By: ABP Desam | Updated at : 18 Feb 2023 10:44 PM (IST)
Edited By: Srinivas
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ఆ పార్టీ కక్షసాధింపు చర్యలకు దిగిందా.. ఆయన అనుచరులను అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పుడు కోటంరెడ్డిని కూడా అరెస్ట్ చేయబోతున్నారా.. కోటంరెడ్డిని అరెస్ట్ చేస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయి.. ప్రస్తుతం జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. నాలుగు నెలల క్రితం టీడీపీ నేత మాతంగి కృష్ణపై దాడి జరిగింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అతని అనుచరులే తనపై దాడి చేశారంటూ మాతంగి కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేసినా అప్పట్లో సాక్ష్యాధారాలు లేవని పోలీసులు కేసుని పక్కనపెట్టారు. అయితే ఆ కేసులో ఇప్పుడు కదలిక వచ్చింది, వరుసగా అరెస్ట్ లు జరుగుతున్నాయి. రేపోమాపో కోటంరెడ్డి కూడా అరెస్ట్ అవుతారనే ఊహాగానాలు వినపడుతున్నాయి.
నెల్లూరులో నాలుగు నెలల క్రితం తెలుగుదేశం పార్టీ నాయకుడు మాతంగి కృష్ణపై జరిగిన హత్యాయత్నం కేసులో మరింత మందిని అరెస్టు చేయాల్సి ఉందని నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని డీఎస్పి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన కేసు వివరాలు వెల్లడించారు. ఈ కేసులో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా నిందితుడిగా ఉన్నట్లు తెలియజేశారు. మాతంగి కృష్ణపై నాలుగు నెలల క్రితం హత్యాయత్నం జరిగిందని అన్నారు. దానిపై వేదాయపాళెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదై ఉందని చెప్పారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై A8 గా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఇప్పటికే కోటంరెడ్డి రైట్ హ్యాండ్ తాటి వెంకటేశ్వర్లుని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయనతోపాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ కేసులో ఏ-8గా ఉన్న కోటంరెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వినపడుతున్నాయి.
కక్షపూరిత చర్యలు..
అయితే అరెస్ట్ లను కోటంరెడ్డి వర్గం తీవ్రంగా తప్పుబడుతోంది. నాలుగు నెలల క్రితం నమోదైన కేసుల్ని ఇప్పుడు తిరగతోడుతున్నారని, తమని భయపెట్టాలని చూస్తున్నారని, కార్పొరేటర్లను తమవైపు తిప్పుకోడానికే తప్పుడు కేసులు పెడుతున్నారని, అరెస్ట్ లతో భయపెట్టాలని చూస్తున్నారని మండిపడుతోంది కోటంరెడ్డి వర్గం. కేసులకు, అరెస్ట్ లకు భయపడేది లేదంటున్నారు కోటంరెడ్డి.
పోలీసుల వెర్షన్..
పోలీసులు మాత్రం అరెస్ట్ ల విషయంలో రాజకీయ జోక్యం లేదంటున్నారు. నాలుగు నెలల క్రితం.. అంటే కోటంరెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కేసులు నమోదయ్యాయని, అంటే ఆయన అధికార పార్టీ అయినా కూడా కేసు రిజిస్టర్ చేశామని చెబుతున్నారు. కానీ సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసు ముందుకు సాగలేదని, ఇప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి సాక్ష్యం చెబుతున్నారని, అందుకే అరెస్ట్ లు మొదలయ్యాయని అంటున్నారు.
కోటంరెడ్డి మాత్రం అరెస్ట్ లకు తగ్గేది లేదంటున్నారు. ఇప్పటికే తన ఫోన్ ట్యాప్ చేశారని, తనని అవమానించారని, అనుమానించారని ఆయన నాయకులు, కార్యకర్తలకు చెబుతున్నారు. ఇప్పుడు ఆయన్ను అరెస్ట్ చేస్తే ఆయనపై మరింత సింపతీ పెరిగే అవకాశముంది. మరి దీన్ని అధికార వైసీపీ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.
Breaking News Live Telugu Updates: రేపు మరోసారి ఢిల్లీకి సీఎం జగన్, రెండు వారాల్లోనే రెండోసారి హస్తినకు
AP CM Delhi Visit: రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్ - మరోసారి ప్రధానితో భేటీ?
Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్
పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ - అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన
AP Inter Exams: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్లో అందరికీ 2 మార్కులు!
Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్
MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్ భాషలో ఛాటింగ్!
Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!
Pan-Aadhaar: పాన్-ఆధార్ లింక్ గడువును పొడిగించే ఛాన్స్, మరో 3 నెలలు అవకాశం
మార్గదర్శి కేసులో మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు