అన్వేషించండి

Mudragada Padmanabham : ఫైనల్‌గా వైసీపీలోకే ముద్రగడ పద్మనాభం - 12వ తేదీన కుటుంబమంతా చేరే అవకాశం !

Mudragada Padmanabham : ముద్రగడ కుటుంబం 12వ తేదీన వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంపీ మిథున్ రెడ్డి ముద్రగడతో ఫోన్ లో మాట్లాడి..

Mudragada Padmanabham Join In YSRCP :   మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 12న ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉంది.  ముద్రగడ ఇంటికి వైసీపీ నేత జక్కంపూడి గనేణ్ వెళ్లి చర్చలు జరిపారు.  వైసీపీలో చేరాలని ఆహ్వానించారు. వైసీపీ ఎంపీ, ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోర్డినేటర్ మిథున్ రెడ్డి  ముద్రగడతో ఫోన్ లో మాట్లాడారు.. వైసీపీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం లేదా పిఠాపురం సీట్లలో ఒక చోట ముద్రగడకు లేదా ఆయన కుటుంబసభ్యులకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో పద్మనాభం ఓకే చేసినట్లుగా చెబుతున్నారు.               
 
ముద్రగడ పద్మనాభం జనవరి ఒకటో తేదీన భారీ విందు సమావేశం పెట్టారు. ఈ సమవేశంలో వైసీపీలో చేరుతారని ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ ఆయన ప్రకటించలేదు. తర్వాత వైసీపీలో చేరేది లేదన్నారు. జనసేనలో చేరుతానని ప్రకటించారు. అయితే పవన్ కల్యాణ్ ముద్రగడ నివాసంకు వచ్చి పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉన్నట్లుగా కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. పవన్ ఇంటికి వచ్చి ఆహ్వానిస్తారని అనుకున్నా రాకపోవడతో ముద్రగడ అసంతృప్తి వ్యక్తం చేశారు.  టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుంది. దీనిపై ముద్రగడ పవన్ కల్యాణ్ కు లేఖ రాశారు. జనసేన తక్కువ సీట్లు తీసుకుందన్నారు.                                   

ఈ లేఖ తరువాత పవన్ టీడీపీ – జనసేన నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. పార్టీ మద్దతు దారులు నాకు సలహాలు ఇవ్వద్దు.. నాపై నమ్మకం ఉంటే నాతో కలిసిరండి అంటూ వ్యాఖ్యానించారు. దీంతో  ముద్రగడ జనసేనకు దూరమైనట్లు.. వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతూ వచ్చింది. ఆయన వైసీపీ తరపున పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని, ఒకవేళ ఆయన పోటీ చేయకపోయినా ఆయన కుమారుడు పోటీ చేస్తారని వైసీపీ వర్గాలు పేర్కొంటూ వచ్చాయి. ఈ క్రమంలో పిఠాపురంర ఇంచార్జ్.. వంగా గీతను.. పిలిపించి మాట్లాడారు సీఎం జగన్.  పవన్ కల్యాణ్ పోటీ చేస్తే మార్పు ఉండవచ్చని చెప్పారు.                  

ముద్రగడ పద్మనాభం సీనియర్ నేత. టీడీపీ హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం పోరాడారు. తునిలో ఆయన నిర్వహించిన సభ ఉద్రిక్తతకు దారి తీసింది. రైలు ను కూడా తగులబెట్టారు. అయితేతర్వాత రిజర్వేషన్ల ఉద్యమాన్ని వదిలేశారు.  వైసీపీతో దగ్గరగావ్యవహరిస్తున్నారు.. మళ్లీ జనసేనకు దగ్గరయ్యారు. ఇప్పుడు మళ్లీ వైసీపీకి వెళ్తున్నారు.                                                     

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget