"మా కుటుంబం మొత్తం మీకు చాకిరి చేయడానికే, మాకు వేరే పనే లేదు" ( Image Source : MLA Kethireddy Facebook )
MLA Kethireddy: ఉదయం 6.30 గంటల నుంచి 9.30 గంటల వరకు తాను, ఆ తర్వాత మధ్యాహ్నం 1.30 గంటల వరకు తన భార్య, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు తన తమ్ముడు ప్రజల్లో తిరుతున్నామని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే తమ కుటుంబం అంతా ప్రజలకు చాకిరీ చేయడం తప్ప.. తమ పనులు చేసుకునే అవకాశమే లేదని అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి. ఎమ్మెల్యే మాట్లాడిన ఈ వీడియోపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ధర్మవరం పట్టమంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మెప్మా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా మెగా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతా పైవిధంగా స్పందించారు. ప్రజల కోసం రోజంతా తిరుగుతున్నా కొందరు తన మీద పడి ఏడస్తున్నారని, ఎమ్మెల్యే అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అంటూ మాట్లాడుతున్నారని వాపోయారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ధర్మవరం నియోజక వర్గ ఇంఛార్జీ పరిటాల శ్రీరామ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన సమావేశంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు శనివారం వైరల్ గా మారాయి.
"పొద్దున్న ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు నేను తిరుగుతుంటే తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నా భార్య తిరుగుతాది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నా తమ్ముడు తిరుగుతాడు. మొత్తం కొంపతో అంతా మీకు చాకిరీ చేయడానికే తప్ప మరేం చేయడానికి లేకుండా పోతాంది. ఇది చేసినా గానీ మా మీద ఏడుపే." - ఎమ్మెల్యే కేతిరెడ్డి
AP Contract Employees: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, పర్మినెంట్ చేయాలని నిర్ణయం
Nara Lokesh: రాయలసీమపై టీడీపీ ఫోకస్, త్వరలో కీలక ప్రకటనలు చేయనున్న నారా లోకేష్!
Top 10 Headlines Today: తెలుగుదేశంతో పొత్తుపై బండి మాటేంటి? జయహో RRR అంటున్న స్పైడర్‌మ్యాన్
Weather Latest Update: ఏపీ, తెలంగాణలో ఇవాళ రికార్డు స్థాయిలో ఎండలు-జూన్ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు!
AP PG CET: ఏపీ పీజీ సెట్-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు
Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు
Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ
Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన