అన్వేషించండి

Nara Lokesh Speech Tribal University Convocation: ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య - ఘనంగా కేంద్రీయ గిరిజన వర్సిటీ మొదటి స్నాతకోత్సవం

President Droupadi Murmu Visakhapatnam: గిరిజన యూనివర్శిటీ మొదటి స్నాతకోత్సవం విశాఖలో జరిగింది. రాష్ట్రపతి ముర్ము ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

Central Tribal University of AP 1st Convocation: విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం  తొలి స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖ నోవాటెల్ హోటల్‌లో నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. ఈ వేడుకలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. కేవలం డిగ్రీలు అందుకోవడం మాత్రమే విద్య కాదని, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే అసలైన విద్య అని ఆయన స్పష్టం చేశారు. సమాజంలోని ప్రతి వర్గానికి, ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలలోని ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందినప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించిన ‘వికసిత్ భారత్’ కల సాకారమవుతుందని లోకేష్ పేర్కొన్నారు.
 
స్వయంకృషితో ఎదిగిన రాష్ట్రపతి జీవితం.. విద్యార్థులకు నిలువెత్తు స్ఫూర్తి! 

గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  కంటే సరైన ముఖ్య అతిథి మరొకరు ఉండరని మంత్రి లోకేష్ కొనియాడారు. ఒడిశాలోని ఒక చిన్న గిరిజన గ్రామంలో జన్మించి, ఎన్నో ప్రతికూల పరిస్థితులను అధిగమించి, ఆ గ్రామం నుండి డిగ్రీ పూర్తి చేసిన తొలి మహిళగా ఆమె నిలిచారని గుర్తుచేశారు. రాయరంగ్‌పూర్‌లో ఒక ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించి.. కౌన్సిలర్, ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, గవర్నర్‌గా ప్రజాసేవలో ఒక్కో మెట్టు ఎక్కుతూ దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన ముర్ము గారి జీవితం స్వయంకృషికి నిదర్శనమన్నారు. 2009 నుండి 2014 మధ్య కాలంలో భర్త, ఇద్దరు కుమారులు, తల్లి, సోదరుడిని కోల్పోయినా.. ఆ అపార వ్యక్తిగత విషాదాన్ని తట్టుకుని, ఆధ్యాత్మిక బలంతో తిరిగి ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన ఆమె సంకల్పం నేటి యువతకు గొప్ప సందేశమని లోకేష్ అన్నారు. 

ఏఐ యుగంలోనూ మానవీయ విలువలే ముఖ్యం 

ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో మనం జీవిస్తున్నామని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  ఎలాంటి ప్రశ్నకైనా సమాధానాలు ఇవ్వగలదని లోకేష్ వ్యాఖ్యానించారు. అయితే, ఏఐ సాంకేతికత మానవీయ విలువలను, కరుణను, మనిషి వ్యక్తిత్వాన్ని ఎన్నటికీ భర్తీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి ఉన్నతమైన విలువలు గొప్ప విశ్వవిద్యాలయాల్లోనే అలవడతాయని తెలిపారు. రేపు సమాజంలోకి అడుగుపెట్టిన తర్వాత విద్యార్థుల విజయానికి ప్రామాణికం వారు సంపాదించిన డబ్బు మాత్రమే కాదని, వారి వల్ల సమాజంలో ఎంతమంది జీవితాలు మారాయనేదే ముఖ్యమని హితవు పలికారు. విద్యార్థులు తమ జ్ఞానాన్ని ఆత్మవిశ్వాసంతో, తమ మూలాలను గర్వంతో, విలువలను వినయంతో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. 

 ఏపీ ఉన్నత విద్యలో సమూల మార్పులు.. భవిష్యత్ నాయకుల తయారే లక్ష్యం! 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రంగంలో కూటమి ప్రభుత్వం సమూల మార్పులు తీసుకువస్తోందని మంత్రి లోకేష్ వెల్లడించారు. కేవలం ఉద్యోగాలు చేసే నిపుణులనే కాకుండా, భవిష్యత్ దేశాన్ని నడిపించే నాయకులను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సరికొత్త నైపుణ్యాలు , పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్రాలుగా భవిష్యత్ విశ్వవిద్యాలయాలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ప్రతిభతో పోటీ పడగలమనే గట్టి ఆత్మవిశ్వాసాన్ని ఏపీ యువతలో నింపడమే తమ అంతిమ ధ్యేయమని లోకేష్ వివరించారు.
 
 ఘనంగా స్నాతకోత్సవం.. హాజరైన ప్రముఖులు 

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ఈ ప్రతిష్టాత్మక స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు. దేశ యువతకు ఉన్నత విద్యా రంగంలో మరిన్ని అవకాశాలు కల్పిస్తున్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లోకేష్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Addanki Police Controversy: అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget