Rushikonda NGT : రుషికొండలో తవ్వకాలపై ఎన్జీటీ స్టే - ఇప్పటి వరకూ జరగిన తవ్వకాలపైనా అధ్యయనం !
రుషికొండ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ స్టే ఇచ్చింది. ఇప్పటి వరకూ జరిగిన తవ్వకాలపై అధ్యయనానికి కమిటీని నియమించింది.
విశాఖలోని రుషికొండ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తక్షణం తవ్వకాలు నిలిపివేయాలని.. ఎన్జీటీ ఆదేశించింది. రుషికొండలో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్జీటీ ఇప్పటివరకు తవ్వకాలపై అధ్యయనానికి సంయుక్త కమిటీని నియమించింది. ఏపీ కోస్టల్ మేనేజ్ మెంట్ అథారిటీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని ఆదేశించింది. నెల రోజుల్లోగా కమిటీ నివేదిక అందించాలని ఎన్జీటీ స్పష్టం చేసారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తవ్వకాలు జరపరాదని ఎన్జీటీ తన ఆదేశాల్లో పేర్కొంది.
రుషికొండను పూర్తిగా తొలచి వేస్తున్న దృశ్యాలు ఇటీవలి కాలంలో హైలెట్ అయ్యాయి. వీటి ఆధారంగా విశాఖ పట్నం రుషికొండ ప్రాంతంలో పర్యావరణ ఉల్లంఘన జరుగుతోందని ఎంపఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు. అక్రమ తవ్వకాలు..నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. పర్యాటక శాఖ, పట్టణ మున్సిపల్ శాఖ అమలులో ఉన్న పర్యావరణ అనుమతులు, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటిపై వెంటనే విచారణ చేపట్టాలని... పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రఘురామ ఎన్జీటీని కోరారు.
నేటి నుంచే ‘గడపగడపకు వైఎస్ఆర్’, ఇక అధికారికంగానే - కలెక్టర్లకు కీలక బాధ్యతలు!
రుషికొండపై అంతకు ముందు హరిత రిసార్ట్స్ ఉండేవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని కూల్చి వేసింది. కొత్త నిర్మాణాల కోసం రుషికొండను తవ్వడం ప్రారంభఇంచారు. ఎండాడ సర్వే నంబరు 19లో 9.88 ఎకరాల్లో కొండపై తవ్వకాలకు గనుల శాఖ అనుమతించింది. అయితే అనుమతికి మించి తవ్వకాలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. సీఆర్‌జడ్ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరపకూడదని తెలిసినా పర్యాటక శాఖ పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై హైకోర్టులోనూ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఓ పిటిషన్ దాఖలు చేశారు. దానిపైనా విచారణ జరుగుతోంది.
కోర్టులో పోలీసులకు షాక్ ఇచ్చిన మాజీ మంత్రి నారాయణ- బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం
ఇప్పటికే సీఆర్ జెడ్ నిబంధనలను ఉల్లంఘించి కొండ చుట్టూ తవ్వేశారు. మధ్య ప్రాంతం మాత్రమే మిగిలి ఉంది. దానిని కూడా తొలగిస్తారో లేదో కానీ తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడ ఏం నిర్మిస్తారన్నదానిపైనా స్పష్టత లేదు. ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్తే అనుమతుల్లేవన్న కారణంగా పోలీసులు అడ్డుకున్నారు.