By: Harish | Updated at : 07 Mar 2023 07:15 PM (IST)
జనఔషధి దివస్ కార్యక్రమంలొ మంత్రి రజని
Vidadala Rajani Review : జనరిక్ మందులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, వైద్య ఆరోగ్య విభాగానికి చెందిన వారంతా ఈ విషయంపై చొరవచూపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని సూచించారు. మంగళగిరిలోని నిర్మలా ఫార్మసీ కళాశాలలో ప్రభుత్వం అధికారికంగా జనఔషధి దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించింది. మంత్రి విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొన్ని కంపెనీలు మార్కెటింగ్, పర్సంటేజిల ఆశచూపుతూ మందులను అధిక ధరలకు విక్రయించే ప్రయత్నం చేస్తుంటాయని, వీరి మాయలో ఎవరూ పడకూడదని కోరారు. మందుల చీటిలపై రోగానికి సంబంధించిన ఔషధం పేరే రాయలని పేర్కొన్నారు. జన ఔషధి దుకాణాల్లో అత్యంత చౌక ధరకే మందులు దొరుకుతాయని తెలిపారు. నేరుగా కంపెనీ నుంచి వచ్చిన ఔషధాన్ని ప్రజలకు అందజేస్తారని చెప్పారు. చాలా చౌకగా, అత్యంత నాణ్యమైన మందులు జన ఔషధి దుకాణాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. రోగులంతా ఈ దుకాణాల్లోనే మందులు కొనుగోలు చేసేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఔషధ నియంత్రణ అధికారులదేనని చెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమున్నత లక్ష్యంతో పని చేస్తున్నారని మంత్రి రజని తెలిపారు. పేదలందరికి అత్యంత సులువుగా, వేగంగా నాణ్యమైన వైద్యం పూర్తి ఉచితంగా అందాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ వైద్య శాలలన్నింటినీ నాడు- నేడు కార్యక్రమం కింద పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందజేస్తున్నామని చెప్పారు. జగనన్న లక్ష్యాలు, ప్రభుత్వ సంకల్పం నెరవేర్చేలా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పనిచేయాలని పేర్కొన్నారు. ఎన్ ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వ్యవస్థలు నడిచేలా చూడాలన్నారు. ఎవరైనా కంపెనీల పేర్లతో మందుల చీటిలు రాస్తున్నా, వాటిని ఏ మందుల దుకాణాలైనా ప్రోత్సహిస్తున్నా చర్యలకు వెనుకాడొద్దని తెలిపారు. అప్పుడే జన ఔషధి దివాస్ కార్యక్రమాల లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పారు.
జన ఔషధి దుకాణాల్లో ఏకంగా 1759 రకాల మందులు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. 280 సర్జికల్ డివైజెస్ కూడా దొరుకుతాయని చెప్పారు. ఇవన్నీ అత్యంత తక్కువ ధరకే లభిస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఈ దుకాణాల వల్ల ఎంతో మేలు జరుగుతుందని, వీరంతా ఔషధి దుకాణాల్లోనే మందులు కొనుగోలు చేసేలా చూడాల్సిన బాధ్యత వైద్యులు, డ్రగ్ విభాగం అధికారులదేనని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 145 జనఔషధి కేంద్రాలు ఉన్నాయని, వీటి సంఖ్యను మరింతగా పెంచబోతున్నామని వివరించారు.జన ఔషది దుకాణాలను మారు మూల ప్రాంతాల్లో కూడ అందుబాటులో ఉంచటం ద్వారe,ప్రజలందరికి అవగాహన కల్పించటంతో పాటుగా, సామాన్యులకు మందులను అందుబాటులో ఉండే విధంగా చొరవ తీసుకుంటామని ప్రకటించారు. జన ఔషది మందులు పై అవగాహన కల్పించాలని,అపోహలను పక్కప పెట్టి ,వినియోగం పెంచుకోవాలని సూచించారు.
Palnadu News : పల్నాడు జిల్లాలో విషాదం, నదిలో ఈతకు దిగి ఇద్దరు యువకులు మృతి
CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం
Mekapati challenge : దమ్ముంటే రండి, నన్ను తరిమేయండి- నడిరోడ్డుపై కూర్చీ వేసుకుని కూర్చొన్న ఎమ్మెల్యే మేకపాటి
అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు
CM Jagan : రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదు, నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లిన సీఎం జగన్
Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!
Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు
Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు
IPL 2023: ఐపీఎల్ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్ ఫొటో! మరి రోహిత్ ఎక్కడా?