అన్వేషించండి

Kurnool News: బతికుండగానే కుమార్తెకు కర్మకాండలు, ఇష్టంలేని పెళ్లి చేసుకుందని తల్లిదండ్రుల ఆగ్రహం!

Kurnool News: తల్లిదండ్రులకు నచ్చని వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో బతికుండగానే కూతురుకు కర్మకాండలు జరిపించారు తల్లిదండ్రులు. 

Kurnool News: కడుపులో బిడ్డ ఉన్నప్పటి నుంచే వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వారి భవిష్యత్తు గురించి ఎన్నెన్నో కలలు కంటారు. బాగా చదివించి ఉన్నత స్థానంలో ఉంచాలనుకుంటారు. అందరిలాగే ఆ తల్లిదండ్రులు కూడా కలలు కన్నారు. కూతురును బాగా చదివించి.. తమ స్థాయికి తగ్గ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ కూతురు ఓ అబ్బాయిని ప్రేమించింది. అదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారికది నచ్చలేదు. వద్దని వారించారు. అయినా వినని కూతురు.. అతడితో వెళ్లిపోయి ప్రేమ పెళ్లి చేసుకుంది. దీంతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమను కాదని ఇంట్లోంచి వెళ్లిపోయిన కూతురు.. చనిపోవడంతో సమానం అని భావించారు. ఈక్రమంలోనే ఆమె ఫొటోకు దండ వేసి కర్మకాండలు జరిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

అసలేం జరిగిందంటే..?

కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలంలోని హనుమాపురంలో నివాసం ఉంటుంన్న గొల్ల పెద్ద నాగన్న, ఉరుకుందమ్మ దంపతులకు ముగ్గరు కుమార్తెలు. అయితే వీరి పెద్ద కుమార్తె ఇందు.. అదే మండలం వెంకటగిరికి చెందిన ఉరుకుందు అనే యువకుడిని ప్రేమిచింది. అదే విషయాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలిపింది. అయితే వారు కూతురు ప్రేమను అంగీకరించలేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ అతడిని పెళ్లి చేసుకోనివ్వమంటూ పట్టు పట్టారు. దీంతో భయపడిపోయిన యువతి.. తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆమె ప్రేమించిన యువకుడిని పెళ్లాడింది. అయితే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒ వైపు కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే.. మరోవైపు ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే పెద్దకడబూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రేమికుల ఇద్దరినీ పిలిపించి, వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా ఇందు తల్లిదండ్రుల మాట వినలేదు. ఇద్దరూ మేజర్లు కావడంతో అధికారులు వారిద్దరినీ స్టేషన్ నుంచి పంపించి వేశారు. 

మరణం 07-06-2023 అంటూ ఫొటో ప్రింట్

కూతురు ఇందు తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఇంట్లోంచి వెళ్లిపోవడం జీర్ణించుకోలేని తల్లిదండ్రులు.. తమ కూతురు ఇందు 07-06-2023న చనిపోయందని ఓ చిత్రపటాన్ని తయారు చేయించారు. అనంతరం ఆ చిత్రపటానికి పూల మాలలు వేసి ఇ్టమైన ఆహార పదార్థాలు చిత్ర పటం ముందు ఉంచారు. కొబ్బరికాయ కొట్టి, కర్మకాండ జరిపించారు. పుట్టినప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తమకు అన్యాయం చేసి వెళ్లిపోయిందంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ తతంగాన్ని అంతా ఎవరో వీడియో తీసి నెట్టింట పెట్టారు. ఇది కాస్తా వైరల్ గా మారింది. ఎక్కడ చూసిన  ఈ వీడియో, ఫొటోలే కనిపిస్తున్నాయి. 

గతేడాది ఫిబ్రవరిలోనూ ఇంలాటి ఘటనే..!

మహబూబ్ నగర్ జిల్లాలోని చింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన భార్గవి అనే యువతి అదే గ్రామానికి చెందిని వెంకటేష్ అనే యువకుడిని ప్రేమించింది. వీరు ఇద్దరూ సమీప బంధువులే. వీరి మధ్య క్రమంగా ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకోవాలని అనుకొని ఇద్దరూ వారి వారి ఇళ్లలో పెద్దలను ఈ విషయం చెప్పారు. తాము ఇద్దరం ఒకర్నొకరు ప్రేమించుకున్నామని, పెళ్లి చేయాలని కోరారు. అందుకు పెద్దలు ససేమిరా అన్నారు. ఎంత నచ్చచెప్పినా ఇంట్లో వారు ఒప్పుకోకపోవడంతో చేసేది లేక ఎవరికి తెలియకుండా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.  జనవరి 13న స్థానికంగా ఓ గుడిలో ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

ఈ విషయం యువతి ఇంట్లో తెలిసి ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇంట్లో వారిని కూడా కాదని ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుందని భార్గవి తండ్రి కోపంతో రగిలిపోయాడు. ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తన కూతురితో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ పెళ్లితో ఆమె చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా ఆయన తన కూతురు చనిపోయిందంటూ గుండు గీయించుకుని ఆమెకు కర్మకాండలు జరిపించాడు. కూతురి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి అర్పించాడు. కూతురి ప్రేమ వివాహాన్ని భరించలేని తండ్రి చేసిన పని స్థానికంగా చర్చనీయాంశం అయింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Pawan Kalyan News: ప్రతి అడుగు వ్యూహాత్మక ఎత్తుగడ -వైవిధ్యంగా డీసీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్
ప్రతి అడుగు వ్యూహాత్మక ఎత్తుగడ -వైవిధ్యంగా డీసీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Pawan Kalyan News: ప్రతి అడుగు వ్యూహాత్మక ఎత్తుగడ -వైవిధ్యంగా డీసీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్
ప్రతి అడుగు వ్యూహాత్మక ఎత్తుగడ -వైవిధ్యంగా డీసీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్
GV Prakash Kumar: జీవీ ప్రకాష్ కుమార్ చేతికి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'... కన్ఫర్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
జీవీ ప్రకాష్ కుమార్ చేతికి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'... కన్ఫర్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Amaran OTT Release Date: 'అమరన్' ఓటీటీ రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉంది... ఈ నెలలో కాదు, Netflixలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'అమరన్' ఓటీటీ రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉంది... ఈ నెలలో కాదు, Netflixలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget