By: ABP Desam | Updated at : 04 Jan 2022 04:28 PM (IST)
శ్మశానవాటికను పరిశీలిస్తున్న బిజెపి,టిడిపి నేతలు
పుట్టపర్తిలో హెల్త్ క్లినిక్ నిర్మాణం చుట్టూ రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. అన్నిపార్టీలు తమ అజెండాగా ఈ వివాదాన్ని మార్చేశాయి. శ్మశాన వాటికలో హెల్త్ క్లినిక్ నిర్మించాలంటూ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం ప్రస్తుత వివాదానికి కారణమైంది. హెల్త్ క్లినిక్ నిర్మాణానికి ఎవరైనా అడ్డు తగిలితే సహించేది లేదని ఎంఎల్ఏ శ్రీధర్ రెడ్డి వార్నింగ్ ఇచినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వివాదంపై టిడిపి, బిజెపి రంగప్రవేశం చేశాయి.
శ్మశాన వాటికలో హెల్త్ క్లినిక్ ఎలా నిర్మిస్తారంటూ ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇప్పటికే శ్మశానవాటికలో హెల్త్ క్లినిక్ నిర్మాణం కోసం సమాధులను తవ్వేసి చదును చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బిజెపి నేతలు. ఎక్కడా స్థలం లేనట్లుగా శ్మశానమే దొరికిందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు టిడిపి నుంచి కూడా ఇదే ప్రశ్న వస్తోంది. మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి కూడా శ్మశానాలను కూడా ఈ ప్రభుత్వం వదల్లేదంటూ మండిపడుతున్నారు.
పుట్టపర్తిలో హెల్త్ క్లినిక్ నిర్మాణం కోసం అనువైన స్థలం ఎక్కడా దొరక్కపోవడంతో శ్మశానం కోసం వదిలేసిన స్థలంలో నిర్మించదలిచారు. అయితే సమాధులను తొలగించి ఎందుకు హెల్త్ క్లినిక్ నిర్మిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అయితే ఇప్పటికే ఇక్కడ స్థలం ఆక్రమించి ఇళ్ళు కట్టుకొన్నారని, వదిలేస్తే మిగిలిన ఇరవైసెంట్ల స్థలం కూడా ఆక్రమించే అవకాశం ఉన్నందునే అక్కడ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇదే ప్రస్తుతం వివాదానికి కారణం అయ్యింది.
ఇప్పటికే దాదాపు పది సమాధుల వరకు తొలగించారని బాధితులు బిజెపి, జనసేన నేతలకు వివరించారు. ఆక్రమించుకొంటారని, తమ వాళ్ల సమాధులను తొలగించడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు బాధితులు. అయితే ఎట్టి పరిస్థితుల్లోను అక్కడే హెల్త్ క్లినిక్ నిర్మించి తీరుతామంటున్నారు ఎంఎల్ఏ వర్గీయులు. కచ్చితంగా అక్కడ హెల్త్ క్లినిక్ నిర్మిస్తే దానిని కూల్చివేస్తామంటూ బిజెపి నేతలు చెప్తున్నారు.
అయితే ఈ వివాదం రోజురోజుకు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. అధికారులు కూడా ఇప్పటికే అక్కడ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో దాన‌్ని అడ్డుకొలేమంటున్నారు. ఉన్న సమాధులను తొలగించి ఇళ్ళు కట్టుకుంటే పర్లేదు కానీ, ప్రజలకు ఉపయోగపడే హెల్త్ క్లినిక్ మాత్రం కట్టకూడదా అన్నది ఎంఎల్ఏ వర్గీయలు వాదన.
దీంతో గత వారం రోజులుగా ఈ విషయంపై పోలీసులకు కూడా తలనొప్పిగా మారింది. రోజకో పార్టీ నాయకులు ఆందోళన చేయడం, వారిని కంట్రోల్ చేయడం ఇదే పరిపాటిగా మారిందంటూ వాపోతున్నారు. పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ వ్యవహారంలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి మరి.
AP Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగులతో కీలక భేటీ - సీపీఎస్ వివాదం ఇకనైనా తేల్చుతారా, కాలయాపన చేస్తారా !
Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం
Chandrababu: కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికీ ఛాన్స్, ఈసారి 40 శాతం సీట్లు వారికే : చంద్రబాబు
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Chandrababu In Kadapa: జగన్ పులివెందులలో బస్టాండ్ కట్టలేదు, కానీ 3 రాజధానులు కడతారా: చంద్రబాబు
Punjab CM Bhagwant Mann : కాంట్రాక్టుల్లో లంచాలు తీసుకున్న ఆరోగ్యమంత్రి - పదవి తీసేసి అరెస్ట్ చేయించిన పంజాబ్ సీఎం
Congress Task Force 2024: టాస్క్ ఫోర్స్ టీమ్‌ను ప్రకటించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా G 23 నేతలకు కాంగ్రెస్ షాక్
Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?
Quad Summit 2022: భారత్, అమెరికా బంధం మరింత పటిష్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం- జపాన్‌లో మోదీతో బైడెన్