Nara Bhuvaneshwari: ‘కలలకు రెక్కలు’ అంటూ టీడీపీ కొత్త స్కీమ్ - ప్రారంభించిన నారా భువనేశ్వరి
Nijam Gelavali: నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ప్రత్తికొండ పర్యటనలో ఈ కొత్త కార్యక్రమాన్ని నారా భువనేశ్వరి ప్రకటించారు.
Nijam Gelavali: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా విపక్ష టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్ తో పాటు.. నారా భువనేశ్వరి కూడా జనాల మధ్యలోకి వెళ్లి ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా భువనేశ్వరి 'కలలకు రెక్కలు' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటర్ పూర్తి చేసుకుని ఉన్నత చదువులకు వెళ్ళాలి అనుకునే విద్యార్ధినుల కోసం కలలకు రెక్కలు కార్యక్రమం ఉపయోగపడుతుందని భువనేశ్వరి తెలిపారు. ఈ పథకం కింద ప్రొఫెషనల్ కోర్స్ లు నేర్చుకునే విద్యార్ధినులకు ప్రభుత్వ గ్యారెంటీ తో బ్యాంక్ రుణాలు ఇస్తుంది. విద్యార్థినులు బ్యాంక్ నుంచి పొందే రుణాలకు వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లించేలా కార్యక్రమం రూపొందించారు.
నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ప్రత్తికొండ పర్యటనలో ఈ కొత్త కార్యక్రమాన్ని నారా భువనేశ్వరి ప్రకటించారు. టీడీపీ - జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత ఉమ్మడి ప్రభుత్వంలో కలలకు రెక్కలు కార్యక్రమం ప్రారంభం అవుతుందని నారా భువనేశ్వరి ప్రకటించారు.
నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర ప్రస్తుతం కర్నూలు జిల్లాలో సాగుతోంది. చంద్రబాబు అరెస్టుకు మనస్తాపంతో చనిపోయిన వారి కుటుంబాలకు పరామర్శిస్తున్నారు. నేడు పత్తికొండతో పాటు కోడుమూరు నియోజకవర్గంలో కూడా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పర్యటన కొనసాగింది.