అన్వేషించండి

YSRCP News: ఆర్కే బాటలో వైసీపీలోకి ఎంపీ లావు క్రిష్ణదేవరాయలు! ఆయన రియాక్షన్ వైరల్

MP Sri Krishna Devarayalu: ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా తిరిగి వైసీపీ గూటికి చేరతారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఆయన ఘాటుగా స్పందించారు.

YSRCP News: నరసరావుపేట: ఏపీలో గత కొన్ని రోజులుగా నేతలు పార్టీలు మారడం కామన్ అయిపోయింది. వైసీపీలో గౌరవం లేదని, నమ్మకం ఉంచినా తనకు సీట్లు ఇవ్వడం లేదని కొందరు పార్టీ మారారు. మరికొందరు పార్టీ ఫిరాయించేందుకు సిద్ధంగా ఉన్నారు. టీడీపీలోనూ తమకు అవమానాలు ఎదురవుతున్నాయని, అలాంటి చోట ఉండలేమంటూ కేశినేని నాని లాంటి నేతలు పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోవడం చూశాం. 

ఈ క్రమంలో వైసీపీలో అవమానాలు ఇక భరించే ఓపిక లేదంటూ జగన్ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి తిరిగి జగన్ వద్దకే వచ్చారు. కాంగ్రెస్ పార్టీని వీడి మళ్లీ వైసీపీలో చేరారు. ఇదే బాటలో మరికొందరు నేతలు అని ప్రచారం జరుగుతోంది. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా తిరిగి వైసీపీ గూటికి చేరతారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి జగన్ నాయకత్వంలో పని చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరిగింది. దీనిపై ఆయన ఘాటుగా స్పందించారు. తాను ఎవ్వరి అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూడటం లేదని, ఎవరినో కలవాలని చూడటం లేదని, ఎవరిని దేనికోసం ప్రాథేయపడటం లేదని స్పష్టం చేశారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేయవద్దని లావు శ్రీకృష్ణదేవరాయలు తన ట్విట్టర్ ద్వారా కోరారు.

లావు శ్రీకృష్ణ దేవరాయలు కొన్ని రోజుల కిందట వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. ఆయన నరసరావుపేట నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ పై స్పష్టత రాకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అంతకుముందు పలుమార్లు సీఎం జగన్ తో భేటీ అయి విషయంపై కృష్ణదేవరాయలు చర్చించారు. కానీ ప్రయోజనం లేకపోవడంతో ఫ్యాన్ పార్టీని వీడారు. ఇటీవల నరసరావుపేట ఎంపీ స్థానానికి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను ఇంఛార్జ్‌గా నియమించారు.

నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి మళ్లీ తానే పోటీ చేస్తానని ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు. సాగునీటి ప్రాజెక్టుల అనుసంధానం, యువతకు ఉద్యోగాలు, వ్యాపార సంస్థల పెంపు విషయాలపై తాను ఫోకస్ చేశానని చెప్పారు. తన ఎంపీ నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో 100 పడకల ఆస్పత్రితో పాటు పల్నాడులో పీఎం గతి శక్తి కింద లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేయాలనేదే తన లక్ష్యమన్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే దానిపై స్పష్టత రాలేదు.

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Rains: ఏపీకి తుపాను గండం.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు- 60 కి.మీ వేగంలో ఈదురుగాలులు
ఏపీకి తుపాను గండం.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు- 60 కి.మీ వేగంలో ఈదురుగాలులు
AP Local Body Elections: ఒడిశాలో ఏపీ ఎన్నికలా.. ఆంధ్రా గో బ్యాక్ అన్న బీజేపీ ఏం చెస్తుంది? నవీన్ పట్నాయక్ ఆగ్రహం
ఒడిశాలో ఏపీ ఎన్నికలా.. ఆంధ్రా గో బ్యాక్ అన్న బీజేపీ ఏం చెస్తుంది? నవీన్ పట్నాయక్ ఆగ్రహం
AP Local Body Election: ఏపీలో మున్సిపల్ ఎన్నికల రచ్చ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ, రేపు విచారణ 
ఏపీలో మున్సిపల్ ఎన్నికల రచ్చ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ, రేపు విచారణ 
Local Body Elections Results: స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రభుత్వాలకు కొలమానమా? విజయం కోసం దౌర్జన్యాల వెనుక అసలు కథ!
స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రభుత్వాలకు కొలమానమా? విజయం కోసం దౌర్జన్యాల వెనుక అసలు కథ!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nagole Road Accident: నాగోల్‌‌లో పైప్‌లైన్‌ను ఢీకొట్టిన కారు, వ్యక్తి మృతి- వరద బీభత్సంతో నీటి సరఫరా బంద్
నాగోల్‌‌లో పైప్‌లైన్‌ను ఢీకొట్టిన కారు, వ్యక్తి మృతి- వరద బీభత్సంతో నీటి సరఫరా బంద్
Andhra Pradesh Rains: ఏపీకి తుపాను గండం.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు- 60 కి.మీ వేగంలో ఈదురుగాలులు
ఏపీకి తుపాను గండం.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు- 60 కి.మీ వేగంలో ఈదురుగాలులు
KTR New Look : క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
Samson Super Fandom: రజినీకాంత్ సినిమా కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజు .. జైలర్ 2 స్పెషల్ షోతో టీమిండియా స్టార్ భారీ సెలబ్రేషన్
రజినీకాంత్ సినిమా కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజు .. జైలర్ 2 స్పెషల్ షోతో టీమిండియా స్టార్ భారీ సెలబ్రేషన్
Thalassemia in Kids : చిన్నపిల్లల్లో తలసేమియాకు కారణాలు, లక్షణాలు ఇవే.. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చిన్నపిల్లల్లో తలసేమియాకు కారణాలు, లక్షణాలు ఇవే.. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Aadarsha Kutumbam Maala Song : నీ ఒంట్లో ఉంది కరెంటు... వెలిగించవే నా ఫిలమెంటు - వెంకీ నివేదా రొమాంటిక్ సాంగ్ లిరిక్స్
నీ ఒంట్లో ఉంది కరెంటు... వెలిగించవే నా ఫిలమెంటు - వెంకీ నివేదా రొమాంటిక్ సాంగ్ లిరిక్స్
రెనాల్ట్‌ డస్టర్‌ హైబ్రిడ్‌ vs మారుతి విక్టోరిస్‌ హైబ్రిడ్‌.. మైలేజీ, ఫీచర్లు, ధరలో ఏది ఎక్కువ బెనిఫిట్‌ ఇస్తుంది?
రెనాల్ట్‌ డస్టర్‌ హైబ్రిడ్‌ vs మారుతి విక్టోరిస్‌ హైబ్రిడ్‌.. ధర, ఫీచర్లు, మైలేజీలో ఏది బెస్ట్‌?
AP Local Body Elections: ఒడిశాలో ఏపీ ఎన్నికలా.. ఆంధ్రా గో బ్యాక్ అన్న బీజేపీ ఏం చెస్తుంది? నవీన్ పట్నాయక్ ఆగ్రహం
ఒడిశాలో ఏపీ ఎన్నికలా.. ఆంధ్రా గో బ్యాక్ అన్న బీజేపీ ఏం చెస్తుంది? నవీన్ పట్నాయక్ ఆగ్రహం
Embed widget