By: ABP Desam | Updated at : 14 Dec 2022 03:51 PM (IST)
పవన్ ను ట్రోల్ చేసిన పోస్ట్ ను షేర్ చేసిన మంచు లక్ష్మి
Manchu lakshmi On Pawan : పవన్ కల్యాణ్ ఫోటో పక్కన తన ఫోటో ఉండటం తనకు ఎంతో ధ్రిల్ కలిగించిందని మంచు లక్ష్మి పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి మంచు లక్ష్మి పవన్ కల్యాణ్‌పై ఎంతో గౌరవంతోనే ఆ పోస్ట్ పెట్టారు. కానీ ఆమె షేర్ చేసిన కంటెంట్ మాత్రం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను ఇబ్బంది పెట్టేలా ఉంది. దాంతో మంచు లక్ష్మిపై పవన్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.
పవన్ కల్యాణ్ ఇటీవల మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారని.. ఇరవై ఏళ్ల తర్వాత అలాంటి అవసరం వచ్చిందని చెబుతూ ఓ ఫోటో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్‌సీపీ నాయకులు రకరకాలుగా సెటైర్లు వేస్తున్నారు. వారిపై జనసేన నాయకులు విరుచుకుపడుతున్నారు. ఇలా ఓ వైఎస్ఆర్‌సీపీ సానుభూతిపరుడు.. గతంలో మంచు లక్ష్మి ఇచ్చిన అలాంటి స్టిల్ ఫోటోను వెలికి తీసి.. పవన్ కల్యాణ్ పక్కన పెట్టి.. పవన్ కల్యాణ్ మంచు లక్ష్మిని కాపీ కొట్టారని మీమ్ తయారు చేశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
#PackageStarPK #Visakhapatnam #AndhraPradesh #Hyderabad
— 🦁Journalist Sanju Reddy 🔥 (@ysrcp_ysj) December 11, 2022
ఆఖరికి మంచు లక్ష్మి అక్క స్టిల్స్ కూడా కాపీ కొట్టే స్థాయికి దిగజారి పోయావు కదరా!🐶@PawanKalyan @LakshmiManchu pic.twitter.com/7jphTxsswx
[ఈ పోస్ట్ పవన్ కల్యాణ్ ను కించపరిచేలా ఉంది. అయినప్పటికీ మంచు లక్ష్మి పెద్దగా పట్టించుకోకుండా.. పవన్ కల్యాణ్ పక్కన ఫోటో ఉంచి మీమ్ తయారు చేయడం ధ్రిల్లింగ్ ఉందంటూ.. ఆ ట్వీట్‌ను షేర్ చేసుకుంటూ కామెంట్ చేశారు.
Good or bad I’m thrilled my pic is next to @PawanKalyan garu 🌺🙏☀️🧿🌞 https://t.co/CZC7iJsebd
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) December 14, 2022
మంచు లక్ష్మి తీరు సహజంగానే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను ఆగ్రహానికి గురి చేసింది. వారు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
కామెంట్ ఏదయినా నా ఫోటో పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉండడం సంతోషం, అదృష్టం అంటుంది
— Narendra JSP💐 (@nenunarendra) December 14, 2022
☺️☺️☺️ ఇంకా పవన్ కళ్యాణ్ పక్కన ఫోటో దిగితే ఏమయిపోతుందో....అక్క👍💐
ఇటీవలి కాలంలో మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఇలాంటి ట్రోలింగ్ పోస్టులను ఎక్కువగా షేర్ చేస్తున్నారు. ఎవరమన్నా పట్టించుకోవడం లేదు. కొద్ది రోజుల కిందట సీఎం జగన్ ను ట్రోల్ చేస్తూ పెట్టిన పోస్ట్ చేసి.. లోల్ అంటూ వెటకారం చేశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ వంతు.
Srisailam Bus Accident : శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెనుప్రమాదం
Breaking News Live Telugu Updates: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ విజేతగా నొవాక్ జకోవిచ్
CM Jagan Delhi Tour : రేపు దిల్లీకి సీఎం జగన్, ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు హాజరు
Pattipati Pullarao : టీడీపీ సీఎం అభ్యర్థి చంద్రబాబే, వైసీపీలోనే ఆ కన్ఫ్యూజన్ - పత్తిపాటి పుల్లారావు
Nellore Rural MLA: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - పదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!
మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?
Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేసిన గుజరాత్
BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !