అన్వేషించండి

BJP On Polavaram : పోలవరంపై టీడీపీ, వైసీపీ రెండూ ఫెయిల్ - ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఏపీ బీజేపీ డిమాండ్ !

పోలవరంపై టీడీపీ, వైసీపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. రెండు పార్టీలు విఫలమయ్యాయని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.


BJP On Polavaram :   పోలవరం ప్రాజెక్టు విషయంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఏపీ బీజేపీ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి రూపాయి భరించేందుకు సిద్ధంగా ఉన్నా రెండు ప్రభుత్వాలు చెరో ఐదేళ్ల పాటు సమయం వృధా చేసి.. ఇప్పుడు కేంద్రంపై నిందలు వేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి మండిపడ్డారు.  ఇటీవల పోలవర విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య పరస్పర వివాదాలు, వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సీఎం జగన్ పోలవర నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. 

పోలవరం తప్పు మీదంటే మీదని టీడీపీ, వైసీపీ విమర్శలు

చంద్రబాబు సోమవారం పోలవరం పర్యటించి.. తమ హయాంలో గొప్పగా కట్టామని..జగన్ విఫలమయ్యారని ఆరోపించారు .దీనికి రివర్స్‌లో చంద్రబాబు వల్లే పోలవరంలో ఇబ్బందులు వచ్చాయని జగన్ ఆరోపించారు. ఈ క్రమంలో రెండు పార్టీలు ప్రజల్ని మభ్య  పెడుతున్నాయని..  పోలవరం విషయంలో తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నారని  బీజేపీ భావిస్తోంది. పోలవరం విషయంలో వడ్డించిన విస్తరిని ముందు పెట్టి ప్రజల కడుపు నింపమని చెప్పినా కాంట్రాక్టుల కక్కుర్తితో కాళ్లతో   వైసీపీ, టీడీపీ తన్నేసుకున్నాయని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు.  వడ్డించిన విస్తరిలా పోలవరం నిధులను కేంద్రం ఇస్తే..  రెండు పార్టీలు కలిసి కాళ్లతో తన్నేశాయన్నారు.  

పదేళ్లలో రెండు పార్టీలు కట్టలేకపోయాయి !   

ఏపీ జీవనాడి పోలవరం విషయంలో జరుగుతోంది ఇదేనన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టులను.. చంద్రబాబు తామే కట్టుకుంటామని తీసుకున్నారు.  2018కే పూర్తి చేస్తామని ప్రకటనలు చేశారు. కానీ చివరికి ఎటూ కాకుండా చేశారు. ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్ిచన వైసీపీ ప్రభుత్వం మరింతగా పోలవరం ప్రాజెక్టును ఇబ్బందుల్లోకి నెట్టింది. కాంట్రాక్టర్లను మళ్లీ మార్చేసి.. ఇప్పుడు  నేడు ఖర్మ కొద్దీ కేంద్రం కడుతోందని  నిందలేస్తున్నరని విష్ణువర్దన్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ జీవనాడి విషయంలో రెండు పార్టీలకూ చేతకాక ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని రాష్ట్ర ప్రజల్ని ముంచేశారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.  పోలవరం ప్రాజెక్టును ప్రమాదంలోకి నెట్టేశారన్నారు.  

రెండు పార్టీలు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే !                 

పోలవరం విషయంలో కేంద్రం వంద శాతం నిధులిస్తున్నా .. ప్రజలు ఒక్కో సారి అధికారం ఇచ్చినా ఈ రెండు ప్రాంతీయ పార్టీలకు చేతకాలేదన్నారు. అంటే ఆ రెండు ప్రాంతీయ పార్టీలు చేతకాని పార్టీలు అని విష్ణువర్దన్ రెడ్డి తేల్చేశారు. కొద్ది  నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇక మీరేమీ చేయలేరు.. చేయాల్సిన అవసరం లేదని విష్ణువర్ద్ రెడ్డి స్పష్టం చేశారు.  తర్వాత ఏపీలో NDA ప్రభుత్వం వస్తుంది. పోలవరం కట్టి చూపిస్తుందన్నారు. ఏపీ ప్రజలకు రెండు ప్రాంతీయ పార్టీలు క్షమాపణలు చెప్పాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. పరిపాలించి మేలు చేయమని చెరో సారి ప్రజలు అధికారం ఇస్తే.. రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను అంధకారం చేశారన్నారు.             

టాప్ హెడ్ లైన్స్

AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
Tirumala Latest News: తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాల పరిమితిపై భక్తులకు టీటీడీ క్లారిటీ
తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాల పరిమితిపై భక్తులకు టీటీడీ క్లారిటీ
Kakinada Crime News: యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
AP Rains Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో 7 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో 7 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
Buses To Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్‌ గణేష్ దర్శనానికి RTC ప్రత్యేక బస్సులు
ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్‌ గణేష్ దర్శనానికి RTC ప్రత్యేక బస్సులు
IND VS AFG 1st T20 Result Update: అభిషేక్ వీర‌విహారం.. 22 బంతుల్లోనే ఫిఫ్టీ.. ఆఫ్గాన్ పై టీమిండియా బంప‌ర్ విక్ట‌రీ.. స‌త్తా చాటిన ఇషాన్, అర్ష‌దీప్
అభిషేక్ ఊచకోత.. 22 బంతుల్లోనే ఫిఫ్టీ.. ఆఫ్గాన్ పై టీమిండియా బంప‌ర్ విక్ట‌రీ.. స‌త్తా చాటిన ఇషాన్, అర్ష‌దీప్
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బ్లాక్‌ కీ దక్కించుకొని పవర్ పోగొట్టుకుందెవరు? ఎలిమినేషన్ జరిగిందా! రేపటి నుంచి రెండో అవతారం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బ్లాక్‌ కీ దక్కించుకొని పవర్ పోగొట్టుకుందెవరు? ఎలిమినేషన్ జరిగిందా! రేపటి నుంచి రెండో అవతారం!
Arvind Kejriwal: గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
18th BRICS Summit: ఖనిజాలు, టెక్నాలజీని ఆయుధాలుగా మార్చవద్దు.. బ్రిక్స్ సదస్సు ముగింపులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఖనిజాలు, టెక్నాలజీని ఆయుధాలుగా మార్చవద్దు.. బ్రిక్స్ సదస్సు ముగింపులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
2026 మారుతి బలెనోలో ఏం మారింది? ఇంజిన్ పవర్‌, మైలేజ్‌, ఫీచర్లు పెరిగాయా, తగ్గాయా?
పాత బలెనోకు కొత్త బలెనోకు తేడా ఇదే.. కొనే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
Embed widget