Nara Lokesh Hindi: జాతీయ మీడియా ఇంటర్యూలో హిందీని జాతీయ భాషగా చెప్పిన నారా లోకేష్ - ఇక నెటిజన్లు ఊరుకుంటారా ?
Hindi Contro: జాతీయ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో హిందీ జాతీయ భాష అని నారా లోకేష్ అన్నారు. ఈ అంశంపై సోషల్ మీడియా లో పలువురు విమర్శలు చేస్తున్నారు.

Nara Lokesh Hindi Contro: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు హిందీ రాజకీయాలు నడుస్తున్నాయి. హిందీ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగంపై చాలా మంది విమర్శలు చేశారు. తాజాగా ఓ జాతీయ మీడియా చానల్ కు ఇచ్చిన పాడ్ కాస్ట్ లో నారా లోకేష్ హిందీకి మద్దతుగా మాట్లాడారు. గతంలోనూ మాట్లాడారు కానీ.. ఆయన హిందీని జాతీయ భాషగా చెప్పడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి ఆ ప్రశ్నలో యాంకర్.. అది జాతీయ భాష కాదని చెబుతున్నారు. అయినా నారా లోకేష్.. అది జాతీయ భాష అనే చెప్పారు.
హిందీ జాతీయ భాషా? వామ్మో!
— ChakravarthyNalamotu (@nalamotu) July 15, 2025
ఇంత ముఖ్యమైన సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా ఎట్లా వెళ్లారు ఇంటర్వ్యూకి. మళ్లీ పక్కన ఎన్టీఆర్ ఫోటో ఒకటి. పార్టీ పేరు తెలుగు దేశం పార్టీ. సిగ్గుచేటు!
హిందీ బెల్ట్ మొత్తం దేశమ్మీద హిందీ రుద్దే ప్రయత్నం చాలా కాలంగా చేస్తున్నారు. రకరకాల వినూత్న ప్రయత్నాలు… pic.twitter.com/UzohDo0wpY
భారతదేశానికి ప్రస్తుతం 8వ షెడ్యూల్లో 22 అధికార భాషలున్నాయి... అందులో ఏ ఒక్కటీ జాతీయభాష కాదని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
రాజ్యాంగ అమలు జరిగిన సంవత్సరంలో ప్రకరణ 343 :
— Muneer మునీర్ منیر🇮🇳 (@Muneer_Tweets) July 14, 2025
హిందీ, ఇంగ్లీష్ రెండు అధికార భాషలు
(జాతీయ భాషలు కాదు)
భారతదేశానికి ప్రస్తుతం 8వ షెడ్యూల్లో 22 అధికార భాషలున్నాయి... అందులో ఏ ఒక్కటీ జాతీయభాష కాదు... కాబోదు... ఇది నియంతృత్వ రాజ్యం కాదు... రాష్ట్రాల సమూహం... ఇక్కడ రాష్ట్రంలో ఏం… pic.twitter.com/dX8d9AaY22
ఈ విషయంలో టీడీపీ కార్యకర్తలు కూడా లోకేష్ అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. హిందీని బలవంతంగా రుద్దవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
Sorry అన్నా @naralokesh ఈ విషయంగా నిన్ను సమర్ధించలేం.
— DR (@RaniBobba) July 15, 2025
హిందీ అనేది భారతదేశంలో ఒక ప్రాంతీయ భాష మాత్రమే.
అది నచ్చిన వాళ్ళు/అవసరం అయిన వాళ్ళు మాత్రమే నేర్చుకుంటారు.
మిగతా వాళ్ళకి ఆ అవసరం లేదు. హిందీని బలవంతంగా రుద్దకండి 🙏🏻 https://t.co/fWSHxYyeJC
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారు హిందీని దక్షిణ భారత ప్రజలపై రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారుని కొంత మంది గుర్తు చేస్తున్నారు. 1989 అక్టోబర్ లో విడుదల చేసిన నేషనల్ ఫ్రంట్ మానిఫెస్టోలో కూడా అదే అంశాన్ని స్పష్టంగా చెప్పారని. ..అలాంటి వారసత్వం ఉన్న నారా లోకేష్ హిందీ భాష కి మద్దతుతా మాట్లాడం ఏమిటని కొంత మంది ప్రశ్నిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారు హిందీని దక్షిణ భారత ప్రజలపై రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 1989 అక్టోబర్ లో విడుదల చేసిన నేషనల్ ఫ్రంట్ మానిఫెస్టోలో కూడా అదే అంశాన్ని స్పష్టంగా చెప్పారు. డీఎంకే కి మద్దతుగా తమిళనాడులో ప్రచారం చేసినప్పుడు కూడా హిందీని దక్షిణ భారత… pic.twitter.com/cBl64b0qT1
— Toorpu Teeram (@ToorpuTeeram) July 15, 2025
హిందీని నేర్చుకుంటే తప్పేమీ లేదాని.. భాషకు రాజకీయాలు అన్వయించడం సరి కాదని టీడీపీ విధానం. అయితే నారా లోకేష్ వ్యక్తం చేసిన అభిప్రాయంలో అధికార భాషగా చెప్పాల్సిన మాటను.. జాతీయ భాషగా చెప్పడంతో నెటిజన్లు ఇక దొరికారు కదా... ట్వీట్లతో దాడి చేసేస్తున్నారు.





















