అన్వేషించండి

Jagan vs Lokesh: నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్

Andhra Pradesh News | ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. వైసీపీ, టీడీపీ పార్టీ అధికారిక సోషల్ మీడియా మధ్య విమర్శలు, ఆరోపణలతో హోరెత్తిస్తున్నారు.

Nara Lokesh Tweet | అమరావతి: అధికార టీడీపీ, వైసీపీ మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. అటు సోషల్ మీడియాలో దుష్ప్రచారం, దారుణమైన పోస్టింగ్ పెట్టిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్, దారుణమైన ప్రచారం, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చేసిన పోస్టులపై ఏపీ పోలీసులు ఫోకస్ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత కూడా తాము సైతం బాధితులమేనని.. అందుకే వీటిని సీరియస్ గా తీసుకుని, బాధ్యుతలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు వైసీపీ, టీడీపీ సోషల్ మీడియా వార్ కొనసాగుతోంది.

నారా లోకేష్ నిక్కర్ మంత్రి అని వైసీపీ పోస్ట్..
నిక్క‌ర్ మంత్రి లోకేష్,  నువ్వు మంత్రివి ఎలా అయ్యావు? సీఎం  కార్యాల‌యంలో పెన్నులు, పేప‌ర్ల కోసం కోట్లు దుర్వినియోగం అంటూ దుష్ప్రచారం చేస్తున్న నిన్ను ఏ జైల్లో పెట్టాలి?  నీకు ఏ శిక్ష వేయాలని వైసీపీ ఎక్స్ ఖాతాలో ప్రశ్నించింది. నీ బ‌తుకంతా కూడా వైయస్ జ‌గ‌న్ పై, గత వైసీపీ ప్ర‌భుత్వంపై దుష్ప్ర‌చారం చేయ‌డ‌మేనా? నిక్క‌ర్ మంత్రీ.. ప్ర‌తిసారీ నీ అజ్ఞానాన్ని ఇలా బ‌య‌ట‌పెట్టుకోవ‌డానికి సిగ్గుగా లేదా? అని లోకేష్ ట్వీట్ కు వైసీపీ ఘాటు రిప్లై ఇచ్చింది. ముఖ్య‌మంత్రి క్యాంప్ కార్యాల‌యం అంటే అక్కడే ఐదారుగురు ప్రిన్సిపల్ సెక్రటరీలు.. వాళ్ల దగ్గర స్టాఫ్ ఉంటారు. వారు రాష్ట్ర పరిపాలనను పర్యవేక్షిస్తుంటారు.


Jagan vs Lokesh: నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్

సీఎం  ఆధ్వర్యంలో అధికారులతో వందలాది రివ్యూ మీటింగులు జరుగుతాయి. అధికారులు కూడా మీటింగ్ లు పెడతారు. వాళ్లకు అవసరమైన స్టేషనరీ చూసుకోవాలి. స్టేష‌న‌రీ, నాన్ స్టేష‌న‌రీ కిందికి పెన్నులు, పేప‌ర్ల‌తో పాటు ప్రింటర్లు, క్యాట్రిడ్జ్, స్టాక్ రిజిస్ట‌ర్లు, రైటింగ్ ప్యాడ్స్ లాంటివి చాలా వ‌స్తాయి. వీటికి సంబంధించి ప్ర‌భుత్వ అధికారులే చూసుకుంటారు. ఎన్ని అవ‌స‌ర‌మో అన్ని మాత్ర‌మే తీసుకుంటారు. జగన్ పై, ఆయన ప్రభుత్వంపై ఊరికే నోటికొచ్చిన‌ట్లు మాట్లాడ‌డం కాదు నిక్క‌ర్ మంత్రి.. నీకు ద‌మ్మూ, ధైర్యం ఉంటే విచార‌ణ చేసి వాస్త‌వాల‌ను బ‌య‌ట పెట్టాలంటూ వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా నారా లోకేష్ కు సవాల్ విసిరారు.


Jagan vs Lokesh: నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్

జగన్ పులివెందుల పిల్లి, కట్ డ్రాయర్ ఎమ్మెల్యే

ఏపీ మంత్రి నారా లోకేష్ ను నిక్కర్ మంత్రి అని వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ దుమారం రేపుతోంది. మాజీ సీఎం జగన్ ను అసెంబ్లీ అంటే భయపడే పులివెందుల పిల్లి అని, కట్ డ్రాయర్ ఎమ్మెల్యే అంటూ టీడీపీ సైతం అదే స్థాయిలో బదులిచ్చింది. నీకు ఆత్రం ఎక్కువ తప్ప, ఏమి చెప్తున్నావో నీకే అర్ధం కావటం లేదు.. ఒక పక్క పెన్నులు, పేపర్ల కోసం కోట్లు ఖర్చు పెట్టలేదు అని జగన్ అంటాడు, ఇంకో పక్క స్టాఫ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఖర్చు పెట్టాను అంటావ్. బుర్రలో గుజ్జు పెంచుకునే మాత్రలు వాడాలని, రూ.9.84 కోట్లతో కొన్న పెన్నులతో స్క్రిప్ట్ ఎలా రాయాలో నేర్చుకోవాలంటూ టీడీపీ పోస్ట్ చేసింది.

దుమారానికి కారణమైన నారా లోకేష్ పోస్టులో ఏముంది..
ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ తో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇంతకీ నారా లోకేష్ ఏమన్నారంటే.. ఏపీ విద్యార్థులకు ఓ ప్రశ్న. మీరు వాడే పెన్ను ధర ఎంత ఉంటుంది చెప్పాలని లోకేష్ ప్రశ్న అడిగారు. వైఎస్ జగన్ అయితే తాడేపల్లి ప్యాలెస్ లో పేపర్లు, పెన్నులకు ఏకంగా రూ.98,400,000 (రూ.9 కోట్ల 84 లక్షలు) ఖర్చు చేశారు. ఈ మొత్తాన్ని సరిగ్గా ఖర్చు చేసింటే ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ కు బాటలు పడేవని లోకేష్ ట్వీట్ చేశారు.

 

ఏపీ సీఎంఓలో స్టేషనరీ, నాన్ స్టేషననరీ ఖర్చులు కలిపి మొత్తం రూ.9.84 కోట్లు ఖర్చు చేశారంట, వైఎస్ జగన్ నిజంగానే పెన్నుతో రాస్తున్నారని భావిస్తున్నారా అని లోకేష్ ఏపీ విద్యార్థులను అడుగుతూ మాజీ సీఎంపై సెటైర్లు వేశారు. ఈ ట్వీట్ వైసీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించడంతో సోషల్ మీడియాలో ట్వీట్ వార్ మళ్లీ మొదలైంది.

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Encounter in Karregutta: తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలో ఎన్కౌంటర్- ఏజెన్సీనీ అధీనంలోకి తీసుకున్న భద్రత బలగాలు
తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలో ఎన్కౌంటర్- ఏజెన్సీనీ అధీనంలోకి తీసుకున్న భద్రత బలగాలు
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్టు
మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్టు
Prabhas Fauji Actress: మాది పాకిస్తాన్ కాదు, ఆ ఆర్మీతో సంబంధం లేదు... క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి
మాది పాకిస్తాన్ కాదు, ఆ ఆర్మీతో సంబంధం లేదు... క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి
Mukku Raju Master: రేవంత్ రెడ్డికి నారాయణమూర్తి రిక్వెస్ట్... చిత్రపురిలో సినీ కార్మికులకు ఇళ్ళు కట్టివ్వాలి... ఆర్ నారాయణ మూర్తి
రేవంత్ రెడ్డికి నారాయణమూర్తి రిక్వెస్ట్... చిత్రపురిలో సినీ కార్మికులకు ఇళ్ళు కట్టివ్వాలి... ఆర్ నారాయణ మూర్తి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs RR Match preview IPL 2025 | నేడు బెంగుళూరులో రాజస్థాన్ రాయల్స్ తో RCB ఫైట్ | ABP DesamRohit Sharma 70 Runs vs SRH IPL 2025 | సరైన సమయంలో బీభత్సమైన ఫామ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ | ABP DesamMumbai Indians top 3 Position IPL 2025 | అనూహ్య రీతిలో పాయింట్స్ టేబుల్ లో దూసుకెళ్లిన ముంబై ఇండియన్స్ | ABP DesamIshan Kishan Match Fixing Trending IPL 2025 | తీవ్ర వివాదమవుతున్న ఇషాన్ కిషన్ ఔట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Encounter in Karregutta: తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలో ఎన్కౌంటర్- ఏజెన్సీనీ అధీనంలోకి తీసుకున్న భద్రత బలగాలు
తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలో ఎన్కౌంటర్- ఏజెన్సీనీ అధీనంలోకి తీసుకున్న భద్రత బలగాలు
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్టు
మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్టు
Prabhas Fauji Actress: మాది పాకిస్తాన్ కాదు, ఆ ఆర్మీతో సంబంధం లేదు... క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి
మాది పాకిస్తాన్ కాదు, ఆ ఆర్మీతో సంబంధం లేదు... క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి
Mukku Raju Master: రేవంత్ రెడ్డికి నారాయణమూర్తి రిక్వెస్ట్... చిత్రపురిలో సినీ కార్మికులకు ఇళ్ళు కట్టివ్వాలి... ఆర్ నారాయణ మూర్తి
రేవంత్ రెడ్డికి నారాయణమూర్తి రిక్వెస్ట్... చిత్రపురిలో సినీ కార్మికులకు ఇళ్ళు కట్టివ్వాలి... ఆర్ నారాయణ మూర్తి
Pahalgam Terror Attack: ఉగ్రదాడిపై పాకిస్థాన్‌లో తీవ్ర చర్చ- గూగుల్‌, సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ టాపిక్
ఉగ్రదాడిపై పాకిస్థాన్‌లో తీవ్ర చర్చ- గూగుల్‌, సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ టాపిక్
Singer Pravasthi Aradhya: రీల్‌లో మాట్లాడినట్లుగా రియల్‌లో మాట్లాడండి - సింగర్ సునీతకు ప్రవస్తి కౌంటర్
రీల్‌లో మాట్లాడినట్లుగా రియల్‌లో మాట్లాడండి - సింగర్ సునీతకు ప్రవస్తి కౌంటర్
Heat Stroke Deaths in Telangana : తెలంగాణలో పెరుగుతోన్న హీట్ స్ట్రోక్ మరణాలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే, ఎండతో జాగ్రత్త
తెలంగాణలో పెరుగుతోన్న హీట్ స్ట్రోక్ మరణాలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే, ఎండతో జాగ్రత్త
Pravasthi Aradhya Caste: ప్రవస్తి ఆరాధ్య ఏమిట్లు? కాంట్రవర్సీలోనూ కులం గోల... గూగుల్ చేస్తున్న నెటిజన్లు
ప్రవస్తి ఆరాధ్య ఏమిట్లు? కాంట్రవర్సీలోనూ కులం గోల... గూగుల్ చేస్తున్న నెటిజన్లు
Embed widget