Nara Bhuvaneshwari: థాంక్స్ బాలా అన్నయ్య, బాలయ్య చేసిన పనికి నారా భువనేశ్వరి ఫుల్ హ్యాపీ - Xలో పోస్ట్
AP Latest News: చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. అలాగే చంద్రబాబు కుటుంబంలో కూడా ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి.
![Nara Bhuvaneshwari: థాంక్స్ బాలా అన్నయ్య, బాలయ్య చేసిన పనికి నారా భువనేశ్వరి ఫుల్ హ్యాపీ - Xలో పోస్ట్ Nara Bhuvaneshwari says thanks to Balakrishna over kissing her in Chandrababu oath taking ceremony Nara Bhuvaneshwari: థాంక్స్ బాలా అన్నయ్య, బాలయ్య చేసిన పనికి నారా భువనేశ్వరి ఫుల్ హ్యాపీ - Xలో పోస్ట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/0e1e6f57f9db96788d33b77175e86ee11718209601975234_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
TDP Latest News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. సీఎంగా చంద్రబాబుతో పాటు మంత్రులుగా పవన్ కల్యాణ్ మరో 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు. భారీగా నిర్వహించిన ఈ వేడుకకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని సగం మంది మంత్రులు హాజరయ్యారు. దిగ్గజ సినీ సెలబ్రిటీలు కూడా ప్రమాణ స్వీకార వేడుకలో సందడి చేశారు. గతంలో మునుపెన్నడూ లేని రీతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.
టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడంతో టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తున్న ఉత్సాహంతో పాటు ఆయన కుటుంబంలో కూడా ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సంతోషంలో మునిగితేలుతున్నారు. ప్రమాణ స్వీకార వేదికపై ఆమె కూర్చొని ఉన్నప్పుడే భువనేశ్వరి ముఖం వికసిస్తూ కనిపించింది. ఇంతలో ఆమె సోదరుడు బాలక్రిష్ణ చేసిన పని భువనేశ్వరికి మరింత ఆనందం కలిగించింది. ఈ విషయాన్ని భువనేశ్వరి స్వయంగా తెలిపారు.
వేదికపై నారా భువనేశ్వరి ఉండగా.. వెనక నుంచి సోదరుడు బాలక్రిష్ణ వచ్చి ఆమె నుదురిపై ముద్దు పెట్టారు. ఇలా అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధం చూసిన అందరికీ ముచ్చటేసింది. సదరు వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఇప్పుడు ఆ విషయంపైనే భువనేశ్వరి స్పందించారు.
‘‘ఒక భార్యగా, ఒక అమ్మగా నా మనసు ఆనందంతో నిండిన క్షణాల్లో... నాకు తోడబుట్టిన ప్రేమను పంచుతూ నా సంతోషాన్ని రెట్టింపు చేసావు. థాంక్స్ బాలా అన్నయ్య’’ అని భువనేశ్వరి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఒక భార్యగా, ఒక అమ్మగా నా మనసు ఆనందంతో నిండిన క్షణాల్లో... నాకు తోడబుట్టిన ప్రేమను పంచుతూ నా సంతోషాన్ని రెట్టింపు చేసావు. థాంక్స్ బాలా అన్నయ్య#BrotherLove pic.twitter.com/ue7QzDVhSQ
— Nara Bhuvaneswari (@ManagingTrustee) June 12, 2024
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)