అన్వేషించండి

Kuppam YSRCP : కుప్పం వైఎస్ఆర్‌సీపీ ఖాళీ - జాడలేని ఇంచార్జ్ - టీడీపీలో చేరిపోతున్న ద్వితీయశ్రేణి కార్యకర్తలు

Andhra Pradesh : కుప్పం వైసీపీ ఆఫీసును ఖాళీ చేశారు. ద్వితీయ శ్రేణి నేతలుటీడీపీలో చేరిపోతున్నారు. వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన భరత్ నియోజకవర్గానికి రాకపోవడం సమస్యగా మారింది.

Kuppam YCP office vacated : ఓటమి తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. కీలక నియోజకవర్గాల్లో ఇంచార్జులు పత్తా లేకండా పోవడంతో ద్వితీయ శ్రేణి నేతలు ఇబ్బంది పడుతున్నారు. కుప్పంలో ఐదేళ్ల పాటు హవా చెలాయించి గత ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన  భరత్ పార్టీని పట్టించుకోవడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి ఆయన కుప్పం రాలేదు. జగన్ తో పాటు ఢిల్లీ ధర్నాకు వెళ్లారు కానీ.. కుప్పంకు మాత్రం రావడం లేదు. హైదరాబాద్‌లోనే గడుపుతున్నారు. వైసీపీ హయాంలో కుప్పంలో జరిగిన అనేక అరాచకాలకు భరతే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. 

కేసుల భయంతో ఆజ్ఞాతంలోకి కుప్పం వైసీపీ క్యాడర్             

చంద్రబాబుపై రాళ్ల దాడితో  పాటు టీడీపీ కార్యకర్తలపై దాడులు సహా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణం  టీడీపీ విజయం సాధించిన వెంటనే భరత్ కుప్పం నుంచి వెళ్లిపోయారు. ఆయన అండగా ఉంటారని భావించిన క్యాడర్ .. ఆయన కనిపించకపోవడంతో చాలా మంది ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చంద్రబాబుపై బాంబులేస్తామని.. లేపేస్తామని బెదిరించిన కొంత మంది నేతలు కుప్పంలో కనిపించి చాలా కాలం అయింది. ఇలా ముఖ్యనేతలంతా కుప్పం బయట ఆజ్ఞాతంలో ఉండటంతో.. పార్టీని పట్టించుకునేవారు లేకుండా పోయారు. 

నియోజకవర్గ కార్యాలయం ఖాళీ             

తాజాగా కుప్పం నియోజకవర్గ స్థాయి కార్యాలయాన్ని వేరే హోటల్‌కు అద్దెకు ఇచ్చేశారు. ఇప్పుడు వైసీపీ కార్యాలయంలో చిన్న హోటల్ నడుపుతున్నారు. ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇతర పార్టీల నేతల్ని చేర్చుకునే విషయంలో టీడీపీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూండటంతో అందర్నీ చేర్చుకోవడం లేదు. తాజాగా చంద్రబాబు సమక్షంలో ఐదుగురు కుప్పం కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. మరికొంత మంది ఎంపీటీసీలు చేరారు. టీడీపీలో చేరేందుకు కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కూడా సిద్ధమయ్యారు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుు టీడీపీ నేతలపై దాడులకు పాల్పడ్డారని ఆయనను చేర్చుకోవద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆయన  ఆస్పత్రిపైనే కుప్పం టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దాంతో చేరికల కార్యక్రమం ఆగిపోయింది. 

టీడీపీలో చేరిపోతున్న ద్వితీయ శ్రేణి నేతలు                    

కుప్పం లో చంద్రబాబు తరుపున ఎమ్మెల్సీ శ్రీకాంత్ పార్టీ వ్యవహారాలు చక్క బెడుతున్నారు. వచ్చే కొద్ది రోజుల్లో వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతుందని ఆయన చెబుతున్నారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.250 కోట్లు కేటాయించారన్నారు. హంద్రీనీవా కాలు ద్వారా వచ్చే నీటిని నిలువ చేయడానికి రూ.500 కోట్లతో రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్లు  ప్రకటించారు.  . కుప్పంలో 2000 ఎకరాలతో సెజ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన 40 రోజుల్లోనే కుప్పం అభివృద్ధికి చంద్రబాబు నిధులు కేటాయిస్తున్నారన్నారు. ఎవరైతే తటస్తులుగా ఉండి కుప్పం అభివృద్ధిని కోరుకుంటున్నారో వారందరినీ టీడీపీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు.            

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
Perni Nani Wife:  పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
KTR: ఈడీ నోటీసులొచ్చాయి  కానీ -   కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాంమంత్రి కొండపల్లి శ్రీనివాస్ బొత్స కాళ్లు మొక్కారా?పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
'ఇకపై నెలలో 14 రోజులు ప్రజల్లోనే ' - అన్నీ సరిచేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర కామెంట్స్
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
Perni Nani Wife:  పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
KTR: ఈడీ నోటీసులొచ్చాయి  కానీ -   కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
Pawan Kalyan Sensational Comments: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
Free Bus: ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ - ఉచిత బస్సు ప్రయాణం అమలు ఎప్పటినుంచంటే?
ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ - ఉచిత బస్సు ప్రయాణం అమలు ఎప్పటినుంచంటే?
PSLV C60: ఆ 2 నిమిషాలు ఆలస్యం వెనుక అసలు కారణం ఇదే - స్పేడెక్స్ ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
ఆ 2 నిమిషాలు ఆలస్యం వెనుక అసలు కారణం ఇదే - స్పేడెక్స్ ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు క్లిష్టం చేసుకున్న భారత్ - సిడ్నీలో గెలుపు తప్పనిసరి, ఆ తర్వాత..
డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు క్లిష్టం చేసుకున్న భారత్ - సిడ్నీలో గెలుపు తప్పనిసరి, ఆ తర్వాత..
Embed widget