అన్వేషించండి

Andhra Pradesh: రాష్ట్రంలో 16 బార్లకు లైసెన్స్‌లు జారీ - ఈ నెల 28న ఈ - వేలం, ఆన్‌లైన్‌ లాటరీ

ఏపీవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న బార్‌ లైసెన్స్‌ల జారీకి నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఈ నెల 28న ఈ - వేలం, ఆన్ లైన్ లాటరీ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఏపీవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న బార్‌ లైసెన్స్‌ల జారీకి నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. కొత్త బార్‌ పాలసీలో భాగంగా 2022-25కు తగిన ఆప్‌సెట్‌ ప్రైజ్‌ రాకపోవడంతో 16 బార్లకు లైసెన్స్‌లు మంజూరు చేయలేదు. ఇందులో గ్రేటర్‌ విశాఖలో రెండు, కాకినాడ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో ఒకటి, కృష్ణా జిల్లాలోని తాడిగడప, పెడన మున్సిపాలిటీల్లో ఒక్కొక్కటి, ఎన్‌టీఆర్‌ జిల్లాలోని జగ్గయ్యపేట, కొండపల్లి మున్సిపాలిటీల్లో ఒక్కొక్కటి, గుంటూరు జిల్లాలోని తెనాలి మున్సిపాలిటీలో 4, పొన్నూరు మున్సిపాలిటీలో 2, బాపట్ల జిల్లాలో చీరాల మున్సిపాలిటీలో ఒకటి, నంద్యాల జిల్లాలోని నంద్యాల మున్సిపాలిటీ, తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట మున్సిపాలిటీలో ఒక్కొక్కటి చొప్పు బార్ల లైసెన్స్‌లు పెండింగ్‌లో ఉన్నాయి.

ఈ నెల 28న వేలం

ఈ వేలం, ఆన్‌ లైన్‌ లాటరీ విధానంలో బార్లను కేటాయించనున్నారు. ఈ నెల 28న మద్యాహ్నం 3 గంటలకు ఆన్‌ లైన్‌ లాటరీ విధానంలో కేటాయించేందుకు ఎక్సైజ్ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. వీరికి ఈ ఏడాది సెప్టెంబర్‌ 1 నుంచి 2025 ఆగస్టు 31 వరకు మద్యం అమ్ముకునేలా 2023-25 గెజిట్‌ జారీ చేశారు. 50 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలు, నగర పంచాయతీల్లో దరఖాస్తు ఫీజుగా రూ.5 లక్షలు, 50 వేల పైన, ఐదు లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.7.50 లక్షలు, ఐదు లక్షలు పైబడిన ప్రాంతాల్లో రూ.10 లక్షలు దరఖాస్తు రుసుముగా నిర్ణయించారు. ఇది తిరిగి చెల్లించరని గెజిట్‌లో స్పష్టం చేశారు.

ఒక ప్రాంతంలో బార్‌ లైసెన్స్‌ దక్కించుకున్న వారిని ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించనుంది. గతంలో బార్ల లైసెన్స్‌లు ఓపెన్‌ ఆక్షన్‌ విధానంలో ఒకే రోజు మంజూరు చేసేవారు. తద్వారా మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి ప్రభుత్వ రాబడి తగ్గించే వారు. బిడ్డింగ్‌లో ఎవరు ఎంతకు కోట్‌ చేశారనేది కూడా గుట్టుగా ఉండటంతో వచ్చిన దాంట్లోనే అత్యధిక మొత్తానికి లైసెన్స్‌ మంజూరు చేసేవారు. ఒకవేళ అంతకంటే ఎక్కువ మొత్తం కోట్‌ చేసేందుకు సిద్ధమైనా వ్యవధి లేక ఇతరులకు అవకాశం ఉండేది కాదు. ఈసారి లైసెన్సింగ్‌ విధానంలో ప్రభుత్వం దీనికి అడ్డుకట్ట వేయబోతోంది.

ఒకేరోజు కాకుండా ఎంపిక చేసిన రోజుల్లో ఆయా ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ బిడ్లను ఖరారు చేస్తారు. దీనిపై ఇప్పటికే అధికారులు కసరత్తు చేస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో బార్ల లైసెన్స్‌ పొందేందుకు వ్యాపారులకు అవకాశం ఇస్తే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తద్వారా పోటీతత్వం పెరిగి ప్రభుత్వానికి రాబడి పెరుగుతుందని భావిస్తున్నారు.

అత్యధికంగా కోట్‌ చేసిన వారిని హెచ్‌1గా ఎంపిక చేసి లైసెన్స్‌ కేటాయిస్తారు. బార్‌ ఏర్పాటు చేసే ప్రాంతాన్ని బట్టి వచ్చిన బిడ్లలో పేర్కొన్న మొత్తాల్లో ఎక్కువ కోట్‌ చేసిన వారికి అవకాశం లభిస్తుంది. ఒకవేళ ఇద్దరు ఒకే మొత్తాన్ని పేర్కొంటే డ్రా తీసి ఒకరికి కేటాయించడం జరుగుతుంది. ఆయా ప్రాంతాల్లో అత్యధిక కోట్‌ చేసిన వారిని హెచ్‌1గా ఎంపిక చేయడంతో పాటు ఇతర బార్ల లైసెన్స్‌లు కూడా అదే స్థాయిలో కోట్‌ చేస్తే లైసెన్స్‌ మంజూరు చేస్తారు.

కొద్దిగా అటుఇటుగా ఉండొచ్చని చెపుతున్నారు. అంటే 10 శాతం వరకు మాత్రమే తక్కువ కోట్‌ చేసేందుకు అనుమతించనున్నట్లు అధికారులు చెపుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎవరు అత్యధికంగా కోట్‌ చేశారనేది ఇతరులు తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని బట్టి బిడ్‌ మొత్తంలో మార్పులు, చేర్పులు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించనున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget