అన్వేషించండి

Nara Lokesh: ఛీకొట్టినా బుద్ధి రాలేదా? ఎక్స్‌లో నారా లోకేశ్ Vs విజయసాయి రెడ్డి

Nara Lokesh Vs Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ప్రెస్ మీట్‌లో జర్నలిస్టులను దూషించిన తీరుపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. అధికారం పోయినా మీలో మార్పు రాలేదని లోకేశ్ పోస్టు చేశారు.

AP Latest News: వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ పెట్టిన ప్రెస్ మీట్‌లో కొంత మంది జర్నలిస్టులను దూషించిన తీరు వివాదాస్పదం అవుతోంది. తనపై ఎవరో ఆరోపణలు చేస్తే కొన్ని మీడియా ఛానెళ్లు అది నిజమే అంటూ ప్రసారం చేశాయని విజయసాయి రెడ్డి అన్నారు. ఆ వార్తలు ప్రసారం చేసిన జర్నలిస్టులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. ఆ జర్నలిస్టుల పుట్టుకపైనే తనకు అనుమానం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒరేయ్..’’ లాంటి పదాలను విజయసాయి రెడ్డి వాడారు. ఇవేనా వారి జర్నలిస్టిక్ విలువలు అంటూ విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయసాయి రెడ్డి జర్నలిస్టులపై ఆగ్రహించిన, దూషించిన తీరుపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. అధికారం పోయినా మీ ప్రవర్తనలో మార్పు రాలేదని లోకేశ్ విమర్శించారు. ‘‘విజయసాయి రెడ్డి గారు! మీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు పెట్టిన ప్రెస్ మీట్‌లో మీరు వాడిన భాష తీవ్ర అభ్యంతరకరం. మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో  మీరు దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీకు నేను మంచీమర్యాదల గురించి చెప్పాల్సిన పనిలేదు. మీకు అధికారం పోయినా అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదు. ఐదేళ్ల వైసిపి పాలనలో మీ భాష, ప్రవర్తన, అవినీతి, అరాచకం చూసి ప్రజలు ఛీ కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలేదు’’ అని లోకేశ్ ఎక్స్‌లో పోస్టు చేశారు.

లోకేశ్ చేసిన ఈ పోస్ట్‌పై విజయసాయి రెడ్డి కూడా ఎక్స్‌లోనే స్పందించారు. ‘‘శ్రీ నారా లోకేశ్‌కు, ఆయన కులానికి చెందిన మీడియా ప్రతినిధులకు వెస్ట్రన్ మీడియా తరహాలో ప్రెస్ ఫ్రీడమ్ కావాలి.. కానీ వారు నార్త్ కొరియన్ మీడియాలాగా పని చేస్తారు. వారు జర్నలిస్టిక్ వ్యాల్యూస్‌ను పట్టించుకోరు. వాటిని తుంగలో తొక్కారు. టీఆర్పీ రేటింగ్స్ వెనక పరిగెడతారు. ప్రజా ప్రతినిధులు, మహిళలు లేదా మన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారిని నష్టపరిచి, వారి రాజకీయ నాయకులకు కట్టుబడి పని చేస్తున్నారు. వారి కుల ప్రయోజనాలను కాపాడుతూ టీఆర్పీల వెనుక మాత్రమే పరిగెత్తుతున్నారు’’ అని విజయ సాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Anna Lezhneva Divorce: ‘అన్నా.. ఇది నిజమేనా?’ పవన్ విడాకులు.. తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్
‘అన్నా.. ఇది నిజమేనా?’ పవన్ విడాకులు.. తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్
Pawan Kalyan Divorce: పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
పవన్ కల్యాణ్ అనా విడాకులు - వైరల్ అవుతోన్న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం!
పవన్ కల్యాణ్ అనా విడాకులు - వైరల్ అవుతోన్న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం!
పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం: మూడు పెళ్లిళ్లు, విడాకులు... ధర్మం నిజంగా ఏం చెబుతోంది?
పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం: మూడు పెళ్లిళ్లు, విడాకులు... ధర్మం నిజంగా ఏం చెబుతోంది?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Divorce: పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
Congress Politics: 9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
Makhana Benefits : రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
పవన్ కల్యాణ్ అనా విడాకులు - వైరల్ అవుతోన్న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం!
పవన్ కల్యాణ్ అనా విడాకులు - వైరల్ అవుతోన్న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం!
Weight Loss Recipe : బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
Revanth Reddy KTR Personal Attack : కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Embed widget