అన్వేషించండి

Andhra News: తొలిసారి ఓటు వేయనున్న యువతకు డమ్మీ EVMలతో అవగాహనా కార్యక్రమం

AP Elections 2024: మొట్టమొదటి సారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతీ యువకులకు ఓటింగ్ ప్రక్రియను ఈవీఎం ద్వారా వివరించారు.

Andhra Pradesh News: గుంటూరు: తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావంలో భాగంగా మొట్టమొదటి సారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతీ యువకులకు ఓటింగ్ ప్రక్రియను ఈవీఎం ద్వారా వివరించారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు సీఎం అవడానికి గల ఆవశ్యకతను వివరిస్తూ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ‘‘My First Vote to CBN’’ ఈవెంట్ నిర్వహించారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువతతో గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఏపీ లీడర్స్ గా, వారియర్స్ గా ఎంపికైన వారితో కలిసి అరండల్ పేటలో ఓటు యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ.. ఓటు ఎలా వెయ్యాలి, ఎవరికి ఓటు వెయ్యాలి అనే అంశాల పైన మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఓటు వేసే ప్రక్రియలో ఎలాంటి మెళకువలు పాటించాలో కళ్ళకు కట్టినట్లు చూపుతూ ఏర్పాటు చేసిన డమ్మీ ఈవీఎంలతో వివరించారు. ఈవీఎంలలో ఉన్న బటన్లు నొక్కగానే గుర్తు పక్కనే ఎరుపు రంగులో ఉన్న లైట్ వెలుగుతూ ఓటు పడ్డట్లు శబ్దం వచ్చేలా ఏర్పాటు చేశారు. ఓటు వేశాక వీవీ ప్యాట్ లో కనపడి అదృశ్యం అయ్యే స్లిప్ నమూనాలను యువకులతో ఓటు వేయించిన తీరు యువతను ఆకట్టుకుంది.

ఏపీ వారియర్స్ అయిన జెట్టి జానకి రామయ్య, ఘంటా మౌళిక, నేపాక పద్మ తదితరులు మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతను ఓటింగ్ పై అవగాహన కల్పించారు. ఓటు ప్రాధాన్యత తెలపడంతో పాటు, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ఉన్న విలువను వారికి వివరించి కచ్చితంగా ఓటు వేయాలని సూచించారు.

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
YSRCP North Andhra Crisis: ఉత్తరాంధ్రలో వైఎస్సార్‌సీపీ గాలిలో దీపం - ఖాళీ అవుతున్న గూడు.. ఆశలు వదిలేసుకున్నట్లేనా?
ఉత్తరాంధ్రలో వైఎస్సార్‌సీపీ గాలిలో దీపం - ఖాళీ అవుతున్న గూడు.. ఆశలు వదిలేసుకున్నట్లేనా?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Dharani I Love You: రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
Embed widget