IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK
IPL, 2022 | Match 69 | Wankhede Stadium, Mumbai - 21 May, 07:30 pm IST
(Match Yet To Begin)
MI
MI
VS
DC
DC

ROja Phone Tension : హమ్మ..రోజా ఫోన్‌నే కొట్టేస్తారా?

తిరుపతిలో మంత్రిగా తొలి సమీక్ష చేసిన రోజాకు షాక్ తగిలింది.ఫోన్ పోయింది. అయితే కాసేపటికే ఫోన్ తీసుకున్న వ్యక్తి తెచ్చివ్వడంతో మంత్రి ఊపిరి పీల్చుకున్నారు.

FOLLOW US: 

మంత్రి పదవులు వస్తే సుఖాలే కాదు చాలా కష్టాలు ఉంటాయి. కొన్ని చెప్పుకోవడానికి కూడా విచిత్రంగా ఉంటాయి. అలాంటి సమస్యను కొత్త మంత్రి రోజా తిరుపతిలో ఎదుర్కొన్నారు. మంత్రి హోదాలో తొలి సారిగా  ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్ లో మంత్రి హోదాలో ఆర్.కే.రోజా శాప్‌ తొలి సమీక్షా సమావేశం నిర్వహించాు.  మంత్రిగా భాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి సమీక్షా  సమావేశం‌ కావడంతో ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగంలో నూతనంగా నిర్మించిన జ్ఞానప్రద శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం సందర్శించి స్వామి వారికి  ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో తన చేతిలో ఉన్న ఫోన్‌ను పీఏకి పట్టుకోమని ఇచ్చారు. అతను తీసుకున్నాడు.  

తర్వతా సమీక్షలో బిజీగా గడిపారు. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత కారు ఎక్కే సమయంలో పీఏను ఫోన్ ఇవ్వమని అడిగారు.  పీఏకు మ్యాటర్ అర్థం కాలేదు. తన ఫోన్ ఇవ్వమన్నారేమో అని మంత్రి గారి వైపు ప్రశ్నార్థకంగా చూశారు. ఆమె తాను ఇచ్చిన తన ఫోన్ ఇవ్వమని అడగడంతో  పీఏకి మైండ్ బ్లాంక్ అయింది. తనకు ఫోన్ ఇవ్వలేదని చెప్పడంతో మంత్రి రోజాకు షాక్ తగిలినట్లయింది. తన పీఏ అబద్దం చెప్పడు. తన ఫోన్ తీసుకుని ఏం చేసుకోలేడు. మరి ఎవరికి ఇచ్చి ఉంటానా అని రోజా ఆలోచించారు. ఎవరికి ఇచ్చానో తెలియదు కానీ... గుళ్లో పూజలు చేస్తున్న సమయంలో తాను పట్టుకోమనిఇచ్చింది పీఏకి కాదని.. అక్కడున్న మరో వ్యక్తికి అని అర్థం అయిపోయింది. వెంటనే పోలీసుల్ని అప్రమత్తం చేశారు. 

ఫోన్ తీసుకున్న వ్యక్తి అప్పటికి స్విచ్చాఫ్ చేసేశాడు. అయితే అత్యాధునిక ట్రాకింగ్ వ్యవస్ధతో రోజా పోన్ ఎక్కడ ఉందో  పోలీసులు కనిపెట్టారు. ఆ ఫోన్ తీసుకున్న వ్యక్తి కూడాఎక్కడ దొరికిపోతామోనని భయపడ్డారో లేకపోతే... ఇంకేదైనా కారణం ఉందేమో కానీ అతను ఫోన్ తీసుకు వచ్చి నేరుగా రోజాకే ఇచ్చారు. దీంతో పోయిందనుకున్న ఫోన్ తిరిగి రావడంతో రోజా రిలాక్స్ అయ్యారు. ఫోన్ తీసుకుని వేరే కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. 

ఇప్పుడు ఫోన్ లేకపోతే ఎవరికీ రోజు గడవదు. ముఖ్యంగా ఎల్లపుడూ బిజీగా ఉండే రాజకీయ నేతలకు అయితే సాధ్యం కాదు. పైగా ఫోన్‌లో ఎన్నోరహస్యాలు ఉంటాయి. ఇలా కొంత సేపు ఇతరుల చేతిలోకి ఫోన్ వెళ్తే ఇబ్బందికరమే. అయితే రోజా మంత్రి కాబట్టి  ఫోన్ తీసుకున్న వారు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా  తీసుకువచ్చి ఇచ్చారు. దాంతో పోలీసులకూ టెన్షన్ తప్పిపోయింది. 

Published at : 21 Apr 2022 02:48 PM (IST) Tags: Roja Minister Roja RoJa phone theft

సంబంధిత కథనాలు

Breaking News Live Updates : ఎమ్మెల్సీ కారులో మృతదేహం కలకలం 

Breaking News Live Updates : ఎమ్మెల్సీ కారులో మృతదేహం కలకలం 

CM Jagan Davos Tour : సీఎం జగన్ దావోస్ పర్యటన, పెట్టుబడులే టార్గెట్!

CM Jagan Davos Tour : సీఎం జగన్ దావోస్ పర్యటన, పెట్టుబడులే టార్గెట్!

Petrol Diesel Price 20th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా

Petrol Diesel Price 20th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా

Gold Silver Price Today 20th May 2022 : మళ్లీ పెరిగిన బంగారం ధరలు, కాస్త తగ్గిన వెండి ధరలు, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా

Gold Silver Price Today  20th May 2022 : మళ్లీ పెరిగిన బంగారం ధరలు, కాస్త తగ్గిన వెండి ధరలు, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా

Weather Updates : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

Weather Updates : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Nikhat Zareen Profile: ఓవర్‌నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్‌ది 12 ఏళ్ల శ్రమ!

Nikhat Zareen Profile: ఓవర్‌నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్‌ది 12 ఏళ్ల శ్రమ!

Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!

Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!

NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు

NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు

Natural Painkillers: ఈ ఆహారపదార్థాలలో పెయిన్ కిల్లర్స్ లక్షణాలు అధికం, నొప్పిని తగ్గిస్తాయి

Natural Painkillers: ఈ ఆహారపదార్థాలలో పెయిన్ కిల్లర్స్ లక్షణాలు అధికం, నొప్పిని తగ్గిస్తాయి