By: ABP Desam | Updated at : 27 Mar 2023 10:17 PM (IST)
Edited By: Srinivas
మాజీ మంత్రి అనిల్ కుమార్
నెల్లూరు జిల్లానుంచి సస్పెండ్ అయిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు 2024లో తిరిగి ఎమ్మెల్యేలు అయితే తాను రాజకీయాలు వదిలేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అనిల్ ని అసెంబ్లీ మెట్లెక్కనివ్వబోమంటూ కొంతమంది మంగమ్మ శపథాలు చేస్తున్నారని, వారికిదే తన సవాల్ అన్నారు. కొత్తబిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా కొంతమంది పచ్చ కండవా మెడలో పడగానే రెచ్చిపోతున్నారంటూ పరోక్షంగా గిరిధర్ రెడ్డిని ఎద్దేవా చేశారు. అన్నం పెట్టినోడికే సున్నం పెడితే దేవుడి క్షమించడని అన్నారు. జగన్ ని మోసం చేసినవారెవరూ వచ్చే ఎన్నికల్లో గెలవరని అన్నారు అనిల్.
అనిల్ వర్గం ఫుల్ హ్యాపీ..
నెల్లూరులో 2019 ఎన్నికల్లో పదికి పది అసెంబ్లీ స్థానాలు వైసీపీ గెలిచినా, అందరి మధ్య ఆ స్థాయిలో సఖ్యత లేదు అనే విషయం తెలిసిందే. అనిల్ కి మంత్రి పదవి వచ్చిన తర్వాత ఈ విభేదాలు మరింత పెరిగాయి. సిటీ ఎమ్మెల్యే అనిల్ కి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కొన్నాళ్లుగా మాటలు లేవు. పరోక్షంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేవారు. నెల్లూరు కార్పొరేషన్లో కూడా ఎవరి వర్గం వారిదే అన్నట్టుగా ఉన్నారు. అయితే మేయర్ పోస్ట్ మాత్రం నెల్లూరు రూరల్ కి వెళ్లిపోవడంతో అనిల్ వర్గం కాస్త అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా కోటంరెడ్డి పార్టీనుంచి సస్పెండ్ కావడంతో అనిల్ వర్గం సంతోషంగా ఉంది. కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసినప్పుడు కూడా అనిల్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన పార్టీకి దూరమవుతున్నాడని తనకు కొన్నాళ్లుగా సమాచారం ఉందనన్నారు అనిల్. ఇప్పుడు కోటంరెడ్డి సోదరులు పార్టీకి దూరం కావడంతో నెల్లూరు వైసీపీలో అనిల్ పట్టు బిగిస్తున్నారు.
ఆనంతోనూ పేచీ
నెల్లూరు నగరంపై ఆనం కుటుంబ పెత్తనం చాన్నాళ్లు కొనసాగింది. అయితే అనిల్ రాకతో ఆనం కుటుంబ ప్రభావం కాస్త తగ్గింది, దానికి తోడు ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి వెళ్లిపోవాల్సి వచ్చింది. కానీ ఆయన అప్పుడప్పుడు నెల్లూరు నగరంతో తమకు అనుబంధం ఉందని, ఇక్కడినుంచే రాజకీయం చేస్తామని చెప్పారు. ఆనం, అనిల్ మధ్య పరోక్షంగా మాటల తూటాలు పేలాయి. గతంలో ఆనం టీడీపీలో ఉండగా, అనిల్ వైసీపీ కావడంతో అప్పటినుంచి వైరం మరింత పెరిగింది, ఇద్దరూ ఒకేపార్టీలో ఉన్నా కూడా అది తగ్గలేదు. ఇప్పుడు ఆనం కూడా బయటకు వెళ్లడంతో అనిల్ కి నగరంపై పూర్తి స్థాయిలో పట్టు దొరికే అవకాశాలున్నాయి.
కోటంరెడ్డి వర్గం అనిల్ కు వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలున్నాయి. ఇన్నాళ్లూ ఒకే పార్టీలో ఉండటంతో కోటంరెడ్డి వర్గం సిటీలోకి ఎంటరయ్యేది కాదు. ఇటీవల కోటంరెడ్డి నెల్లూరు సిటీలో కూడా సభలు, సమావేశాలు పెడుతున్నారు. కార్యకర్తలు, అభిమానుల్ని కలుస్తున్నారు. దీంతో అనిల్ రగిలిపోతున్నారు. ఇప్పుడు పార్టీ కూడా కోటంరెడ్డిని సస్పెండ్ చేయడంతో నేరుగా సవాల్ విసిరారు అనిల్.
వచ్చే ఎన్నికల్లో ఆ ముగ్గురు గెలిచి అసెంబ్లీకి వస్తే, తాను రాజకీయాలకు దూరం జరుగుతానన్నారు అనిల్. దమ్ముంటే ఆ ముగ్గురు తనని అసెంబ్లీ మెట్లెక్కకుండా చేయగలరా అని సవాల్ విసిలారు. తాను గెలిస్తే ఆ ముగ్గురు రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని ప్రశ్నించారు. జగన్ బొమ్మ, ఫ్యాన్ గుర్తు వల్లే తామందరం ఎమ్మెల్యేలుగా గెలిచామని, కానీ ఆ ముగ్గురు పెంచి పెద్ద చేసిన పార్టీకి నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు అనిల్. అనిల్ సవాల్ కి కోటంరెడ్డి సోదరులు ఎలాంటి సమాధానం చెబుతారో వేచి చూడాలి.
Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్షాతో రేపు ప్రధానితో సమావేశం!
Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ విచారం- సహాయక చర్యల కోసం స్పెషల్ టీం ఏర్పాటు
Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఆలోచన మారిందా?
AP BJP Kiran : బీజేపీలో చేరినా సైలెంట్ గానే కిరణ్ కుమార్ రెడ్డి - హైకమాండ్ ఏ పనీ చెప్పడం లేదా ?
ఎన్టీటీపీఎస్లో మరో యూనిట్ లైన్ అప్- అందుబాటులోకి రానున్న 800మోగావాట్ల విద్యుత్
తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!
Anasuya - Vimanam 2023 Movie : అప్పుడు 'వేదం'లో అనుష్క - ఇప్పుడు 'విమానం'లో అనసూయ
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
WTC 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్స్లో వర్షం పడితే! - పోనీ డ్రా అయితే గద ఎవరికి?