Undavalli : వాళ్ల భేటీ ఖచ్చితంగా రాజకీయమే - రాజకీయాలు ఎలా మారతాయో చెప్పిన ఉండవల్లి !
కేంద్ర మంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ లు రాజకీయాలు మాట్లాడుకునేందుకే భేటీ అయ్యారని.. ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
Undavalli : కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీపై రాజకీయవర్గాల్లో విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఈ భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారి సమావేశం వెనుక రాజకీయమే ఉండొచ్చన్నారు. రాజకీయం లేకుండా బీజేపీ ఏమీ చేయదని ఆయన చెబుతున్నారు. ఎన్టీఆర్‌కు గొప్ప నైపుణ్యం ఉందన్నార.ు రెండు తెలుగు రాష్ట్రాల్లో తారక్ చరిష్మాను బీజేపీ వినియోగించుకునే అవకాశం ఉందని ఉండవల్లి చెబుతున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్‌కు అన్ని విషయాలపై అవగాహన ుందన్నారు. ఎప్పుడెలా వ్యవహరించాలో ఆయనకు బాగా తెలుసని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
తారక్ కు రాజకీయ ఆసక్తి ఉంది
జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయాలపై ఆసక్తి ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అందుకే 2009 ఎన్నికల్లో తెదేపా తరఫున ప్రచారం చేశారని గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీ కోసం చాలా కష్టపడి తిరిగారని.. ఆయన ప్రసంగాలు తాను విన్నానని తెలిపారు. జనంలో బాగా కలిసిపోతారని అభిప్రాయపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ కి తన తాత సీనియర్ రామారావు పోలికలు వచ్చాయని ఉండవల్లి అన్నారు. ముఖంలో మంచి ఎక్స్ ప్రెషన్ ఉందన్నారు. ఆ తరానికి సీనియర్ ఎన్టీఆర్ లా ఈ తరం వారికి తారక్ గుర్తుండిపోతారన్నారు. అందుకే రాజకీయ భవిష్యత్ కూడా ఉజ్వలంగా ఉంటుందని అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
జనసేనలో కోవర్టులెవరు ? పవన్ వార్నింగ్‌లతో జనసేన నుంచి వెళ్లే వాళ్లు ఎంత మంది ?
తారక్ కు అన్నీ తెలుసు !
జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మీద వ్యక్తిగతంగా తనకు మంచి అభిప్రాయం ఉందన్నారు ఉండవల్లి. తారక్ మర్యాద, మేనర్స్ తెలిసిన మనిషి అనీ.. బాగా మాట్లాడతారని అన్నారు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్‌ను అమిత్ షా కలిశారంటే కచ్చితంగా అది రాజకీయమే అన్నారు. వాళ్లు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ.. వారి సమావేశం మాత్రం కచ్చితంగా రాజకీయంగానే ఉంటుందని చెబుతున్నారు. అయితే ఎన్టీఆర్ బీజేపీలో చేరుతారని మాత్రం ఉండవల్లి చెప్పలేదు. కానీ బీజేపీ.. ఎన్టీఆర్‌ను ఉపయోగించుకుంటుందని చెబుతున్నారు. అది ఎలా అన్నది మాత్రం ఉండవల్లి చెప్పలేకపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో జోరుగా రాజకీయ చదరంగం ! కీలక మార్పులకు "భేటీలు" గ్రౌండ్ ప్రిపేర్ చేసేశాయా ?
రామోజీరావు కలిసేందుకు మోదీ కూడా రావొచ్చు...!
రామోజీరావును కలిసేందుకు షా వచ్చారని.. భవిష్యత్తులో ప్రధాని మోదీ కూడా రామోజీ వద్దకు రావొచ్చని అన్నారు. రామోజీరావుకు చెందిన మార్గదర్శి సంస్థపై ఉండవల్లి అరుణ్ కుమార్ న్యాయపోరాటం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారని ఆయన పిటిషన్ వేశారు. అయితే డిపాజిట్లన్నీ తిరిగి ఇచ్చేయడంతో హైకోర్టు ఈ కేసును కొట్టి వేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజుల తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంపై ఉండవల్లి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామోజీరావు చేసిన తప్పును సుప్రీంకోర్టులో నిరూపిస్తానన్నారు.