అన్వేషించండి

Nara Bhuvaneswari : ప్రజల మద్దతు ఎంతో ధైర్యాన్ని ఇస్తోంది - నిజం తప్పక గెలుస్తుందన్న నారా భువనేశ్వరి !

ప్రజల మద్దతు ధైర్యాన్ని ఇస్తోందని నారా భువనేశ్వరి అన్నారు. నిజం తప్పక గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

 

Nara Bhuvaneswari :    నిజం గెలవాలి పేరుతో తాను చేస్తున్న యాత్రకు ప్రజలు ఇస్తున్న మద్దతు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని నారా భువనేశ్వరి తెలిపారు.  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ పై 'నిజం గెలవాలి' అని ప్రజలతో కలిసి పోరాడుతున్నా అని నారా భువనేశ్వరి అన్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జనం చూపుతున్న ఆదరణ, కురిపించే ప్రేమ ఈ కష్ట సమయంలో మాకు ఎంతో ఊరటనిస్తోంది అని తెలిపారు. వారిచ్చే మద్దతు ఎంతో ధైర్యాన్నిస్తోందని ట్వీట్ చేశారు. తనను కలిసిన ప్రజలు చంద్రబాబు పాలనలో జరిగిన మంచి గురించి, నేటి రాక్షస పాలనలో పడుతున్న ఇబ్బందుల గురించి వివరించారని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వేలాది మందికి ఉపాధి కల్పించిన టీసీఎల్ సంస్థ ప్రతినిధులు కలిసి చంద్రబాబు చొరవతో ఈ సంస్థ ఏర్పాటు అయిందని చెప్పినప్పుడు ఎంతో గర్వపడ్డానని అన్నారు. ఇవన్నీ చూశాక మంచి ఎప్పటికైనా నిలుస్తుందని..నిజం తప్పక గెలుస్తుందని మరింత దృఢంగా చెప్పగలుగుతున్నా అని భువనేశ్వరి తన ట్వీట్‌లో నమ్మకం వ్యక్తం చేశారు. 

 

 

తిరుపతి జిల్లాలో మూడో రోజు నిజం గెలవాలి యాత్రను నారా భువనేశ్వరి కొనసాగిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక మరణించిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామంటూ ఆయన సతీమణి నారా భువనేశ్వరి భరోసా ఇస్తున్నారు.  శ్రీకాళహస్తి నియోజకవర్గంలో.. ఎర్రంరెడ్డిపాలెంలో సూరా మునిరత్నం కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. నారావారిపల్లి నుంచి రేణిగుంట మండలం ఎర్రంరెడ్డిపాలెంకు బయలుదేరారు. అదే విధంగా ఏర్పేడు మండలం మునగలపాలెం చేరుకుని వసంతమ్మ కుటుంబ సభ్యులకు, శ్రీకాళహస్తి రూరల్‌ మండల పరిధిలోని పొలి గ్రామంలో మునిరాజా కుటుంబ సభ్యులను నేడు పరామర్శించారు.                                  

'నన్ను అంతమొందించేందుకు కుట్ర' - ఏసీబీ న్యాయమూర్తికి చంద్రబాబు లేఖ

శుక్రవారం సాయంత్రం శ్రీకాళహస్తిలోని పాత ఆర్డీవో కార్యాలయం వద్ద నిజం గెలవాలి సభలో భువనేశ్వరి ప్రసంగిస్తారు. పార్టీపై ఉన్న మమకారం, అధినేతపై అభిమానంతో ఉంటూ వచ్చిన ఆత్మీయులను పోగొట్టుకోవడం ఎంతో బాధగా ఉందని, అన్ని వేళల్లోనూ పార్టీ అండదండలు పుష్కలంగా ఉంటాయంటూ ధైర్యం చెప్తూ భువనేశ్వరి ముందుకు కదులుతున్నారు.                                                   

ఏ క్షణమైనా కాంగ్రెస్ రెండో జాబితా - 45 మంది పేర్లు ఖరారు చేశామన్న స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ !

టాప్ హెడ్ లైన్స్

Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
YS Jagan Ampolu Jail Visit: సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్షసాధింపు - ప్రమాదం హత్య కాదన్న జగన్ - అప్పలరాజుతో ములాఖత్ క్యాన్సిల్
సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్షసాధింపు - ప్రమాదం హత్య కాదన్న జగన్ - అప్పలరాజుతో ములాఖత్ క్యాన్సిల్
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
CPR Full Form in Telugu: సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Embed widget