అన్వేషించండి

Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ చొరవ - వెను వెంటనే డిగ్రీ కళాశాల సిబ్బందికి నియామక ఉత్తర్వులు, సమస్యలుంటే మెయిల్ చేయండి!

Andhrapradesh News: మంత్రి నారా లోకేశ్ చొరవతో మదనపల్లె బీటీ డిగ్రీ కళాశాల సిబ్బందికి నియామక ఉత్తర్వులు అందాయి. ప్రజలు తమ సమస్యలను పూర్తి వివరాలతో మెయిల్ ద్వారా తెలియజేయాలని ఆయన సూచించారు.

Minister Nara Lokesh Solved Employees Problems: మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) చొరవతో డిగ్రీ కళాశాల సిబ్బందికి నియామక ఉత్తర్వులు అందాయి. 23 నెలలుగా తమకు అందాల్సిన నియామక ఉత్తర్వులు, జీతాలు అందలేదని మదనపల్లె బీటీ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రజా దర్భార్‌లో మంత్రి లోకేశ్‌కు తమ పరిస్థితిని వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఆయన కళాశాల విద్యా కమిషనర్ పోలా భాస్కర్‌కు సమస్య పరిష్కరించాలని సూచించారు. ఆయన ఆదేశాలతో ప్రిన్సిపాల్ వెను వెంటనే 32 మందికి నియామక పత్రాలు అందజేశారు. 'కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందిని గత వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది. 23 నెలలుగా న్యాయబద్ధంగా వారికి అందాల్సిన నియామక ఉత్తర్వులు, జీతాలు ఇవ్వకుండా మానసిక వేదనకు గురి చేసింది. ప్రజాదర్భార్‌లో నా దృష్టికి ఈ విషయం రాగా అధికారులకు తగు ఆదేశాలిచ్చి పరిష్కరించా.' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. కాగా, ఇటీవల ఒక్క వాట్సాప్ మెసేజ్‌‍తో సర్టిఫికెట్ సమస్యను పరిష్కరించి.. అందుకు తగిన జీవో కూడా వెను వెంటనే ఇచ్చి 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించిన విషయం తెలిసిందే.

మెయిల్ చేస్తే..

కాగా, మంత్రి లోకేశ్‌ వాట్సాప్ సాంకేతిక కారణాలతో ఇటీవల బ్లాక్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలతో తనను వచ్చి కలవాల్సిన అవసరం లేదని లోకేశ్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను పూర్తి వివరాలతో hello.lokesh@ap.gov.in మెయిల్ ఐడీకి పంపించాలని సూచించారు. సమస్యలు పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రం నలుమూలల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ లోకేశ్ వాట్సాప్‌కు మెసేజ్‌లు పోటెత్తడంతో ఆయన వాట్సాప్ బ్లాక్ అయ్యింది. దీంతో ఆయన ప్రత్యామ్నాయంగా మెయిల్ ఐడీని ఇచ్చారు. సాయం కోసం వచ్చే ప్రజలకు తన ఇంటి తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని అన్నారు. పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, సమస్య - సహాయానికి సంబంధించిన పూర్తి వివరాలు వినతిలో పొందుపరచాలని సూచించారు.

Also Read: Andhra Pradesh IPS Transfers : ఏపీలో మరోసారి భారీగా ఐపీఎస్‌ల బదిలీలు - పలువురు ఎస్పీలకు స్థానచలనం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! ఆ పత్రం చూపిస్తే కొత్త రేషన్ కార్డ్
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! ఆ పత్రం చూపిస్తే కొత్త రేషన్ కార్డ్
Hindenburg Research: హిండెన్‌బర్గ్ మరో నివేదిక, సెబీ ఛైర్ పర్సన్ మాధవి బుచ్‌‌పై సంచలన ఆరోపణలు
హిండెన్‌బర్గ్ మరో నివేదిక, సెబీ ఛైర్ పర్సన్ మాధవి బుచ్‌‌పై సంచలన ఆరోపణలు
Duvvada Family Issue :  దువ్వాడ ఫ్యామిలీ సర్కస్‌లో డీఎన్‌ఏ టెస్టుల గోల  - మాధురీ, శ్రీవాణి పరస్పర డిమాండ్స్
దువ్వాడ ఫ్యామిలీ సర్కస్‌లో డీఎన్‌ఏ టెస్టుల గోల - మాధురీ, శ్రీవాణి పరస్పర డిమాండ్స్
Nagarjuna Akkineni: అందుకే హడావుడిగా నిశ్చితార్థం జరిపించాం - శోభిత వల్ల చై మళ్లీ సంతోషంగా కనిపించాడు..
అందుకే హడావుడిగా నిశ్చితార్థం జరిపించాం - శోభిత వల్ల చై మళ్లీ సంతోషంగా కనిపించాడు..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Wayanad Landslides | Farewell to Indian Army | వయనాడ్ లో సైనికులకు ఘన వీడ్కోలు | ABP DesamNeeraj Chopra Silver Medal in Paris Olympics 2024 | బంగారు పతకం రాకపోవడంపై నీరజ్ ఫస్ట్ రియాక్షన్ |Arshad Nadeem Gold Medal in Paris Olympics 2024 | మేస్త్రీ కొడుకు బంగారు పతకం సాధించాడు.!Neeraj Chopra Silver Medal in Paris Olympics 2024| Javelin throwలో వెండి పతకంతో సరిపెట్టుకున్న నీరజ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! ఆ పత్రం చూపిస్తే కొత్త రేషన్ కార్డ్
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! ఆ పత్రం చూపిస్తే కొత్త రేషన్ కార్డ్
Hindenburg Research: హిండెన్‌బర్గ్ మరో నివేదిక, సెబీ ఛైర్ పర్సన్ మాధవి బుచ్‌‌పై సంచలన ఆరోపణలు
హిండెన్‌బర్గ్ మరో నివేదిక, సెబీ ఛైర్ పర్సన్ మాధవి బుచ్‌‌పై సంచలన ఆరోపణలు
Duvvada Family Issue :  దువ్వాడ ఫ్యామిలీ సర్కస్‌లో డీఎన్‌ఏ టెస్టుల గోల  - మాధురీ, శ్రీవాణి పరస్పర డిమాండ్స్
దువ్వాడ ఫ్యామిలీ సర్కస్‌లో డీఎన్‌ఏ టెస్టుల గోల - మాధురీ, శ్రీవాణి పరస్పర డిమాండ్స్
Nagarjuna Akkineni: అందుకే హడావుడిగా నిశ్చితార్థం జరిపించాం - శోభిత వల్ల చై మళ్లీ సంతోషంగా కనిపించాడు..
అందుకే హడావుడిగా నిశ్చితార్థం జరిపించాం - శోభిత వల్ల చై మళ్లీ సంతోషంగా కనిపించాడు..
Pawan Kalyan: ఆగస్ట్ 15 సందర్భంగా పంచాయతీలకు భారీగా నిధులు, మంత్రి పవన్ కళ్యాణ్ సంచలనం
ఆగస్ట్ 15 సందర్భంగా పంచాయతీలకు భారీగా నిధులు, మంత్రి పవన్ కళ్యాణ్ సంచలనం
Chandrababu: తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు కీలక భేటీ, రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై స్పష్టత
తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు కీలక భేటీ, రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై స్పష్టత
Keerthy Suresh: ఫల్మ్‌ఫేర్‌ అవార్డుతో కీర్తి సురేష్ - దసరా టీంతో కలిసి ఫోటోలకు ఫోజులు
ఫల్మ్‌ఫేర్‌ అవార్డుతో కీర్తి సురేష్ - దసరా టీంతో కలిసి ఫోటోలకు ఫోజులు
Wayanad: కన్నీళ్లు పెట్టుకున్న వయనాడ్ బాధితులు, ఓదార్చిన ప్రధాని మోదీ - వీడియో
కన్నీళ్లు పెట్టుకున్న వయనాడ్ బాధితులు, ఓదార్చిన ప్రధాని మోదీ - వీడియో
Embed widget