిస్తున్నారు.

మహేష్ అనే యువకుడు ఆ సమయానికి అక్కడికి క్యారమ్ బోర్డ్ ఆడేందుకు వస్తాడని పక్కా సమాచారంతోనే హంతకులు ముసుగులు ధరించి వచ్చి అతడిని హతమార్చినట్టు తెలుస్తోంది. రక్తపు మడుగుల ఉన్న మహేష్ ని ఆస్పత్రికి తరలించే క్రమంలో అతను స్పాట్ లోనే చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ హత్యతో మరోసారి నెల్లూరు వార్తల్లోకెక్కింది. జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఈ మధ్యే డాక్టర్ హత్య 

ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఇటీవల ఓ ఆర్ఎంపీ డాక్టర్ హత్య సంచలనంగా మారింది. అసలు కారణం తెలుసుకుని పోలీసులే విస్తు పోయారు. డాక్టర్ సంధానీ భాషాని చంపించింది మరో డాక్టర్ అని తెలుసుకుని నిర్ఘాంతపోయారు. వెంకటగిరి పట్టణానికి చెందిన సంధాని భాష మంచి డాక్టర్ గా సేవలు అందిస్తున్నారు. అందరితో కలుపుగోలుగా ఉండేవారు. ఈయన రాకతో సత్రం గ్రామానికి చెందిన డాక్టర్ మునిప్రకాష్ కి బిజినెస్ పడిపోయింది. దీంతో సంధానీ భాషాపై కక్ష పెంచుకున్నాడు. అతడిని అడ్డు తొలగించుకోడానికి పథకం పన్నాడు. చివరకు హత్య చేయించాడు.

సంధానీ భాషాని హత్య చేయాలంటూ డాక్టర్ మునిప్రకాష్, సుబ్రహ్మణ్యం అనే ఆటో డ్రైవర్ కి చెప్పాడు. అతడు తిరుపతి నుంచి ఇద్దరు ప్రొఫెషనల్ కిల్లర్స్ ని తీసుకొచ్చాడు. వారిద్దరినీ కొన్నాళ్లపాటు వెంకటగిరి లాడ్జిలో ఉంచాడు. వారు ప్రతిరోజూ రెక్కీ నిర్వహించేవారు. వారితోపాటు ఇంకొందరు అదే లాడ్జీలో హత్యకు పథక రచన చేశారు. చివరకు ఓరోజు సంధానీభాషా ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో రాత్రివేళ కాపుకాసి కత్తులతో పొడిచి హత్య చేశారు. 

Published at : 25 Feb 2023 09:58 AM (IST) Tags: Nellore murder Nellore Update Nellore Crime nellore abp Nellore News

సంబంధిత కథనాలు

APSWREIS: గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

APSWREIS: గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

Minister Kakani : వైసీపీలో రాజకీయ సంక్షోభం రాదు, ఆ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకున్నారన్న ఆధారాలున్నాయ్ - మంత్రి కాకాణి

Minister Kakani : వైసీపీలో రాజకీయ సంక్షోభం రాదు, ఆ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకున్నారన్న ఆధారాలున్నాయ్ - మంత్రి కాకాణి

దమ్ముంటే టీడీపీ రెబల్స్ పై వేటు వేయండి- తెలుగుదేశానికి వైసీపీ ఎమ్మెల్యే సవాల్

దమ్ముంటే టీడీపీ రెబల్స్ పై వేటు వేయండి- తెలుగుదేశానికి వైసీపీ ఎమ్మెల్యే సవాల్

మరోసారి బండి సంజయ్‌కు సిట్ నోటీసులు

మరోసారి బండి సంజయ్‌కు సిట్ నోటీసులు

టాప్ స్టోరీస్

BRS PLan : మహారాష్ట్రలో రెండో సభ - ఇతర రాష్ట్రాలను బీఆర్ఎస్ చీఫ్ లైట్ తీసుకుంటున్నారా ?

BRS PLan : మహారాష్ట్రలో రెండో సభ - ఇతర రాష్ట్రాలను బీఆర్ఎస్ చీఫ్ లైట్ తీసుకుంటున్నారా ?

BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ

BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే

TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే